నారాయణమ్మను ఏ సంస్థ వారు పాఠ్యాంశంగా చేర్చారు ?
- (1) ఆంధ్ర విశ్వవిద్యాలయం
- (2) మైసూరు విశ్వవిద్యాలయం
- (3) శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
- (4) గుంటూరు జిల్లా పదవ తరగతి విద్యార్థులు
You are reading the question paper with answers. This is not the timed test: no clock is running and nothing is being scored.
Go to the timed test →సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ముదివర్తి కొండమాచార్యులు కృష్ణా జిల్లా మైలవరం తాలూకు కుంటముక్కల గ్రామంలో సెప్టెంబరు 2వ తేది 1922లో జన్మించాడు. తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ, రామకృష్ణమాచార్యులు. సుప్రసిద్ధులైన శేషాద్రి రమణకవులకు రామకృష్ణమాచార్యులు మేనత్త కొడుకు. కొండమాచార్యుల బాల్యం తల్లి నరసమ్మ గ్రామమైన ప్రకాశం జిల్లా చిలకపాడులో గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసం సంతనూతలపాడు గ్రామంలో జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. 1950లో, సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ 1951లో ఇంటర్మీడియట్ పరీక్షలో ద్వితీయ శ్రేణిని పొందాడు. 1958లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే ‘షార్టు సర్టిఫికేట్ కోర్సు’ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.
కొండమాచార్యును నెల్లూరులో 1940లో వివాహం లక్ష్మమ్మ, శ్రీనివాస వరదాచార్యుల కుమార్తె ఇందిరమ్మతో జరిగింది. శ్రీనివాస వరదాచార్యులు ‘బిల్హణీయ’ కావ్యకర్తైన చిత్రకవి సింగారాచార్యుల వంశానికి చెందిన వ్యక్తి. కొండమాచార్యులకు కొడుకు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.
కొండమాచార్యులు 1942వ సంవత్సరంలో గవర్నమెంటు ట్రైనింగ్ స్కూల్, నెల్లూరులో హయ్యర్ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1950 నుండి 1978 వరకు నెల్లూరు జిల్లా గూడూరులో ‘తెలుగు పండిట్’గా చేశాడు. 1978లో పదవీ విరమణ చేసి 1980 అక్టోబరు నుండి ధార్మిక ప్రబోధ కేంద్రాధ్యాపకుడుగా ‘సప్తగిరి’ పత్రిక కార్యాలయంలో సంపాదకుడిగా, పుస్తక పరిష్కర్తగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేరాడు.
సాహిత్య జీవితం : కొండమాచార్యుల రచనలు వ్యక్తిగతమైన కీర్తిని అందజేశాయి. కొండమాచార్యుల సాహిత్యం ఖండకావ్యాలు, నవలలు, వ్యాసాలు, గ్రంథ సమీక్షలు, పాటలు, పద్యాల రూపంలో విస్తరించి ఉంది. ఖండ కావ్యాలు కొండమాచార్యుల రచనలన్నింటిలోనూ తలమానికాలు. ‘నారాయణమ్మ’ (1965) ‘పూర్ణాహుతి’ (1977) ఖండ కావ్యాలు స్థానిక ప్రజలలో ప్రచారంలో ఉన్న వాస్తవిక విషయాలాధారంగా రచింపబడ్డాయి. మరికొన్ని ఖండ కావ్యాలు 1946లో ‘ధర్మదీక్ష’ 1947లో ‘అమరసందేశము’, 1948లో ‘వీరమ నీడు’, ప్రచురింపబడ్డాయి. ‘కూనలమ్మ’ 1970లో రచించాడు. నవలా రచయితగా శ్రీముదివర్తి కొండమాచార్యులు 1947లో తుగ్లక్, 1953లో ‘కనిష్ఠ బిక్షువు’, ప్రచురించాడు. 1971లో ‘కుమార రాముడు’, 1973లో ‘గౌతమ చరిత్ర’, ‘బలి నిషేధము’, 1974లో ‘ప్రచండ కేళికలు’, 1986లో అమృత సారము ముద్రించాడు.
కొండమాచార్యుల వ్యాసాలు చాలా ‘జమీన్ రైతు’ పత్రికలోనే ప్రచురింపబడ్డాయి. 1972లో ‘శ్రీమతి పెనుబల్లి జయలక్ష్మమ్మ’ 1978 లో ‘దీపాల వారి భారతి’, 1979లో ‘బూతుచెప్పినా నీతిచెప్పినా కవి చౌడప్ప చెప్తేనే రాణింపు’ 1979లో ‘శతకాల మకుటం సింహాద్రి నారసింహ శతకం’, 1980లో ‘వేదగిరి నృసింహాలయం’, 1987లో ‘చింతా దీక్షితులు’ మొదలైన వ్యాసాలన్నీ జమీన్‌రైతులో చూడవచ్చు.
కొండమాచార్యుల గ్రంథ సమీక్షకులు కూడా జమీన్ రైతులో ప్రచురణ పొందాయి. 1979లో బెజవాడ గోపాలరెడ్డి, ‘కాలవాహిని’ పై చేసిన సమీక్ష, 1980లో బెజవాడ గోపాలరెడ్డి ‘సాహిత్య సుందరి’ పై చేసిన సమీక్ష, 1981లో చదలవాడ జయరామశాస్త్రి వ్రాసిన ‘శ్రీ మద్భాగవత భూమిక’ పై వ్రాసిన సమీక్ష ‘జమీన్‌రైతు’ పత్రిక ప్రచురించింది.
కొండమాచార్యులు కావ్యాలు, వ్యాసాలు, గ్రంథ సమీక్షలే కాకుండా సినిమాలకు పాటలు, పద్యాలు వ్రాశాడు.
కొండమాచార్యులను అనేక సంస్థలు, విద్యాలయాలు, కవిగా-రచయితగా, వ్యాసకర్తగా గుర్తించి సన్మానించాయి.
1946 లో ఆంధ్రసభ - నెల్లూరు కొండమాచార్యులను సన్మానించింది. 1950లో తిక్కవరపు రామిరెడ్డి ‘కవిత్రయ జయంతుల’ సందర్భంలోనూ, 1966లో గడియారం శేషయ్య శాస్త్రి ఆధ్వర్యంలో నంద్యాలలోనూ 1966లో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల తిరుపతిలోనూ, 1973లో ఆచార్య జి.యన్. రెడ్డి అధ్యక్షతలో శ్రీరామ విలాస సభ, చిత్తూరులోనూ, 1977లో డా.బి. గోపాలరెడ్డి అధ్యక్షతలో ఆర్.ఎల్.రెడ్డి ట్రస్ట్ కమిటీ తిక్కన సాహితీ సదస్సు, నెల్లూరులోనూ, 1978లో అల్లసాని పెద్దన, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి జయంతుల సందర్భంగా గూడూరులోనూ, ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన సందర్భంలో నెల్లూరులోనూ, సన్మానాలు పొందారు వీరు.
కొండమాచార్యుల రచనలు హైస్కూళ్ళలోనూ, కళాశాలలోనూ, విశ్వవిద్యాలయాలలోనూ పాఠ్యాంశాలుగా గ్రహింపబడ్డాయి. కొండమాచార్యులు ఖండకావ్యాలలో ‘ధర్మదీక్ష’ 1946-47 ప్రాంతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఆనర్సు-భాషా ప్రవీణ ఫైనల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఏర్పాటు చేసింది. ‘అమర సందేశము’ 1947లో అదే విశ్వవిద్యాలయంలో భాషా ప్రవీణ విద్యార్థులకు పాఠ్యాంశంగా గ్రహింపబడింది. ‘వీరమ నీడు’ 1948లో ఆంధ్ర విశ్వవిద్యాలయం బి.ఏ. ఆనర్సు స్పెషల్ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఏర్పాటు చేసింది. ఇదే కావ్యం 1987లో మైసూరు విశ్వవిద్యాలయంలో బి.ఏ. తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఏర్పాటు చేయబడింది. ‘నారాయణమ్మ’ 1972లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్వాన్ ఫైనల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఏర్పాటు చేసింది. ‘తుగ్లక్’ నాలుగవ తరగతికి ‘బలి నిషేధము’ రాయలసీమ, గుంటూరు జిల్లా పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా చేయబడ్డాయి.
కొండమాచార్యుల వ్యక్తిత్వం. కవిగా, వ్యాసకర్తగా, గ్రంథ సమీక్షకుడిగా, పాటల రచయితగా పరిణితి రచనా క్రమంలో స్ఫుటంగా వ్యక్తీకరింపబడ్డాయి.
నారాయణమ్మను ఏ సంస్థ వారు పాఠ్యాంశంగా చేర్చారు ?
బిల్హణీయ కావ్యకర్త :
ముదివర్తి కొండమాచార్యుల వారిని 1946లో సన్మానించింది :
కొండమాచార్యులు జన్మించిన సంవత్సరం :
సప్తగిరి పత్రికలో సంపదకుడిగా ఎప్పుడు చేరారు ?
1958లో ఏ కోర్సులో ఉత్తీర్ణులయ్యారు ?
‘శ్రీమద్భాగవత భూమిక’ రాసినవారు :
వీరమ నీడు ప్రచురింపబడిన సంవత్సరం :
‘సాహిత్య సుందరి’ రచన ఎవరిది ?
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకుగల ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
శతఘంటాపరిభూషితంబును జగత్సంహారఘోరానలో
త్థిత కీలాసదృశంబునై మెఱయు శక్తిం బూన్చి మంత్రించి యు
ద్ధతతేజుండు ప్రహస్తు వైచిన వెసం దత్క్రూరసంపాత పా
టితవక్షుం డయి కూలె వాఁడు శతకోటిచ్ఛిన్నశైలాకృతిన్.
నేలకూలినది ఎవరు ?
పద్యంలోని అలంకారము :
పద్యంలో యతి ఏయే అక్షరాలకు చెల్లుతుంది ?
పద్యంలోని ఛందస్సు ఏమిటి ?
శైలాకృతిలోని సంధి :
పరిభూషితము అంటే ____.
ఈ క్రింది వాటిలో ఏది సంస్థాగత లేఖనం పరిధిలోకి రాదు ?
భాషా అభ్యసనం, భాషా సముపార్జనంలో అంతర్గతత్వ పరిగల్పన అనేది ఏమిటి ?
‘విషయ ఆధారిత భాషా సమాచారం’ దేనిని సూచిస్తుంది ?
భాష నేర్చుకోవడానికి పదాలు, పదశకలాలు, పునాదులు అనే విషయాన్ని ఏ భాషా బోధనా పద్ధతి ప్రాతినిధ్యం వహిస్తుంది ?
పాఠశాల విద్యలో ఈ క్రింది వాటిలో ఏది బహుళ భాషావాదం యొక్క లక్ష్యం కాదు ?
ఒక వాచకం గురించి స్థూల అభిప్రాయం కలగటానికి వాణి ఒక వ్యాసం చదువుతోంది. ఆమె పఠనాన్ని ఏమనవచ్చు ?
పాఠశాల-ప్రాతిపదిక మూల్యాంకనం ప్రోత్సహించటానికి రెండు సముచిత పఠనాలను ఎంపిక చేయండి.
(a) అభ్యాసకులు, బోధకుల యొక్క స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహించేందుకు ఇది ఉపకరిస్తుంది
(b) పాఠశాల తన ప్రణాళిక తాను వేసుకోవడానికి వీలు కల్పిస్తుంది
(c) పరీక్ష బోర్డుకున్న అధికారం ఎటువంటిదో గ్రహిస్తుంది
(d) మూల్యాంకనా ప్రణాళికల క్రమంలో అభ్యాసకుడిని క్రియాశీల భాగస్వామిగా చేర్చుకోదు.
ఈ క్రింది వాటిలో ఏ విద్యా తత్వం దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంది ?
ముందుగా నిర్దేశించుకున్న బోధనా క్రమానికి బదులుగా వాస్తవ ప్రపంచ వాతావరణం లేదా విషయాధారిత అభ్యసన పద్ధతులను ఉపయోగించటం.
రాహుల్ అనే ఆరవ తరగతి అభ్యాసకుడు నూతన వ్యాకరణ రూపాన్ని నేర్చుకునే సందర్భంలో ఇంతకుముందు నేర్చుకున్న దానితో ముడిపెట్ట గలిగాడు. ఈ క్రింది వాటిలో ఏ వ్యూహం దీని నుంచి వస్తుంది ?
ఎనిమిదవ తరగతికి బోధించే ఒక ఉపాధ్యాయురాలు, సంక్షిప్త వాచకం యొక్క ఏడు వాక్యాలను చదువుతుంది. ఆ పిదప తన అభ్యాసకులను శ్రద్ధతో దానిని ఆ వాచకానికి దగ్గరగా ఉండేట్లుగా పున:సృష్టి చేయమని అడుగుతుంది. తాను చదివిన వాక్యాలు యథాతథంగా ఉండనక్కర్లేదు. ఈ వ్యూహాన్ని ఏమంటారు ?
అభ్యసన ఫలాల విషయంగా ఈ క్రింది లక్ష్యాలలో ఏవి సరైనవి ?
(a) విషయ ప్రధాన దృష్టి అభ్యసనం కంటే సామర్థ్య ప్రాతిపదిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది.
(b) భాషను సృజనాత్మకంగా వాడేందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు పొందేలా చేస్తుంది.
(c) విషయం మీద పట్టు సాధించి తరువాత దానిని అను ప్రయుక్త పరచేట్లు చేయటం.
(d) ప్రత్యేక ప్రయోజనాలు నెరవేర్చటానికి అభ్యాసకులు భాషను ఉపయోగించేట్లు చేస్తుంది.
వ్యాకరణం నేర్చుకునే సందర్భంలో ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన ‘విధాన క్రమ జ్ఞానం’ను ఉత్తమంగా వివరిస్తుంది ?
ఉషారాణి అనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు తన అభ్యాసకులు తమ రోజువారి పనుల కోసం ఇంగ్లీషు మాట్లాడటాన్ని ప్రోత్సహిస్తుంది. వారికి సూత్రబద్ధ ఉదాహరణలు బోధిస్తుంది. తన అభ్యాసకులలో ఏమి వృద్ధి పొందేందుకు ఆ ఉపాధ్యాయురాలు ప్రయత్నిస్తున్నది ?
ఒక ఉపాధ్యాయురాలు తన ఏడవ తరగతి అభ్యాసకులు చేసే కొన్ని రకాల దోషాలను సేకరిస్తుంది. విద్యార్థులకు వాటి పట్ల ఎరుక కలిగేందుకు నెలకు ఒకసారి వాటి గురించి చర్చిస్తుంది. ఆ దోషాలు ఎవరివో ఆమె చెప్పదు. ఆమె అభ్యాసకులను తమ తమ పొరపాట్ల గురించి మాట్లాడమని కోరుతుంది. ఈ ఆచరణను ఏమంటారు ?
పదాలను మనం విన్నప్పుడు లేదా చూసినప్పుడు వాటిని గుర్తించడాన్ని ఏమంటారు ?
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పుట్టడంతోనే ఆధునిక కథా లక్షణాలన్నీ సంతరించుకుని తెలుగు కథ పుట్టిందన్నది తెలుగు సాహిత్య చరిత్రకారుల ఉమ్మడి అభిప్రాయం. కథానికని ఇక్కడనుంచి వాడుకలో ఉన్నట్టే కథ అందాం, కథలో రెండు ప్రధాన అంగాలు వస్తువూ, కథనం. కథ మొదలుపెట్టాక విడవకుండా చదివించేలా ఉంచేది కథనం. చదివేక మనుసులో నిలిచిపోయేది వస్తువు. ఇవి రెండూ సమతూకంగా అమరిన కథ బాగా రాసిన కథ. ఇది ఒక భావన. ఈ భావనను పూర్తిగా అంగీకరించాలంటే అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ఒక కథ అందరు పాఠకులనీ సమంగా ఆకట్టుకోగలదా-అన్నది ప్రధాన ప్రశ్న. ఒక వస్తువు అందరికీ అంగీకృతం కాదని మనం సులువుగానే ఒప్పుకుంటాం. కాని కథనం విషయంలో ఆలోచనలో పడతాం. తెలుగు కథలో వస్తువు ప్రధానంగా అది కూడా సమాజ సంబంధిగా ఉండటానికి ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. కథకులు అలాంటివి రాయటానికి, చదువరులు చదవటానికీ ఇష్టపడతారు. ఈ లక్షణం వల్ల సాహిత్యమూ, అందులో కథా వస్తు ప్రధానంగా, ఆ వస్తువు కూడా సమాజ విమర్శ ప్రధానంగా ఉండటం తెలుగు సాహిత్య ప్రత్యేక లక్షణం అయింది. కథనం ఆదినుంచీ రెండవ స్థానంలోనే ఉంది. ఈ లక్షణం వల్ల తెలుగు కథ సమాజంలో వచ్చిన ప్రతి ఉద్యమాన్నీ అనుసరించింది. సంస్కరణ, స్వాతంత్ర్య, జాతీయ, వామపక్ష, అస్తిత్వ ఉద్యమాలు కథని ప్రభావితం చేసాయి.
ఆనకట్టలతో పచ్చగా మారిన కృష్ణా, గోదావరి ప్రాంతాలలో తొలి తెలుగు పత్రికలు, పుస్తక ప్రచురణ వసతులూ, వ్యాపారమూ పుట్టాయి. తొలి కథకులు తెలుగు ప్రాంతపు సరిహద్దులనుంచి రావటం, పత్రికలు మధ్యభాగం నుంచి రావటం గమనార్హం. స్త్రీల పత్రికలు తెలుగులో మొదటి నుంచీ వెలువడ్డాయి. 1902 మేలో ఆరంభమైన హిందూ సుందరిలో అచ్చమాంబ ధనత్రయోదశి కథ నవంబరులో ప్రచురించారు. 1910 మాఘ మాసం (జనవరి- ఫిబ్రవరి)లో ఆరంభమైన ఆంధ్రభారతి తొలి సంచికలో దిద్దుబాటు వెలువడింది. 1905లో పుట్టిన ఆంధ్ర పత్రిక 1910 నుంచి ఉగాది సంచికలు వెలువరించటంతో శ్రీపాద, పానుగంటి, రాయసం వెంకటశివుడు, చింతా భీమశంకరం-దీక్షితులు వంటివారు కథలలో కలం పెట్టారు. 1924లో భారతి, 1928లో గృహలక్ష్మీ, 1929లో చిత్రగుప్త ఆరంభమై కథకు ప్రత్యేక స్థానం ఇచ్చాయి. కనుపర్తి వరలక్ష్మమ్మ, పులవర్తి కమలాదేవి వంటి అనేక మంది స్త్రీలు కథారచనలో పాల్గొన్నారు.
ఇంతవరకూ కథానిలయం సేకరించి, లెక్కించగలిగిన మేరకు ఈ వంద సంవత్సరాలలో 12 వేలకి మించిన కథకులు 60 వేల కథలు రాసారు. మరో 60 వేల కథలు వెలువడి ఉండవచ్చు. కథకుల సంఖ్య మరో మూడు నాలుగు వేలకు చేరవచ్చు. 1947 కి ముందు రాసిన కథకులు ఈ 12 వేలలో 2 నుంచి 3 వేల వరకూ ఉండవచ్చు. దాదాపు 10 వేల మంది కృషి చేసిన కథా వ్యవసాయంలో వారు ప్రదర్శించిన శక్తియుక్తులను, స్పందనలను ఒక వ్యాసపరిధిలోకి తీసుకురావటం సాధ్యం కాదు. వీలయినన్ని ధోరణులను గుర్తించి. వాటికి ప్రేరణలనూ కారణాలనూ చర్చించి, ప్రస్తావనశాత్తూ కథా పరిణామంలో మార్పులకు హెచ్చుగా కారణమైన వారిని స్పృశిస్తూ, కొండ గుర్తులనదగ్గ కథలను ఉగ్గడిస్తూ ఈ 63 ఏళ్ల కథా ప్రయాణంలో పరిశీలనాంశాలను ఆసక్తిగల వారి ముందుంచటానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తోంది.
భారతదేశంలో మూడు ముఖ్య రాజకీయ దశలను గమనించవచ్చు. 47-67 మధ్య ఒక ఆదర్శ దశ, దాని వైఫల్యం ఉన్నాయి. 67-87ల మధ్య ఒక పెను సంక్షోభం, దాని అణిచివేత, అవకాశ వాదం, దాని కాలుష్యం ఉన్నాయి. 87 నుంచి ఇప్పటి వరకూ ఆర్థిక సంస్కరణల ప్రవేశం, నేరుగా ప్రజా జీవితంపై ప్రభావం, ప్రపంచ వ్యాపారీకరణ, ఉన్నాయి.
ఈ మూడు దశలనూ, వాటిని గురించి తెలుగు కథ స్పందనలను పరిశీలిస్తే తెలుగు కథ ప్రయాణం దాని మలుపులూ అవగతమవుతాయి.
నెహ్రూ పరిపాలనలో, అనేకమంది స్వాతంత్ర్య ఉద్యమ దిగ్గజాల రాష్ట్ర నాయకత్వంలో ఎన్నో ఆశలతో సామాన్య ప్రజానీకం తమ జీవితాలలో అద్భుతమైన మార్పులు వస్తాయని ఎదురుచూడటంతో మొదలయింది. గురజాడ వారి కన్యాశుల్కంలో జట్కావాడు స్వాతంత్ర్యం వస్తే మావూరి హెడ్ కానిస్టీబులు పోతాడా అని అడుగుతాడు. సామాన్యుని నిజజీవిత సమస్యలు పరిష్కరించబడతాయన్న ఆశ అందులో వ్యక్తమవుతుంది. 1948 జూలైలో వెలువడిన శారద కథ స్వాతంత్ర్య స్వరూపం ఆనాటి ఆలోచనాపరుడైన రచయిత మనస్థితికి, స్వాతంత్ర్యానంతర భవిష్యత్తు మీద నిరాశకీ మచ్చుతునక. రాజ్యాంగం ప్రకటించిన సోషలిస్టు లక్ష్యాలను మేధావులు తర్జుమా చేసి జనానికి చెప్పారు.
ముఖ్యంగా సాంకేతిక రంగ మేధావులు ఉన్న కొద్ది వనరులతో దేశ కల్యాణ పథకాలలో నిమగ్నమయారు. అధికారంలో లేని వామపక్షాలు, మతపక్షాలు చిత్తశుద్ధితో తమ భావాల వెనక నడిచాయి.
భారతదేశ విభజన దానికి ముందూ వెనకా నడిచిన మత కలహాలూ అందులో ప్రాణాలూ, మానాలూ, స్వస్థానాలూ కోల్పోయిన దారుణం తెలుగు ప్రాంతానికీ, కథకీ దూరంగా సాగింది. రావిశాస్త్రి, బలివాడ వంటి భవిష్యద్రచయితలు దెయ్యాలకు ద్వేషాల్లేవు, అమ్మ వంటి కథలు రాసారు. మహాత్ముని మరణం దేశాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తింది. అనేక కావ్యాలూ, బుర్రకథలూ తెలుగులో వెలువడినాయి. కొకు బాపూజీ హత్య అన్న కథ రాసాడు.
తెలుగు నాట తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది. ఇది జరిగినది తెలంగాణాలోనే అయినా వామపక్షాల వారు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ఈ ఉద్యమం పై తెలుగు కథకుడు చాలా కథలు రాసాడు. వట్టికోట ఆళ్వారు స్వామి జైలులోపల, అడ్లూరి అయోధ్య రామకవి తెలంగాణ మంటల్లో వంటి కథా సంపుటాలు వచ్చాయి. ఉప్పల లక్ష్మణరావు, బొల్లిముంత శివరామకృష్ణ, శారద వంటి కథకులు కథలు రాసారు. ముల్కీ నిరుద్యోగాన్ని తొలగించలేదని నౌఖరీ అన్న కథ వచ్చింది.
ఆంధ్ర రాష్ట్రం కోసం మరో పెద్ద ఉద్యమం జరిగింది. దీనిపై కూడా తెలుగు కథకుడు స్పందించి కథలు రాసాడు.
స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదులు హెచ్చుగా పాల్గొంటే వామపక్ష భావజాలం తెలుగునాట వ్యాపించటానికి ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేసారు. వీరు కథా సృజనలో కూడా పాల్గొన్నారు. వీరి కృషితో ఈ భావజాలానికి అంకితమైన ఒక యువతరం సృష్టించబడింది.
ఈ సమయంలో సాహిత్యంలో చలం, కొడవటిగంటి, విశ్వనాథ కొన్ని ప్రముఖ ధోరణులకు చిహ్నాలు. వీరిలో కొడవటిగంటి ప్రధానంగా కథకుడు. ఈయన వామపక్ష కథకుడు. మధ్య తరగతి-ఆనాటికి ఉండీ లేని, మారీ మారని, మారక పోతే బ్రతుకు గడవదని గ్రహించిన బ్రాహ్మణ కుటుంబాలు - సంస్కారంలో మార్పుల అగత్యం గురించి వందలాది కథలు రాసాడు. స్త్రీల పరిస్థితిలో సమూలమైన మార్పులు రావాలని ఆశించాడు.
1924లో వచ్చిన పత్రిక :
బాపూజీ హత్య అనే కథ రాసింది :
ఈయన ప్రధానంగా కథకుడు :
జైలులోపల కథలు రాసింది :
ధన త్రయోదశి కథ ఎవరిది ?
అడ్లూరి అయోధ్య రామకవి రచన ఏది ?
చిత్రగుప్త ఏ సంవత్సరం ఆరంభమైంది ?
హిందూ సుందరి పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది ?
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆంధ్రప్రదేశ్ చరిత్ర రచన మూలాలు 19వ శతాబ్దంలో ఆరంభమై, 20వ శతాబ్ది తొలిదశకాలకు స్పష్టమైన రూపుదిద్దుకున్నాయి. సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయతాభావజాలం, ప్రత్యేకాంధ్ర ఉద్యమాల స్ఫూర్తితో ప్రభావితమై పెంపొందింది. కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన విజ్ఞాన చంద్రకామండలి (1905) ద్వారా తెలుగు వారి చరిత్ర, సంస్కృతులకు శ్రీకారం చుట్టాడని పలువురి అభిప్రాయం. రూఢార్థంలో యిది వాస్తవమే! కానీ, అంతకుముందే కొందరు సాహిత్య మూర్తులు చరిత్ర రచనా ప్రక్రియను సూత్రప్రాయంగా ప్రారంభించారన్న దాఖలాలున్నాయి. ‘మధురా విజయ’ (వీరకంపరాయచరిత్ర) మనే కావ్యాన్ని గంగాదేవి సంస్కృతంలో రచించారు. 14వ శతాబ్ది ఆఖర్లో జీవించిన గంగాదేవి క్రీ.శ. 1371 లో మధురను జయించిన వీరకంప రాయని భార్య. విజయనగర రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయలలో బుక్కరాయల కుమారుడే ఈ వీరకంపరాయుడు. అప్పటి చారిత్రికాంశాలను నిర్దుష్ట కాలక్రమణిక ప్రకారం వర్ణించడం ఈ గ్రంథంలోని ప్రత్యేకత. ఇది చరిత్ర రచన ఆరంభమేకాని నిజానికి చరిత్ర కాదు.
19వ శతాబ్ది పూర్వ భాగంలో కావలిసోదరుల సహాయంతో (కావలి వెంకట బొర్రయ్య, వెంకట రామస్వామి) చరిత్ర కనువైన, అరుదైన ఆధారాలను - స్థానిక విశేషాలు, తాళపత్ర ప్రతులు, అనువాదాలు, పటాలు, బొమ్మలు, పురావస్తు విశేషాలు. శిల్పాలు, రాతి, రాగి శాసనాలు, నాణేలు - సేకరించారు. శాసన లిపులను పరిష్కరించి, పరిశోధించి నివేదికలు తయారు చేశారు. కావలి వెంకట రామస్వామి రాసిన ‘దక్కన్ కవుల చరిత్ర’ దక్షిణ భారతదేశపు కవుల గూర్చిన చారిత్రక గ్రంథం. శాసనాలు, లిపులు పరిష్కరించిన కావలి వెంకట బొర్రయ్య వాస్తవంలో తెలుగువారి మొదటి చరిత్రకారుడుగా పరగణించవచ్చు!
కావలి సోదరుల తర్వాత ఆంధ్రుల చరిత్ర రచనలో బుక్కపట్నం రాఘవాచార్యుల గూర్చి ప్రస్తావించుకోవాలి. ఆంధ్రుల చరిత్రను గ్రంథస్థం చేసి అందులో కళింగరాజుల గూర్చి కొంత సమాచారాన్ని చేర్చాడు. ఈ గ్రంథం ప్రచురితమైందో లేదో తెలీదు. ఒకటికి పైగా సంపుటాలు బుక్కపట్నం వారు రాశారనీ, వాటిని అప్పటి మద్రాసు రాజధాని రెవెన్యూ బోర్డు సభ్యుడైన కార్మికేల్ అభిప్రాయం కోసం పంపాడని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు రాశారు. మద్రాసు నగరంలోని గుజిలీ బజారులో రాఘవాచార్యుల రాతప్రతులను మానవల్లి రామకృష్ణ కవి చూశారని వేటూరి వారు అభిప్రాయ పడ్డారు. కాకతీయుల శాసనాల ఉటంకింపు రాఘవాచార్యులు చేశాడని, ‘కువలయాశ్వచరిత్ర’ రాశాడని శాస్త్రిగారు రాశారు. రాఘవాచార్యులు వినుకొండ వాసి. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం చేశాడు.
20వ శతాబ్ది ప్రారంభంలో, రాబర్ట్ స్యూయల్ లండన్ నుండి ‘Forgotten Empire’ ప్రచురించాడు. ఆంధ్రుల గత చరిత్రపై లోతుగా పరిశోధనలు చేపట్టేందుకు ఈ గ్రంథం దోహదం చేసింది. పాశ్చాత్య విద్య. సాహిత్యాల పరిచయంతో తెలుగు దేశపు మేధావులు కొత్త సాహితీ ప్రక్రియలను చేపట్టారు. కందుకూరి వీరేశలింగం రచించిన ‘ఆంధ్రకవుల చరిత్రము’ దీనికొక వుదాహరణ. తెలుగు కవుల గూర్చి రాస్తూ. వీరేశలింగం ఆయా కవుల చారిత్రక నేపథ్యాన్ని గూడ వివరించాడు. ఒక సాహిత్యకారుని గూర్చిన చర్చలో లేదా ఒకరి జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు, వారి ‘కాలాన్ని’ (Times) గూర్చిన అవగాహన తప్పనిసరి.
1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్ ఏర్పడింది. ఆంధ్రుల చరిత్రలో ఇదొక ముఖ్యఘట్టం. దీని వ్యవస్థాపకులు జయంతి రామయ్య పంతులు భాషా శాస్త్రవేత్త. శానన పరిశోధకులు. కడప శాసనాలను పరిష్కరించి వెలువరించిన ఘనత వీరిదే! ముందే చెప్పుకొన్నట్టు కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన విజ్ఞాన చంద్రికా మండలి, జాతీయ భావజాల ప్రేరణతో వచ్చిందే. ఉప్పెనలా ఎగసిన జాతీయతా భావాలు దేశీయ, ప్రాంతీయ చరిత్రల సృష్టికి ఎనలేని దోహదం చేశాయి. చరిత్ర రచనకు కావల్సిన పూర్వరంగాన్ని - పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాలను మండలి సేకరించింది. వచనంలో చరిత్ర, శాస్త్ర, కళావిషయాల పై రచనలు చేయించాలని విజ్ఞాన చంద్రికామండలి సంకల్పించింది. వీరి మొదటి గ్రంథం గాడిచెర్ల హరి సర్వోత్తమరావు రాసిన ‘అబ్రహం లింకన్’ జీవిత చరిత్ర. కొమర్రాజు వారు రాసిన హిందూదేశ సంగ్రహము (1907) ఏడు ముద్రణలతో మన్ననలు పొందింది. తన సహచరుడైన చిలుకూరి వీరభద్రరావును ఆంధ్రుల చరిత్రను మూడు సంపుటాల్లో రచించమని కోరాడు. గతాన్ని కీర్తించే జాతీయ చరిత్ర రచనా సంప్రదాయంలో ఈ చరిత్రలు రాశారు. ఆంధ్రదేశంలోని అన్ని ప్రాంతాలకు సరైన ప్రాముఖ్యం ఈ సంపుటాల్లో లభించినా, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతికాంశాల ప్రస్తావన సంతృప్తికరంగా లేదు. కొమర్రాజు రచనల్లో మతతత్వం చోటుచేసుకొందన్న విమర్శలొచ్చినా, తనది ఏ మాత్రం మత దృష్టికాదని కొమర్రాజు విమర్శలను ఖండించారు.
ఆంధ్రుల చరిత్రలో తర్వాత చెప్పుకోదగ్గ కూడలి తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో ఆరంభమైంది. ఆంధ్రుల ప్రాచీనత, ఘనత, సాంస్కృతిక వారసత్వాలను వెలికితీసి, వాటికొక విశ్వసనీయతను కల్పించాల్సిన అవసరం వున్నదన్న ఆలోచన కలిగింది. జాతీయతకు భాషాపరమైన భావన బలంగాతోడై, 1925లో రాజమండ్రిలో Andhra Historical Research Society ఏర్పడింది. కొమర్రాజు సహచరులు, అనుచరుల్లో ముఖ్యులు - మల్లంపల్లి, చిలుకూరి, రాళ్లబండి, భావరాజు, న్యాపతి ప్రభృతులు ఈ సంస్థలో ప్రముఖ పాత్ర వహించారు. ప్రాంతీయ, స్థానిక చరిత్రలకు ప్రాధాన్యత పెరిగింది. మరుగున పడిన శాసనాలు, నాణేలకు మెరుగులు దిద్దారు. తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, ఆంధ్రుల తొలి రాజవంశాలు, తూర్పు గాంగులు తదితర రాజవంశాలపై పరిశోధనా గ్రంథాలతో పాటు రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక, రెడ్డిసంచిక, కళింగ సంచికలు వెలువడ్డాయి. క్రమం తప్పకుండా పరిశోధనా జర్నల్ (32 సంచికల)ను వెలువరించారు. తాళపత్ర వ్రాతప్రతుల కేటలాగును తయారుచేసి భావితరాలకు అందించింది.
1950 దశకానికి కొద్ది ముందు వెనుకలుగా ఆంధ్రుల చరిత్ర రచన గణనీయ మార్పులకు లోనైంది. 1949లో వెలువడ్డ సురవరం ప్రతాపరెడ్డి గ్రంథం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ సామాజిక చరిత్ర రచనకు శ్రీకారం చుట్టింది. జాతీయ, పునరుజ్జీవనోద్యమాల దశకంటె భిన్నంగా ఈ దశలో వెలువడ్డ చరిత్రలు మరింత సమగ్రతను సంతరించుకొని, ప్రభుత్వ నిర్మాణం, సామాజిక పరిస్థితులతోపాటు, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో జరిగిన మార్పుల గూర్చి వివరించాయి. కానీ, పురావస్తు పరిశోధనల్లో లభించిన ఆధారాలను సమర్థిస్తూ సాహిత్యాధారాలతో కలిపి పోల్చి చూడలేక పోయాయి. తొలి, మధ్యయుగాల్లో రాజవంశాల్లో, రాజవంశాల మధ్య జరిగిన కుట్రలు, చిన్నపాటి యుద్ధాల గూర్చి విమర్శనా దృష్టితో వివరించలేకపోయాయి. యధాలాప రాజకీయ ఘటనలు గానే వాటిని పరిగణించడంతో, రాజ్య నిర్వహణలో వున్న కీలకాంశాలను గ్రహించడంలో విఫలం చెందారు. మధ్యయుగాల నుండి ఆధునిక యుగానికి జరిగే పరిణామాన్ని, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో సంభవించే తీవ్రచారిత్రక మార్పుల పర్యవసానంగా విశ్లేషించడంలో కృతకృత్యులు కాలేకపోయారు. అప్పటి ఆర్థిక వ్యవస్థకు ఆటపట్టుగా నిల్చిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వర్గ సంబంధాలు, ఇస్లాం దండయాత్ర వల్ల కలిగిన ఫలితాలు, శైవ, వైష్ణవ మతశాఖల ప్రభావం, సామాజిక క్రమంలో కులవ్యవస్థ మార్పు చెందుతూ వచ్చిన తీరు, సూఫీ, భక్తివుద్యమాలు ఈ గ్రంథాల్లో ప్రస్తావనకు రాలేదు. జరిగిపోయిన చారిత్రక ఘటనల వర్ణనలకంటె, ఆ ఘటనల నేపథ్యాన్ని, అవి ఎందుకు ? ఎలా ? జరిగిన తీరును ఈ పరిశోధనలు చర్చించి వుండాల్సింది. ఈ దశలోనే, 1950 తర్వాత శ్రీయుతులు రామేశన్, రావిప్రోలు సుబ్రహ్మణ్యం, ఐ.కె. శర్మ, వి.వి. కృష్ణశాస్త్రి, మహమ్మద్ అబ్దుల్ వహద్‌ఖాన్, శ్రీనివాసాచారి, తిమ్మారెడ్డి, యం.యల్.కె. మూర్తి, పద్దయ్య, టి.వి.పతి, బి.యన్. శాస్త్రి, బి.ఆర్. సుబ్రహ్మణ్యం ప్రభృతులు ప్రాక్-పురాయుగ (Pre and Proto) చరిత్ర పై ప్రామాణిక రచనలు చేశారు. సాహిత్య చరిత్ర, కళారంగాలపై పెర్సీబ్రౌన్ రీతిలో అమితారే, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, ఆరుద్ర, యన్.యస్. కృష్ణమూర్తి తదితరులు కృషి చేశారు.
విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకులు :
ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎప్పుడు ఏర్పడింది ?
‘అబ్రహం లింకన్ చరిత్ర’ రాసినవారు :
ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసింది :
మధురా విజయ కావ్యకర్త :
ఫర్‌గాటన్ ఎంపైర్ గ్రంథకర్త :
ఆంధ్రుల చరిత్ర రచన మార్పులకు గురైన సంవత్సరం :
ఒక ఉపాధ్యాయురాలు తన 8వ తరగతి విద్యార్థులకు ఈ క్రింది అసైన్‌మెంట్ ఇస్తుంది. ఈ రాయటాన్ని ఏరకమయినదిగా వర్గించాలి ?
జంటలుగా, మేదోమధనం చేయండి. అభిప్రాయాలు రాసుకోండి వాటిని మంచి రచనగా మలిచి ‘విద్యార్థులకు అభ్యాస పుస్తకాలు ఇంకెంత మాత్రమూ అవసరం లేదు’ అను విషయానికి సంబంధించి ఒకటి అనుకూలంగా మరొక అభిప్రాయం వ్యతిరేకంగా వుండేటట్లు చూడండి.
ఈ క్రింది వాటిలో భాష సముపార్జన భాష అభ్యసనం గురించి చెప్పే అంతర్గత సిద్ధాంతం గురించి ఏది వాస్తవం ?
ఈ క్రింది వాటిలో ఏది క్రిందినుంచి పైకి అనే శ్రవణ కార్యకలాపం ?
‘బోధనశాస్త్ర సమాచార గ్రహింపు’, అంటే భాషా బోధనలో అర్థం :
పాఠశాలలో పిల్లలందరూ తమ మాతృభాషలో విద్యను ప్రారంభిస్తారు. ఆ తరువాత అనేక భాషలు కలుపుకుంటూ పోతారు. విధానాలక్రమంలో భాష గురించి దీన్నేమంటారు ?
కొంత సమాచారం తెలుసుకోవటం కోసం సంధ్య మెషిన్ అభ్యసనం గురించి ఒక వ్యాసం చదువుతుంది. ఆమె అభ్యసనాన్ని ఏమంటారు ?
ఈ క్రింది కార్యకలాపంను ఏమంటారు ?
ఒక చిన్న వాచకం రెండు భిన్నముక్కలుగా విడగొట్టబడి లేదా ప్రతి ఒక్క వాక్యం వొదిలి తరువాతి వాక్యాన్ని ఒక జంట అభ్యాసకులకు ఇవ్వబడింది. ప్రతి అభ్యాసకుడు వాటిని డిక్టేట్ చేస్తుండగా రాయాలి. ఎదుటి అభ్యసకుడు అదే పని చేస్తాడు. ఈ క్రమం తిరిగేస్తే ఒకరు చదువుతుంటాడు. ఒకరు రాస్తారు. ఆ తరువాత ఇద్దరు కలిసి మొత్తం వాచకాన్ని సమగ్రం చేస్తారు.
అభ్యాసం అనేది అర్థం కోసం అన్వేషణ. అందువల్ల అభ్యాసకులు క్రియాశీలకంగా అర్థం రూపొందించటానికి చేస్తున్న ప్రయత్నాల చుట్టూవున్న సమస్యలతో మొదలు కావాలి.
ఏ విద్య తత్వశాస్త్రం ఈ పై భావాన్ని ప్రబోధిస్తుంది.
‘రూప ప్రాతిపదిక భాషా సమాచారం’ దేనిని సూచిస్తుంది ?
‘అభ్యసనానికి మూల్యాంకనం’ ఈ క్రింది వాటిలో ఏది ?
ఉత్పాదక పద సంపద అంటే __________.
ఈ క్రింది వాటిలో మీరు దేనిని కవిత్వ బోధన-అభ్యసన ప్రక్రియకు సిఫారసు చేయరు ?
ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులతో సమాచారం ఇస్తు చర్చిస్తూ అనేక విషయాలకు సంబంధించిన భాషను తరగతి గదిలో వాడుతుంది. ఈ భాషా నైపుణ్యాన్ని ఏమంటారు ?
ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన ఏ తరహా వ్యాకరణ జ్ఞానాన్ని చెపుతుంది ?
రూపం గురించి జ్ఞానం, దానిని వివరించటం, కొద్దిపాటి అభ్యాసంతో దానిని అనుప్రయుక్త పరచటం.
ఈ క్రిందవున్న కార్యకలాపం దేన్ని నిమగ్నం చేస్తుంది ?
అభ్యాసకులకు హోటల్ మెను ఇవ్వబడింది. వాళ్ళు నలుగురికి 1800/- లకు గాను ఆహారాన్ని ఆర్డరు చేయాలి. ఒక వ్యక్తి శాకాహారి. వేరొక వ్యక్తికి పుట్టగొడుగులంటే ఎలర్జీ, వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళటానికి ఆటో కోసం 70 రూపాయిలు వుంచుకోవాలి. అభ్యాసకులు ఏమి ఆర్డరు చేద్దామని మాట్లాడుతున్నారు. తమ ప్రాధాన్యతలు ప్రస్తావిస్తున్నారు, హాస్టల్‌కు తిరిగి వెళ్ళటానికి డబ్బులు వుంచుకోవటం గురించి ఆలోచిస్తున్నారు.