జైలులోపల కథలు రాసింది :
- (1) బొల్లిముంత శివరామకృష్ణ
- (2) వట్టికోట ఆళ్వారు స్వామి
- (3) శారద
- (4) అడ్లూరి అయోధ్య రామకవి
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పుట్టడంతోనే ఆధునిక కథా లక్షణాలన్నీ సంతరించుకుని తెలుగు కథ పుట్టిందన్నది తెలుగు సాహిత్య చరిత్రకారుల ఉమ్మడి అభిప్రాయం. కథానికని ఇక్కడనుంచి వాడుకలో ఉన్నట్టే కథ అందాం, కథలో రెండు ప్రధాన అంగాలు వస్తువూ, కథనం. కథ మొదలుపెట్టాక విడవకుండా చదివించేలా ఉంచేది కథనం. చదివేక మనుసులో నిలిచిపోయేది వస్తువు. ఇవి రెండూ సమతూకంగా అమరిన కథ బాగా రాసిన కథ. ఇది ఒక భావన. ఈ భావనను పూర్తిగా అంగీకరించాలంటే అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ఒక కథ అందరు పాఠకులనీ సమంగా ఆకట్టుకోగలదా-అన్నది ప్రధాన ప్రశ్న. ఒక వస్తువు అందరికీ అంగీకృతం కాదని మనం సులువుగానే ఒప్పుకుంటాం. కాని కథనం విషయంలో ఆలోచనలో పడతాం. తెలుగు కథలో వస్తువు ప్రధానంగా అది కూడా సమాజ సంబంధిగా ఉండటానికి ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. కథకులు అలాంటివి రాయటానికి, చదువరులు చదవటానికీ ఇష్టపడతారు. ఈ లక్షణం వల్ల సాహిత్యమూ, అందులో కథా వస్తు ప్రధానంగా, ఆ వస్తువు కూడా సమాజ విమర్శ ప్రధానంగా ఉండటం తెలుగు సాహిత్య ప్రత్యేక లక్షణం అయింది. కథనం ఆదినుంచీ రెండవ స్థానంలోనే ఉంది. ఈ లక్షణం వల్ల తెలుగు కథ సమాజంలో వచ్చిన ప్రతి ఉద్యమాన్నీ అనుసరించింది. సంస్కరణ, స్వాతంత్ర్య, జాతీయ, వామపక్ష, అస్తిత్వ ఉద్యమాలు కథని ప్రభావితం చేసాయి.
ఆనకట్టలతో పచ్చగా మారిన కృష్ణా, గోదావరి ప్రాంతాలలో తొలి తెలుగు పత్రికలు, పుస్తక ప్రచురణ వసతులూ, వ్యాపారమూ పుట్టాయి. తొలి కథకులు తెలుగు ప్రాంతపు సరిహద్దులనుంచి రావటం, పత్రికలు మధ్యభాగం నుంచి రావటం గమనార్హం. స్త్రీల పత్రికలు తెలుగులో మొదటి నుంచీ వెలువడ్డాయి. 1902 మేలో ఆరంభమైన హిందూ సుందరిలో అచ్చమాంబ ధనత్రయోదశి కథ నవంబరులో ప్రచురించారు. 1910 మాఘ మాసం (జనవరి- ఫిబ్రవరి)లో ఆరంభమైన ఆంధ్రభారతి తొలి సంచికలో దిద్దుబాటు వెలువడింది. 1905లో పుట్టిన ఆంధ్ర పత్రిక 1910 నుంచి ఉగాది సంచికలు వెలువరించటంతో శ్రీపాద, పానుగంటి, రాయసం వెంకటశివుడు, చింతా భీమశంకరం-దీక్షితులు వంటివారు కథలలో కలం పెట్టారు. 1924లో భారతి, 1928లో గృహలక్ష్మీ, 1929లో చిత్రగుప్త ఆరంభమై కథకు ప్రత్యేక స్థానం ఇచ్చాయి. కనుపర్తి వరలక్ష్మమ్మ, పులవర్తి కమలాదేవి వంటి అనేక మంది స్త్రీలు కథారచనలో పాల్గొన్నారు.
ఇంతవరకూ కథానిలయం సేకరించి, లెక్కించగలిగిన మేరకు ఈ వంద సంవత్సరాలలో 12 వేలకి మించిన కథకులు 60 వేల కథలు రాసారు. మరో 60 వేల కథలు వెలువడి ఉండవచ్చు. కథకుల సంఖ్య మరో మూడు నాలుగు వేలకు చేరవచ్చు. 1947 కి ముందు రాసిన కథకులు ఈ 12 వేలలో 2 నుంచి 3 వేల వరకూ ఉండవచ్చు. దాదాపు 10 వేల మంది కృషి చేసిన కథా వ్యవసాయంలో వారు ప్రదర్శించిన శక్తియుక్తులను, స్పందనలను ఒక వ్యాసపరిధిలోకి తీసుకురావటం సాధ్యం కాదు. వీలయినన్ని ధోరణులను గుర్తించి. వాటికి ప్రేరణలనూ కారణాలనూ చర్చించి, ప్రస్తావనశాత్తూ కథా పరిణామంలో మార్పులకు హెచ్చుగా కారణమైన వారిని స్పృశిస్తూ, కొండ గుర్తులనదగ్గ కథలను ఉగ్గడిస్తూ ఈ 63 ఏళ్ల కథా ప్రయాణంలో పరిశీలనాంశాలను ఆసక్తిగల వారి ముందుంచటానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తోంది.
భారతదేశంలో మూడు ముఖ్య రాజకీయ దశలను గమనించవచ్చు. 47-67 మధ్య ఒక ఆదర్శ దశ, దాని వైఫల్యం ఉన్నాయి. 67-87ల మధ్య ఒక పెను సంక్షోభం, దాని అణిచివేత, అవకాశ వాదం, దాని కాలుష్యం ఉన్నాయి. 87 నుంచి ఇప్పటి వరకూ ఆర్థిక సంస్కరణల ప్రవేశం, నేరుగా ప్రజా జీవితంపై ప్రభావం, ప్రపంచ వ్యాపారీకరణ, ఉన్నాయి.
ఈ మూడు దశలనూ, వాటిని గురించి తెలుగు కథ స్పందనలను పరిశీలిస్తే తెలుగు కథ ప్రయాణం దాని మలుపులూ అవగతమవుతాయి.
నెహ్రూ పరిపాలనలో, అనేకమంది స్వాతంత్ర్య ఉద్యమ దిగ్గజాల రాష్ట్ర నాయకత్వంలో ఎన్నో ఆశలతో సామాన్య ప్రజానీకం తమ జీవితాలలో అద్భుతమైన మార్పులు వస్తాయని ఎదురుచూడటంతో మొదలయింది. గురజాడ వారి కన్యాశుల్కంలో జట్కావాడు స్వాతంత్ర్యం వస్తే మావూరి హెడ్ కానిస్టీబులు పోతాడా అని అడుగుతాడు. సామాన్యుని నిజజీవిత సమస్యలు పరిష్కరించబడతాయన్న ఆశ అందులో వ్యక్తమవుతుంది. 1948 జూలైలో వెలువడిన శారద కథ స్వాతంత్ర్య స్వరూపం ఆనాటి ఆలోచనాపరుడైన రచయిత మనస్థితికి, స్వాతంత్ర్యానంతర భవిష్యత్తు మీద నిరాశకీ మచ్చుతునక. రాజ్యాంగం ప్రకటించిన సోషలిస్టు లక్ష్యాలను మేధావులు తర్జుమా చేసి జనానికి చెప్పారు.
ముఖ్యంగా సాంకేతిక రంగ మేధావులు ఉన్న కొద్ది వనరులతో దేశ కల్యాణ పథకాలలో నిమగ్నమయారు. అధికారంలో లేని వామపక్షాలు, మతపక్షాలు చిత్తశుద్ధితో తమ భావాల వెనక నడిచాయి.
భారతదేశ విభజన దానికి ముందూ వెనకా నడిచిన మత కలహాలూ అందులో ప్రాణాలూ, మానాలూ, స్వస్థానాలూ కోల్పోయిన దారుణం తెలుగు ప్రాంతానికీ, కథకీ దూరంగా సాగింది. రావిశాస్త్రి, బలివాడ వంటి భవిష్యద్రచయితలు దెయ్యాలకు ద్వేషాల్లేవు, అమ్మ వంటి కథలు రాసారు. మహాత్ముని మరణం దేశాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తింది. అనేక కావ్యాలూ, బుర్రకథలూ తెలుగులో వెలువడినాయి. కొకు బాపూజీ హత్య అన్న కథ రాసాడు.
తెలుగు నాట తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది. ఇది జరిగినది తెలంగాణాలోనే అయినా వామపక్షాల వారు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ఈ ఉద్యమం పై తెలుగు కథకుడు చాలా కథలు రాసాడు. వట్టికోట ఆళ్వారు స్వామి జైలులోపల, అడ్లూరి అయోధ్య రామకవి తెలంగాణ మంటల్లో వంటి కథా సంపుటాలు వచ్చాయి. ఉప్పల లక్ష్మణరావు, బొల్లిముంత శివరామకృష్ణ, శారద వంటి కథకులు కథలు రాసారు. ముల్కీ నిరుద్యోగాన్ని తొలగించలేదని నౌఖరీ అన్న కథ వచ్చింది.
ఆంధ్ర రాష్ట్రం కోసం మరో పెద్ద ఉద్యమం జరిగింది. దీనిపై కూడా తెలుగు కథకుడు స్పందించి కథలు రాసాడు.
స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదులు హెచ్చుగా పాల్గొంటే వామపక్ష భావజాలం తెలుగునాట వ్యాపించటానికి ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేసారు. వీరు కథా సృజనలో కూడా పాల్గొన్నారు. వీరి కృషితో ఈ భావజాలానికి అంకితమైన ఒక యువతరం సృష్టించబడింది.
ఈ సమయంలో సాహిత్యంలో చలం, కొడవటిగంటి, విశ్వనాథ కొన్ని ప్రముఖ ధోరణులకు చిహ్నాలు. వీరిలో కొడవటిగంటి ప్రధానంగా కథకుడు. ఈయన వామపక్ష కథకుడు. మధ్య తరగతి-ఆనాటికి ఉండీ లేని, మారీ మారని, మారక పోతే బ్రతుకు గడవదని గ్రహించిన బ్రాహ్మణ కుటుంబాలు - సంస్కారంలో మార్పుల అగత్యం గురించి వందలాది కథలు రాసాడు. స్త్రీల పరిస్థితిలో సమూలమైన మార్పులు రావాలని ఆశించాడు.
జైలులోపల కథలు రాసింది :
CBSE answer: (2)
జవాబు: (2) వట్టికోట ఆళ్వారు స్వామి
జాగ్రత్త: అడ్లూరి అయోధ్య రామకవి రచన తెలంగాణ మంటల్లో; బొల్లిముంత, శారద పేర్లు విడిగా కథకులుగా వచ్చాయి.