By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 2 Telugu, Question 95

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ముదివర్తి కొండమాచార్యులు కృష్ణా జిల్లా మైలవరం తాలూకు కుంటముక్కల గ్రామంలో సెప్టెంబరు 2వ తేది 1922లో జన్మించాడు. తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ, రామకృష్ణమాచార్యులు. సుప్రసిద్ధులైన శేషాద్రి రమణకవులకు రామకృష్ణమాచార్యులు మేనత్త కొడుకు. కొండమాచార్యుల బాల్యం తల్లి నరసమ్మ గ్రామమైన ప్రకాశం జిల్లా చిలకపాడులో గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసం సంతనూతలపాడు గ్రామంలో జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. 1950లో, సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ 1951లో ఇంటర్మీడియట్ పరీక్షలో ద్వితీయ శ్రేణిని పొందాడు. 1958లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే ‘షార్టు సర్టిఫికేట్ కోర్సు’ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.
కొండమాచార్యును నెల్లూరులో 1940లో వివాహం లక్ష్మమ్మ, శ్రీనివాస వరదాచార్యుల కుమార్తె ఇందిరమ్మతో జరిగింది. శ్రీనివాస వరదాచార్యులు ‘బిల్హణీయ’ కావ్యకర్తైన చిత్రకవి సింగారాచార్యుల వంశానికి చెందిన వ్యక్తి. కొండమాచార్యులకు కొడుకు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.
కొండమాచార్యులు 1942వ సంవత్సరంలో గవర్నమెంటు ట్రైనింగ్ స్కూల్, నెల్లూరులో హయ్యర్ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1950 నుండి 1978 వరకు నెల్లూరు జిల్లా గూడూరులో ‘తెలుగు పండిట్’గా చేశాడు. 1978లో పదవీ విరమణ చేసి 1980 అక్టోబరు నుండి ధార్మిక ప్రబోధ కేంద్రాధ్యాపకుడుగా ‘సప్తగిరి’ పత్రిక కార్యాలయంలో సంపాదకుడిగా, పుస్తక పరిష్కర్తగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేరాడు.
సాహిత్య జీవితం : కొండమాచార్యుల రచనలు వ్యక్తిగతమైన కీర్తిని అందజేశాయి. కొండమాచార్యుల సాహిత్యం ఖండకావ్యాలు, నవలలు, వ్యాసాలు, గ్రంథ సమీక్షలు, పాటలు, పద్యాల రూపంలో విస్తరించి ఉంది. ఖండ కావ్యాలు కొండమాచార్యుల రచనలన్నింటిలోనూ తలమానికాలు. ‘నారాయణమ్మ’ (1965) ‘పూర్ణాహుతి’ (1977) ఖండ కావ్యాలు స్థానిక ప్రజలలో ప్రచారంలో ఉన్న వాస్తవిక విషయాలాధారంగా రచింపబడ్డాయి. మరికొన్ని ఖండ కావ్యాలు 1946లో ‘ధర్మదీక్ష’ 1947లో ‘అమరసందేశము’, 1948లో ‘వీరమ నీడు’, ప్రచురింపబడ్డాయి. ‘కూనలమ్మ’ 1970లో రచించాడు. నవలా రచయితగా శ్రీముదివర్తి కొండమాచార్యులు 1947లో తుగ్లక్, 1953లో ‘కనిష్ఠ బిక్షువు’, ప్రచురించాడు. 1971లో ‘కుమార రాముడు’, 1973లో ‘గౌతమ చరిత్ర’, ‘బలి నిషేధము’, 1974లో ‘ప్రచండ కేళికలు’, 1986లో అమృత సారము ముద్రించాడు.
కొండమాచార్యుల వ్యాసాలు చాలా ‘జమీన్ రైతు’ పత్రికలోనే ప్రచురింపబడ్డాయి. 1972లో ‘శ్రీమతి పెనుబల్లి జయలక్ష్మమ్మ’ 1978 లో ‘దీపాల వారి భారతి’, 1979లో ‘బూతుచెప్పినా నీతిచెప్పినా కవి చౌడప్ప చెప్తేనే రాణింపు’ 1979లో ‘శతకాల మకుటం సింహాద్రి నారసింహ శతకం’, 1980లో ‘వేదగిరి నృసింహాలయం’, 1987లో ‘చింతా దీక్షితులు’ మొదలైన వ్యాసాలన్నీ జమీన్‌రైతులో చూడవచ్చు.
కొండమాచార్యుల గ్రంథ సమీక్షకులు కూడా జమీన్ రైతులో ప్రచురణ పొందాయి. 1979లో బెజవాడ గోపాలరెడ్డి, ‘కాలవాహిని’ పై చేసిన సమీక్ష, 1980లో బెజవాడ గోపాలరెడ్డి ‘సాహిత్య సుందరి’ పై చేసిన సమీక్ష, 1981లో చదలవాడ జయరామశాస్త్రి వ్రాసిన ‘శ్రీ మద్భాగవత భూమిక’ పై వ్రాసిన సమీక్ష ‘జమీన్‌రైతు’ పత్రిక ప్రచురించింది.
కొండమాచార్యులు కావ్యాలు, వ్యాసాలు, గ్రంథ సమీక్షలే కాకుండా సినిమాలకు పాటలు, పద్యాలు వ్రాశాడు.
కొండమాచార్యులను అనేక సంస్థలు, విద్యాలయాలు, కవిగా-రచయితగా, వ్యాసకర్తగా గుర్తించి సన్మానించాయి.
1946 లో ఆంధ్రసభ - నెల్లూరు కొండమాచార్యులను సన్మానించింది. 1950లో తిక్కవరపు రామిరెడ్డి ‘కవిత్రయ జయంతుల’ సందర్భంలోనూ, 1966లో గడియారం శేషయ్య శాస్త్రి ఆధ్వర్యంలో నంద్యాలలోనూ 1966లో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల తిరుపతిలోనూ, 1973లో ఆచార్య జి.యన్. రెడ్డి అధ్యక్షతలో శ్రీరామ విలాస సభ, చిత్తూరులోనూ, 1977లో డా.బి. గోపాలరెడ్డి అధ్యక్షతలో ఆర్.ఎల్.రెడ్డి ట్రస్ట్ కమిటీ తిక్కన సాహితీ సదస్సు, నెల్లూరులోనూ, 1978లో అల్లసాని పెద్దన, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి జయంతుల సందర్భంగా గూడూరులోనూ, ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన సందర్భంలో నెల్లూరులోనూ, సన్మానాలు పొందారు వీరు.
కొండమాచార్యుల రచనలు హైస్కూళ్ళలోనూ, కళాశాలలోనూ, విశ్వవిద్యాలయాలలోనూ పాఠ్యాంశాలుగా గ్రహింపబడ్డాయి. కొండమాచార్యులు ఖండకావ్యాలలో ‘ధర్మదీక్ష’ 1946-47 ప్రాంతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఆనర్సు-భాషా ప్రవీణ ఫైనల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఏర్పాటు చేసింది. ‘అమర సందేశము’ 1947లో అదే విశ్వవిద్యాలయంలో భాషా ప్రవీణ విద్యార్థులకు పాఠ్యాంశంగా గ్రహింపబడింది. ‘వీరమ నీడు’ 1948లో ఆంధ్ర విశ్వవిద్యాలయం బి.ఏ. ఆనర్సు స్పెషల్ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఏర్పాటు చేసింది. ఇదే కావ్యం 1987లో మైసూరు విశ్వవిద్యాలయంలో బి.ఏ. తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఏర్పాటు చేయబడింది. ‘నారాయణమ్మ’ 1972లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్వాన్ ఫైనల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఏర్పాటు చేసింది. ‘తుగ్లక్’ నాలుగవ తరగతికి ‘బలి నిషేధము’ రాయలసీమ, గుంటూరు జిల్లా పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా చేయబడ్డాయి.
కొండమాచార్యుల వ్యక్తిత్వం. కవిగా, వ్యాసకర్తగా, గ్రంథ సమీక్షకుడిగా, పాటల రచయితగా పరిణితి రచనా క్రమంలో స్ఫుటంగా వ్యక్తీకరింపబడ్డాయి.

Q95

సప్తగిరి పత్రికలో సంపదకుడిగా ఎప్పుడు చేరారు ?

  1. (1) 1942
  2. (2) 1978
  3. (3) 1980Correct answer
  4. (4) 1960

Solution.

CBSE answer: (3)

జవాబు: (3) 1980

  1. కొండమాచార్యులు 1978లో పదవీ విరమణ చేశారని గద్యం చెబుతోంది.
  2. ఆ తర్వాత 1980 అక్టోబరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ‘సప్తగిరి’ పత్రిక కార్యాలయంలో సంపాదకుడిగా చేరారు.

జాగ్రత్త: 1978 పదవీ విరమణ సంవత్సరం; 1942 ఉద్యోగం మొదలైన సంవత్సరం. ఇవి సప్తగిరిలో చేరిన సంవత్సరం కాదు.