By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 1 Telugu Language Question Paper with Answer Key

You are reading the question paper with answers. This is not the timed test: no clock is running and nothing is being scored.

Go to the timed test →

Passage

సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

19వ శతాబ్దపు ఉత్తరార్థంలో కావ్య సమీక్షా క్షేత్రంలో కల్పనకు బదులుగా సాంఘిక, సాంస్కృతిక, నైతిక విలువలు పల్లవించినట్లు అగుపిస్తాయి. కార్లాయిల్ (Carlayal) (1795-1881) రస్కిన్ (Ruskin) (1819-1900) మేథ్యూ ఆర్నాల్డు (Mathew Arnald) (1812-1888) మెకాలె (Mecualay) (1800-1856) మొదలగు వారలు కావ్యంలో నైతిక, సాంస్కృతిక విలువల ప్రాధాన్యతను ప్రతిపాదించారు. ఈ దిశలో మైథ్యూ ఆర్నాల్డు ప్రాతినిధ్యం వహించిన సమీక్షకుడు. ఆస్కర్ వాయిల్డ్ (Oscar waild) (1854-1900) లో ఉపర్యుక్త నైతిక ప్రవృత్తికి ప్రతిక్రియాత్మక రూపం అగుపిస్తుంది. నానారకాలైన సాంఘిక బంధనాల నుండి విముక్తమైన విశుద్ధ కావ్యాత్మక ఆనందాన్ని ఆయన కావ్య లక్ష్యంగా భావించాడు. ఈ కాలంలోనే ఫ్రాన్స్‌లో జోలా (Emile Zola-1840-1902) యదార్థ వాదంతో కూడిన ప్రకృతి వాద కళకు నాంది పఠించాడు. ఆతని కావ్యదృక్పధంలో సైతం పరంపరాగత నైతికతను, మర్యాదను అవహేళన పరచెడి ప్రవృత్తి ద్యోతక మవుతుంది.

20వ శతాబ్ధంలో కావ్య చింతన అనేక దిశలలో పురోగమించింది. వర్స్‌ఫోల్డ్ ‘జజ్‌మెంట్ ఇన్ లిటరేచర్’ రచించు నాటికి 19వ శతాబ్ధపు సాహిత్యమే అతనికి అందుబాటులో ఉండుట వలన ఆధునిక యుగ సమీక్షా క్షేత్రంలో విభిన్న దిశలలో వికాసమానమవుతున్న కావ్య చింతనను విశ్లేషించ లేక పోయాడు. 20వ శతాబ్ధంలో ‘క్రోచే’ అభివ్యక్తీకరణ వాదం, ఫ్రాయెడ్, ‘అంతశ్చేతనావాదం’ ఆంధ్రబ్రేతా, పాల్ ఎడ్వర్డ్ల ‘అతియదార్థవాదం’ సార్త్ర్ ‘అస్తిత్వవాదం’ మున్నగు ప్రముఖ కావ్య చింతనా దిశలలో సమీక్షా క్షేత్రం ప్రభావితం అయింది. ఈ శతాబ్ధపు కావ్య చింతనపై ఫ్రాయెడ్, అతని శిష్య పరంపర, మార్క్స అతని అనుయాయుల ప్రభావం అధికంగా అగుపిస్తుంది. క్రోచే యొక్క అభివ్యక్తీకరణ వాదం పాతబడి పోయింది. సార్త్ర్ అస్తిత్వవాదం అధికంగా చర్చించబడుతూ ఉంది.

క్రోచే (Croche-1866-1952) ఇటలీ దేశపు దార్శనిక వేత్త, ఆయన కళానందాన్ని సహజానుభూత ఆనందంగా భావించాడు. ఆతని దృష్టిలో జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. సహజాతం, బుద్ధ్యుపలబ్ధం. కళ సహజ జ్ఞాన ప్రసూతం. శాస్త్రం బుద్ధ్యపలబ్ధ జ్ఞాన జాతం. ఈ తీరున సహజ జ్ఞానమే అభివ్యక్తీకరణం అవుతుంది. జ్ఞానం రూపగ్రహణ నిమిత్తం నాలుగు దశలలో పురోగమిస్తుంది. మొదట మనస్సు ప్రభావాన్ని గ్రహిస్తుంది. తరువాత ఈ ప్రభావం మనోజగత్తులో వ్యంజితం అవుతుంది. తదనంతరం దాని స్థూల అభివ్యక్తీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియలో మూల వస్తువు సహజ జ్ఞానం లేక అభివ్యక్తీకరణం అవుతుంది. అభివ్యక్తీకరణ ఎన్నడునూ వికారంగా ఉండదు. అందువలన అభివ్యక్తీకరణ సౌందర్యమే కావ్య సౌందర్యం అవుతుంది.

ఫ్రాయెడ్ (Frued 1856-1939) మానసిక శాస్త్రాధారంగా కావ్య రచనాత్మక ప్రక్రియను అవచేతన మానసంతో అనుసంధాన పరచాడు. అతని మతానుసారం మనస్సు రెండుగా విభజింపబడుతుంది. చేతనం, అవచేతనం, నెరవేరని కోరికలు నియంత్రిత వాసనల రూపంలో అవచేతన మానసంలో గూడుకట్టుకొని ఉంటాయి. ఈ నియంత్రిత వాసనలే కావ్యంలో శబ్ధ ప్రతీకాల రూపంలో సాక్షాత్కరిస్తాయి. ఈ విధంగా ప్రతి కావ్యం దానిని రచించిన కవి యొక్క ఏదో ఒక నియంత్రిత వాసనకు కళాత్మక మనోవేగమే అవుతుంది. ఫ్రాయెడ్ శిష్యుడు యూంగ్ (Yung 1875-1961) ఈ నియంత్రిత వాసనా సిద్ధాంతాన్ని అంగీకరింపక కావ్యం కవి యొక్క ‘అహం’ భావనతో షునిష్ఠ సంబంధాన్ని కలిగి ఉంటుందని వివరించాడు. అతని మతంలో కళాకారుని అహం భావన ఇతర భావాలన్నింటిని నియంత్రిత పరచి కళారూపంలో వ్యక్తం అవుతుంది. మానసిక శాస్త్రాధారంగా కళను పరిశీలించిన మూడవ శాస్త్రవేత్త ఎడ్లర్ (Edler 1870-1937) ఆయన కళాకారుని న్యూనతా భావనను కళాసృజనకు మూలంగా ప్రతిపాదించాడు. అతని దృష్టిలో గొప్ప గొప్ప కళాకారు లందరు ఏదో ఒక న్యూనతా భావనచే పీడింపబడిన వారై ఉంటారు. వారు కళాసృజన ద్వారా ఈ హీనతా భావన నుండి విముక్తిని కాంక్షిస్తారు.

అతియథార్థవాదం కూడా అంతశ్చేతనావాదం పై ఆధారపడి ఉంది. వాస్తవిక జీవనంలో ఉపలబ్ధం కానేరని రూపాల, బింబాల, ప్రతీకాల మాధ్యమంలో స్వప్న సంవేదన ఆధారంగా కళ సృష్టింపబడుతుందని అతి యధార్థవాదుల మతం. మొదట ఈ సిద్ధాంతం చిత్రకళలో లేవదీయ బడింది. సాహిత్యంలో దీనిని ప్రతిష్టించిన వారిలో ఫ్రాన్స్‌కు చెందిన అంద్రెబ్రెటాన్ (Andre Breton), పాల్ ఎడ్వర్డ్ (Paul Edward) ప్రముఖులు.

కార్ల మార్క్స (Carl Marx-1818-1883) యొక్క వస్తువాద దర్శనం 20వ శతాబ్దపు కళాచేతనను చాలావరకు ప్రభావిత పరిచింది. మార్క్సవాద దర్శనాన్ని ప్రాతిపదికగా గ్రహించి ‘క్రిస్టోఫర్ కాల్డ్‌వెల్’ తన ప్రసిద్ధ రచనయైన, ‘ఇల్యూజన్ అండ్ రియాలిటీ’లో కళాసిద్ధాంతాన్ని స్థాపించాడు. అతని మతానుసారం యుగవిశేషంలోని వర్గ చైతన్యం కళాకృతుల రచనకు మూలంగా పనిచేస్తుంది. తన వికాస యాత్రలో మానవతక్రమంగా పూర్వోత్తర శిలాయుగాలను, సామ్రాజ్య యుగాన్ని సామంతయుగాన్ని, ధనిక యుగాన్ని దాటి ఈ తీరున నేడు మనముందు నిలిచి ఉంది. ఏ యుగ సాహిత్యమైనా ఆ యుగ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. సాహిత్యకారుడు తెలిసియో, తెలియకయో ఆర్థిక వ్యవస్థా పాలక వర్గహితాన్నే కాంక్షిస్తాడు. కళాచింతన నితాంతం సమాజ నిరపేక్షం కాకుండా రక్షింప బడుటయే ఈ సిద్ధాంత స్థాపన ద్వారా సాహిత్యానికి చేకూరిన ప్రయోజనం.

సాహిత్య సమీక్షా క్షేత్రంలో ఐ.ఎ. రిచర్డ్స్ (I.A.Richards 1893-1979) స్థాపించిన సిద్ధాంతం ‘మనోవైజ్ఞానిక హితవాదం’ గా తెలుపబడుతుంది. రిచర్డ్స్ సుప్రసిద్ధ రచనయైన ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరరి క్రిటిసిజమ్’ 1924 లో ప్రచురింపబడింది. ఆయన కళానిరపేక్షతా సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు.

వర్తమాన యుగంలో ప్రతిభావంతుడైన కవి, విమర్శకుడు టి.యస్. ఇలియట్ (T.S. Eliot. 1888-1965) నిర్వైయక్తిక అనుభూతిని కళ యొక్క ఉత్కృష్టతకు ప్రమాణంగా భావించాడు. అతని మతంలో కళాకారుని భోగాత్మక మానసం సృజనాత్మక మానసం కన్నా భిన్నంగా ఉంటుంది. అందువలన కళాకృతి తటస్థ సృష్టి అవుతుంది. పారంపర్య ప్రాతిపదికపై ఇలియట్ కళాకారున్ని పరిశీలింప నిశ్చయించినాడు. ఆయన తన చింతనా పటిమచే సమీక్షా జగత్తును అత్యధికంగా ప్రభావితం చేసినాడు. ఒక రకంగా ఇలియట్ సాంప్రదాయిక చింతను పునఃప్రతిష్ఠించాడు.

Q91

‘అంతశ్చేతనావాదం’ వీరికి సంబంధించినది :

  1. (1) ఐ.ఎ. రిచర్డ్స్
  2. (2) ఫ్రాయెడ్
  3. (3) మేథ్యూ అర్నాల్డ్
  4. (4) యూంగ్
See answer and solution
Q92

అతియథార్థవాద రూపకర్తలు :

  1. (1) మేథ్యూ ఆర్నాల్డ్ - రస్కిన్
  2. (2) ఆంద్రేబ్రేతా - పాల్ ఎల్వర్డ్
  3. (3) మెకాలే - మార్క్స
  4. (4) క్రోచే - ఫ్రాయెడ్
See answer and solution
Q93

సాంప్రదాయక చింతనను పునఃప్రతిష్టించిన వారు :

  1. (1) టి.ఎస్. ఇలియట్
  2. (2) రస్కిన్
  3. (3) జీన్‌పాల్ సార్త్ర
  4. (4) ఆస్కర్ వాయిల్డ్
See answer and solution
Q94

‘అస్తిత్వవాదం’ ప్రతిపాదించిన వారు :

  1. (1) జోలా
  2. (2) సార్త్ర్
  3. (3) ఇలియట్
  4. (4) మార్క్స
See answer and solution
Q95

ఇల్యూజన్ అండ్ రియాలటీ గ్రంధ కర్త :

  1. (1) మార్క్స
  2. (2) క్రిస్టోఫర్ కాల్డ్‌వెల్
  3. (3) జీన్‌పాల్ సార్త్ర
  4. (4) క్రోచే
See answer and solution
Q96

కళాకారుని న్యూనతను కళా సృజనకు మూలంగా ప్రతిపాదించింది :

  1. (1) ఎడ్లర్
  2. (2) ఫ్రాయెడ్
  3. (3) యూంగ్
  4. (4) ఐ.ఎ. రిచర్డ్స్
See answer and solution
Q97

ఎవరి సిద్ధాంతం ‘మనోవైజ్ఞానిక’ హితవాదంగా వ్యవహరింపబడింది ?

  1. (1) ఫ్రాయెడ్
  2. (2) ఆడ్లర్
  3. (3) యూంగ్
  4. (4) ఐ.ఏ. రిచర్డ్స్
See answer and solution
Q98

‘అభివ్యక్తీకరణ వాదం’ ప్రతిపాదకులు :

  1. (1) ఫ్రాయెడ్
  2. (2) మార్క్స
  3. (3) క్రోచే
  4. (4) ఆస్కర్ వాయిల్డ్
See answer and solution
Q99

‘ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరరీ క్రిటిసిజమ్’ ఎవరి రచన ?

  1. (1) ఐ.ఏ. రిచర్డ్స్
  2. (2) కార్ల మార్క్స
  3. (3) పాల్ ఎడ్వర్డ్
  4. (4) టి.ఎస్. ఇలియట్
See answer and solution

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకు గల ప్రశ్నలకు సమాధానం వ్రాయండి.

వికసిత తృష్ణాలతికకు । న కుటిలమగు తపము దాత్రమై నఱకంగా
వికృతులఁ బ్రకృతినిఁ బురుషుని । నకలంక జ్ఞాన దృష్టి నవలోకించున్.

Q100

పద్యం నాలుగు పాదాలలోని మాత్రల సంఖ్య :

  1. (1) 32
  2. (2) 48
  3. (3) 64
  4. (4) 24
See answer and solution
Q101

పద్యంలో కొడవలి అనే అర్థాన్ని సూచించే పదం :

  1. (1) తపము
  2. (2) వికసిత
  3. (3) అకుటిల
  4. (4) దాత్రము
See answer and solution
Q102

పద్యం సరిపాదములలో చివరి గణము ఏది ?

  1. (1) గగము
  2. (2) సగణము
  3. (3) భగణము
  4. (4) జగణము
See answer and solution
Q103

పద్యంలో గల అలంకారము :

  1. (1) ఉపమ
  2. (2) దృష్టాంతము
  3. (3) రూపకము
  4. (4) కావ్యలింగము
See answer and solution
Q104

పద్యం ఏ ఛందస్సులో ఉంది ?

  1. (1) కందము
  2. (2) ద్విపద
  3. (3) ఉత్పలమాల
  4. (4) మత్తేభము
See answer and solution
Q105

పద్యంలోని బేసి పాదములలో గణముల సంఖ్య :

  1. (1) 3
  2. (2) 5
  3. (3) 4
  4. (4) 2
See answer and solution
Q106

ఒక పిల్ల ఒక అంశం మీద మేధోమధనం తరువాత కూడ తనకు తానుగా ఒక ప్యారా గ్రాఫు రాయలేదు. అయితే పెద్దవాళ్ళు లేక సమవుజ్జీల పర్యవేక్షణలో రాయగలదు. ఈ పర్యవేక్షణను ఇలా అంటారు ?

  1. (1) స్కాఫోల్డింగ్
  2. (2) సమవుజ్జీ బోధన
  3. (3) సమవుజ్జీ సలహా
  4. (4) టీమ్ బోధన
See answer and solution
Q107

__________ అనేది ఒక రకమైన అభ్యసనం. అందులో పిల్లవాడు మేధస్సు, హేతుబద్ధత లాంటి ఉన్నత స్థాయి మానస క్రమాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.

  1. (1) శబ్ద అభ్యసనం
  2. (2) భావనాత్మక అభ్యసనం
  3. (3) మోటారు నైపుణ్యాల అభ్యసనం
  4. (4) నిర్మాణ అభ్యసనం
See answer and solution
Q108

ఒక ఉపాధ్యాయుడుగా మీరు ఒక విద్యార్థిని కొన్ని పదాల స్పెల్లింగ్ విషయంలో పొరపాటు చేసినప్పటికీ ఆమె పూర్తి భాషా ఉపయోగాన్ని అభినందించండి. ఈ సందర్భంలో మీరు ఉపయోగిస్తున్న పద్ధతి :

  1. (1) పూర్తి భాష
  2. (2) భావ ప్రసార
  3. (3) నిర్మాణాత్మక
  4. (4) నిర్మాణవాద
See answer and solution
Q109

మీరు ఒక హిందీ ఉపాధ్యాయులు, అయితే మిమ్మల్ని పంజాబ్ లోని ఒక ప్రాథమిక పాఠశాలకు పంపటం జరిగింది. మీకు స్థానిక భాష తెలియదు కాబట్టి, మీరు చేయాల్సింది :

  1. (1) వెంటనే హింది మాట్లడే ప్రాంతానికి బదిలీ చేయమని అర్జీ పెట్టుకోవటం
  2. (2) పిల్లల భాష ఒక మూలభాషగ వాడుతూ బోధన ప్రారంభించడం
  3. (3) ఇంగ్లీషులో భావ ప్రసారం చేయటం
  4. (4) కమ్యూనిటీని హిందీ నేర్చుకునేందుకు ప్రేరేపించుట
See answer and solution
Q110

__________ అవగాహన అనేది వాచకపు భాగాన్ని దగ్గర, తీవ్రంగా, వాచకం నుంచి నిర్ధిష్ట సమాచారాన్ని రాబట్టే ప్రయోజనం కోసం చదివే నైపుణ్యం.

  1. (1) గ్లోబల్
  2. (2) ప్రాంతీయ
  3. (3) ఊహత్మక
  4. (4) మూల్యంకన
See answer and solution
Q111

భాషా అభ్యసనంలో డయాగ్నొస్టిక్ పరీక్ష ప్రయోజనం :

  1. (1) సంగ్రహమూల్యాంకనానికి ప్రశ్నలు రూపొందించటానికి పథకం రచించటం
  2. (2) ఉపాధ్యాయుల తల్లదండ్రుల సమావేశాల్లో తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళను దృష్టి పెట్టమని అడగటం
  3. (3) అభ్యాసకుడి అవగాహనలలో ఖాళీలను తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవచ్చు
  4. (4) విద్యార్థుల ప్రొగ్రెస్ రిపోర్టులోని పరిశీలనను చూడటం
See answer and solution
Q112

వాచక పుస్తకానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది ?

  1. (1) ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థికి వాచక పుస్తకం అంతిమ విషయం.
  2. (2) పాఠ్య ప్రణాళికలో పొందు పర్చిన లక్ష్యాలను సాధించటానికి అది ఉపకరిస్తుంది.
  3. (3) అది సెషన్‌లో విద్యాత్మక కార్యకలాపాలను రూపొందించే ప్రణాళిక.
  4. (4) ఒక వాచక పుస్తకం ప్రత్యామ్నాయం లేనటువంటిది.
See answer and solution
Q113

ఈ క్రింది వాటిలో ఏ తరగతి గది అభ్యసనం విద్యార్థులలో మౌఖిక భాషను అందిచటంలో ఉపాధ్యాయుడికి ఉపకరిస్తుంది ?

  1. (1) వాచకాన్ని అధ్యాపకుడితో కలిసి కోరస్ పఠనం చేయటం
  2. (2) బట్టీ పట్టిన తర్వాత కవితను వరుసగా పాడటం
  3. (3) రోల్ ప్లేలో భాగం కావటం
  4. (4) కొత్తవి, అపరిచితమైన పదాలను సరిగ్గా ఉచ్చారించటాన్ని అభ్యసించటం
See answer and solution
Q114

‘భాష యాదృచ్ఛికంగా ఉంటుంది’ అంటే మన అర్థం :

  1. (1) ఒక భాషలోని పదాలకు, వాటి అర్థాలకు అంతర్గతమైన సంబంధం ఉంటుందని.
  2. (2) పదాలకు వాటి అర్థాలకు మధ్య సంబంధం విలువైన హేతువు మీద ఆధారపడి ఉంటుంది, ఛాన్స్ మీద కాదు.
  3. (3) ఒక భాషలోని పదాలకు వాటి అర్థాలకు మధ్య అంతర్గత సంబంధం లేదు.
  4. (4) భాష యందే స్థిరీకరించబడిన సూత్రలను అనుసరిస్తుంది.
See answer and solution
Q115

వ్యాకరణ బోధనకు సంబంధించిన నిగమన పద్ధతి ముందు మనం ఇలా చేయాలని చెపుతుంది :

  1. (1) ఉదాహరణలు ఇవ్వటం
  2. (2) నియమాలు చెప్పటం
  3. (3) నమ్మదగిన విషయాన్ని చెప్పటం
  4. (4) డ్రిల్లుల ద్వారా అభ్యసనను అందించటం
See answer and solution
Q116

__________ వాస్తవాలకు అతీతంగా అంచన వేసేది, ఊహించేది.

  1. (1) వివరణ
  2. (2) విశ్లేషణ
  3. (3) ఊహించటం
  4. (4) బాహ్య నిక్షేపం (extropolation)
See answer and solution
Q117

ఒక భాషా ఉపాధ్యాయుడు విద్యార్థులు స్వేచ్ఛా లేఖనం వైపు ప్రోత్సాహించాలి. ఈ స్వేచ్ఛా లేఖనం విద్యార్థులకు __________.

  1. (1) అభ్యాసకులు ధారాళంగ, సృజనాత్మకంగా రాసేటట్లు చేస్తుంది
  2. (2) రాయాలా లేదా అనే స్వేచ్ఛ ఉంటుంది
  3. (3) ఎక్కువ రాయాలని కాని, కచ్చితంగా ఉండాలని కాని భావించకూడదు
  4. (4) తమ మొదటి భాష నుంచి కొన్ని లక్షణాలను కలుపు కుంటుంది
See answer and solution
Q118

ఒక ఉపాధ్యాయుడిగా మీరు 5వ తరగతి విద్యార్థులను, ఒక వాచకాన్ని పూర్తిగ చదవమని అడగండి. ఆ తరువాత సందర్భాన్ని ఆధారం చేసుకొని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టండి. దీని ద్వారా విద్యార్థులను మీరు ఏ విషయంలో ప్రోత్సాహిస్తున్నారు ?

  1. (1) విస్తృత పఠనం
  2. (2) స్కానింగ్
  3. (3) స్కిమ్మింగ్
  4. (4) తీవ్ర పఠనం
See answer and solution
Q119

భాషా సముపార్జన ఈ సందర్భంలో మాత్రమే జరుగుతుంది ?

  1. (1) పిల్లవాడికి వ్యాకరణ సూత్రలు బోధించినప్పుడు
  2. (2) పిల్లవాడికి అనువాద అభ్యసనం చేయించినప్పుడు
  3. (3) పిల్లవాడికి చదివే అవకాశం ఇచ్చినప్పుడు
  4. (4) పిల్లవాడికి భాషను పరిచయం చేసినప్పుడు
See answer and solution
Q120

మాతృభాషను తరగతి గదిలో బహిష్కరించడం ఏ పద్ధతి లక్షణం ?

  1. (1) సహజ
  2. (2) ద్విభాష
  3. (3) ఆడియో లింగ్వల్
  4. (4) ప్రత్యక్ష
See answer and solution

Passage

సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానములు రాయండి :
దక్షిణాదికి మొట్టమొదటి మహమ్మదీయ దండయాత్రను అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీ.శ. 1294లో దేవగిరి యాదవ రాజుల మీద జరిపాడు. కారా అలహాబాద్ ప్రాంతాల గవర్నర్‌గా ఉండి, ఢిల్లీ అనుమతి లేకుండానే జరిపిన అనధికార దండయాత్ర అది. దేవగిరిని ఓడించిన తరువాత ఢిల్లీ చక్రవర్తి, తన మామ అయిన సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీని చంపి, 1296లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. కాకతీయుల మీదకి 1303 సంవత్సరంలో మొదటి దండయాత్రను పంపించాడు. ఇప్పటి కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి దగ్గర జరిగిన ఆ యుద్ధంలో ఖిల్జీ సైన్యం ఓడిపోయింది. 1307లో మరోసారి ఖిల్జీ దక్షిణానికి సైన్యాన్ని పంపించాడు. కానీ అది దేవగిరి లక్ష్యంగా జరిగిన దండయాత్ర. ఖిల్జీ 1309లో మాలిక్ కాఫర్‌ను కాకతీయుల మీదికి రెండో దండయాత్రకు పంపాడు. మాలిక్ కాఫర్ 1310 జనవరి 19నాడు వరంగల్ కోటను ముట్టడించాడు. రెండు నెలలపాటు ఆ దాడిని తట్టుకున్న కాకతీయ సైన్యం మార్చి 19నాడు లొంగిపోయింది. ప్రతాపరుద్రుడు మాలిక్ కాఫర్ విధించిన షరతులకన్నిటికీ అంగీకరించి, కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నాడు. తన ఖజానాను మొత్తంగా అప్పగించాడు. ఆ యుద్ధం ముగిసిన తరువాత ప్రతాపరుద్రుడు దక్షిణాదిలో తలెత్తిన తిరుగుబాట్లను అణచడానికి బయలుదేరి, విజయం సాధించాడు. ఆ తరువాత కంచి మీద దండయాత్ర చేసి జయించాడు. ఢిల్లీకి క్రమం తప్పకుండా కప్పం కడుతూనే ఉన్నాడు.
1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన తరువాత ఢిల్లీలో వారసత్వం గురించి పోరాటం జరిగింది. ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రతాపరుద్రుడు కప్పం కట్టడం మానేసి, స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు. దేవగిరి పాలకుడు హరపాలుడు కూడా అదే సమయంలో తిరుగుబాటు చేశాడు. ఢిల్లీ వారసత్వపు పోరులో ఖుతుబుద్దీన్ ముబారక్ విజయం సాధించి గద్దెనెక్కాడు. దేవగిరి పాలకుడిని బందీగా తీసుకుని, మరణ శిక్ష విధించారు. ముబారక్ కు కప్పం కట్టడమే మంచిదని ప్రతాపరుద్రుడు రాజీచేసుకుని, కప్పం బాకీ చెల్లించాడు. 1320లో ఢిల్లీలో పాలకులు మారారు. ఖిల్జీలు పోయి తుగ్లక్‌లు వచ్చారు. ఘసీయుద్దీన్ తుగ్లక్ రాజయ్యాడు. రాజ్యాల మీదికి దండయాత్రలు జరిపి కప్పాలు సాధించడం అనే పూర్వవిధానాన్ని మార్చి అతను భూభాగాల అక్రమణను చేపట్టాడు. 1321లో వరంగల్ మీదికి సైన్యాన్ని పంపాడు. తరువాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్‌గా ప్రఖ్యాతుడైన ఉలగ్ ఖాన్ ఈ దండయాత్రకు నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో వరంగల్ ఓడిపోయింది. ప్రతాపరుద్రుడు పరాజితుడై బందీ అయ్యాడు. బందీగా ఢిల్లీకి తీసుకుపోతుండగా మార్గ మధ్యంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు. వరంగల్ పతనం తరువాత ఉలగ్ ఖాన్ మరింత ముందుకు వెళ్లి రాజమండ్రి, నెల్లూరు మధ్య సముద్ర తీరప్రాంతాలను జయించి 1324లో కాకతీయ సామ్రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. అతను మహమ్మద్ బిన్ తుగ్లక్‌గా 1325లో ఢిల్లీలో అధికారాన్ని చేపట్టాడు. 1335–36 ప్రాంతాల్లో ముసునూరు కాపయ నాయకత్వంలో కొందరు ఆంధ్రనాయకులు తిరిగి వరంగల్ కోటను స్వాధీనం చేసుకుని కొంతకాలం పాలించారు కాని అది ఎక్కువ కాలం నిలవలేదు. వరంగల్ పతనమై, అనేక చిన్న రాజ్యాలు ఏర్పాటయ్యాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో రెడ్డి రాజ్యం, రాచకొండ, దేవరకొండలలో వెలమ పద్మనాయక రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇవి స్వతంత్రంగానే వ్యవహరించసాగాయి.
క్రీ.శ. 1347లో గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యం ఏర్పడింది. ఈ రాజ్యం ఉత్తరాన బీరారు నుంచి దక్షిణాన తుంగభద్ర ఎడమగట్టు దాకా, పశ్చిమాన దాబల్ నుంచి తూర్పున తెలంగాణ దాకా వ్యాపించింది. దీని స్థాపకుడు అల్లావుద్దీన్ బహమన్ షా (హసన్ గంగు). 1358లో రాజ్యానికి వచ్చిన అతని కుమారుడు మహ్మద్‌షా విజయనగర రాజ్యంతోనూ, వరంగల్‌తోనూ యుద్ధాలు చేసి రెంటినీ ఓడించి పెద్ద మొత్తంలో సంపదను స్వాధీనం చేసుకున్నాడు. 1422లో అహ్మద్‌షా
కాలంలో వరంగల్ మీద మరొకసారి దండయాత్ర చేసి చాలా సంపదను దోచుకున్నారు. అతనే 1430లో బీదర్ పట్టణాన్ని నిర్మించాడు. తరువాత బీదరు రాజధాని అయింది. తెలంగాణలోని రాజ్యాలు తమలో తాము పోరాడుతూ, బహమనీలతో స్నేహం చేస్తూ విడిపోతూ కాలం గడిపాయి. నల్లగొండ మొదలైన చోట్ల తిరుగుబాట్లు కూడా జరిగాయి. ఆర్మేనియాలోని టర్కోమెన్ తెగకు చెందిన కులీ ఆ దేశం నుంచి పారిపోయి వచ్చి మహమూద్ షా కాలంలో బీదర్‌లో ఆశ్రయం పొంది, రాజు విశ్వాసాన్ని చూరగొన్నాడు. 1487లో బీదరులో స్థానికులు తుర్కు ఇరానీయుల ప్రాబల్యం మీద తిరగబడి కోటను ముట్టడించినప్పుడు మహమూద్‌షాను, అతని కోటను కాపాడినందుకు కులీమీద తిరుగులేని విశ్వాసం ఏర్పడింది. 1493లో కొంకణంలో చెలరేగిన తిరుగుబాటును అణచినందుకు గాను మహమూద్ షా అతనికి కుతుబుల్ ముల్క్ (రాజ్యానికి స్తంభం వంటివాడు) అనే బిరుదాన్ని ఇచ్చాడు. అలాగే 1486లో ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ జాగీర్‌దార్‌గా నియమించాడు. 1489 నాటికే అహమద్‌నగర్, బీరార్, బిజాపూర్ సుబాలు స్వతంత్రం అయ్యాయి. మహమూద్‌షా 1496లో గోలకొండ కేంద్రంలో తెలంగాణ ప్రాంతానికి గవర్నర్‌గా కులీని నియమించాడు. కొడంగల్‌లోనే నివసిస్తూ కులీ తెలంగాణ రాజ్య వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. క్రమంగా బహమనీ రాజ్యం క్షీణించసాగింది. అయినా కులీ కుతుబ్ షా వేచివున్నాడే తప్ప తిరుగుబాటు చేయలేదు. 1512లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. 1518లో మహమూద్ షా మరణించాడు. కులీ గోలకొండ దుర్గాన్ని మరమ్మత్తు చేయించి సుల్తాన్ కులీ కుతుబ్‌షాగా అక్కడి నుంచి పాలించడం మొదలుపెట్టాడు. గోలకొండ మట్టికోట మీద నుంచి రాతి దుర్గాన్ని నిర్మించి దానికి మహమ్మద్ నగర్ అని పేరు పెట్టాడు.
కులీ కుతుబ్ షా వంశం 1512 నుంచి 1687 వరకు 150 సంవత్సరాలకు పైగా దక్కన్‌ను పాలించింది. కులీ కుతుబ్‌షా శ్రీ కృష్ణదేవరాయల (1509–1529) కూ, అచ్యుత దేవరాయుల (1530–1542) కూ సమకాలికుడు. కులీ విజయనగరంతోనూ, ఖమ్మంమెట్టు రాజులతోనూ యుద్ధాలు చేశాడు. రాచకొండ, దేవరకొండలను జయించాడు. షితాబు ఖాను అను సీతాపతి రాజుతో వరంగల్‌లో యుద్ధం చేసింది ఈ గోలకొండ రాజే. మహమ్మదీయ మతంలో షియా తెగకు చెందిన కులీ 98 సంవత్సరాలు జీవించాడు. 1543లో కులీ గోలకొండలో నమాజ్ చేస్తుండగా తన కుమారుడు జంషీద్ అలీ చేతుల్లో హత్యకు గురి అయ్యాడు.
జంషీద్ అలీ 1543లో రాజ్యానికి వచ్చి ఏడు సంవత్సరాలు మాత్రమే పాలించాడు. 1550లో అతను వ్యాధిగ్రస్తుడై మరణించాడు. ఆ తరువాత అతని ఏడు సంవత్సరాల కుమారుడిని సింహాసనం మీద జంషీద్ అలీ భార్య, కొందరు మంత్రులు ప్రతిష్టించారు. కానీ, ఏడునెలల తరువాత, జంషీద్ అలీ కాలంలో విజయనగరానికి వెళ్ళి తలదాచుకున్న కులీ కుతుబ్ షా చిన్న కుమారుడు ఇబ్రహీం తిరిగి గోలకొండకు వచ్చి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతనే సుప్రసిద్ధుడైన మల్కిభరాముడు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, విజయనగరంలో ఆశ్రయం పొంది తెలుగు మీద అభిమానం పెంచుకున్న ఇబ్రహీం తన ఆస్థానంలో తెలుగు కవులను, పండితులను ఆదరించాడు. తొలి అచ్చ తెలుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ ను రాసిన పొన్నెగంటి తెలగనార్య, అద్దంకి గంగాధరుడు, సారంగు తమ్మయలు వీరిలో ముఖ్యులు.

Q121

కులీ స్వాతంత్ర్యం ఎప్పుడు ప్రకటించుకున్నాడు ?

  1. (1) 1496
  2. (2) 1489
  3. (3) 1512
  4. (4) 1486
See answer and solution
Q122

అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు మరణించాడు ?

  1. (1) 1310
  2. (2) 1316
  3. (3) 1307
  4. (4) 1296
See answer and solution
Q123

బీదర్ పట్టణం నిర్మింపబడిందెప్పుడు ?

  1. (1) 1493
  2. (2) 1430
  3. (3) 1422
  4. (4) 1324
See answer and solution
Q124

ఖిల్జీ సైన్యం ఎప్పుడు ఓడిపోయింది ?

  1. (1) 1303
  2. (2) 1296
  3. (3) 1307
  4. (4) 1310
See answer and solution
Q125

ఖిల్జీ కాకతీయుల మీద దండయాత్రకు రెండోసారి ఎవరిని పంపాడు ?

  1. (1) మాలిక్ కాఫర్
  2. (2) ఖుతుబుద్దీన్ ముబారక్
  3. (3) మహమ్మద్ బిన్ తుగ్లక్
  4. (4) ఉలగ్ ఖాన్
See answer and solution
Q126

మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ అధికారాన్ని ఎప్పుడు చేపట్టాడు ?

  1. (1) 1325
  2. (2) 1347
  3. (3) 1422
  4. (4) 1430
See answer and solution
Q127

ఢిల్లీపాలకులు మారిన సంవత్సరం :

  1. (1) 1320
  2. (2) 1321
  3. (3) 1307
  4. (4) 1303
See answer and solution
Q128

బహుమనీ రాజ్యం ఏర్పడిన సంవత్సరం :

  1. (1) 1324
  2. (2) 1325
  3. (3) 1347
  4. (4) 1422
See answer and solution

Passage

సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానములు రాయండి :
ఈ వేళ మనం చూస్తున్న ‘ఆంధ్రకవుల చరిత్ర’ – వెనుక ఎంతటి కృషి ఉన్నదో, ఎంతటి నిబద్ధత, త్యాగం దాగి ఉందో తెలియకపోతే ఆ మహామనీషికి మనం వారసులమని చెప్పుకునే అర్హతలేదు.
కందుకూరి వారు సాహిత్య చరిత్ర రాయాలనుకునే కాలానికి శాస్త్రబద్ధమైన సాహిత్య రచనా ఒరవడి లేదు. ఒక దేశచరిత్రను రాయటం కంటే ఆ దేశకవుల చరిత్రను రాయటం ఎంతో కష్టమైన విషయం. వీరేశలింగం గారికి ముందు ‘Biographical Sketches of Deccan Poets’ - అనే కావలి వేంకట రామస్వామి రచన కనిపిస్తుంది. మెకంజీకి సాయపడిన కావలి సోదరులలోనివాడే ఈ రామస్వామి. ఇది 1847లో మొదటిసారి, 1888లో రెండోసారి ముద్రితమైంది. ఇందులో 46 మంది కవులను గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో ప్రస్తావించిన కొందరు కవులు ఇప్పటికీ సాహిత్య చరిత్రలకు ఎక్కలేదు.
ఆ తరువాత బ్రౌన్ 1852లో తెలుగు – ఇంగ్లీష్ నిఘంటువుకు రాసిన ఉపోద్ఘాతంలో కొందరు కవుల్ని, వాళ్ల గ్రంథాల్ని తాను సేకరించి పరిష్కరించిన గ్రంథాలకు సంబంధించిన సూచికల్ని పేర్కొన్నాడు. వీరేశలింగం గారి కంటే ముందు పత్రికలలో ఆయాకవుల చరిత్రలు, వాళ్ల గ్రంథాలను గురించిన కొన్ని చర్చలు ఉన్నాయి. ఉదాహరణకు లోకరంజని (సం.కాకర్ల సుబ్బయ్య), సకల విద్యాభివర్ధిని (సం.గూడూరు వెంకట కృష్ణారావు), పురుషార్థప్రదాయిని, అముద్రిత గ్రంథ చింతామణి, రాజయోగి, ప్రబంధ కల్పవల్లి వంటివి.
ప్రస్తావికంగా తెలుగుకవుల జీవితాల్ని వీరేశలింగం గారి కంటే ముందే గ్రంథస్థం చేసిన వాళ్ళలో బహుజనపల్లి సీతారామాచార్యులు, ఎనమండ్రము వేంకటరామయ్య గారిని ప్రస్తావించాలి. శబ్దరత్నాకరంలోని బహుజనపల్లి వారి ప్రస్తావనలు రేఖామాత్రమైనవి. వీరేశలింగంగారు కూడా శబ్దరత్నాకరంలో బహుజనపల్లివారు పేర్కొన్న కొందరు కవుల పేర్లు, వాళ్ళ గ్రంథాల పేర్లు వినటమే గాని తమకు లభించలేదని, కొన్నిటిని సంపాదించి ప్రచురించగలిగామని పేర్కొన్నారు. (స్వీయచరిత్ర 2వ భాగం, పుట 233) ఎనమండ్రము వేంకట రామయ్యగారి గ్రంథమైన పురాణనామచంద్రిక మన పూర్వగాథాలహరి వంటి గ్రంథం.
వీరేశలింగం గారి కంటే ముందు వెలువడిన గురజాడ శ్రీరామమూర్తిగారి కవులచరిత్రే మొట్టమొదటి తెలుగుసాహిత్య చరిత్రగా పేర్కొనాలి. ఎందుకంటే శ్రీరామమూర్తిగారు గ్రంథాన్ని కవుల చరిత్రగా రాయలని ఉద్దేశించాడు కాబట్టి. అయితే ఇందులో కవుల కాలవిభాగం లేదు. కాలనిర్ణయాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే వీరేశలింగంగారి ‘ఆంధ్రకవులచరిత్ర’
వెలువడిన తరువాత, తను చేసిన కాలనిర్ణయానికి, వీరేశలింగంగారు చేసిన కాలనిర్ణయానికి వైరుధ్యమేర్పడటంతో ఆయాకవుల కాలనిర్ణయాన్ని చర్చించి మళ్లీ రెండవ ముద్రణ వెలయించారు. ఇందులో జనబాహుళ్యంలో శ్రుతమయ్యే కట్టుకథలకే అగ్రతాంబూలం. శాస్త్రీయత అంతగా కనిపించదు.అసంగతమైన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.
వీరేశలింగంగారు కవులచరిత్ర రాసే నాటికి శాసన పరిష్కరణలు సమర్థంగా జరగలేదు. కావ్యాలకు వచ్చిన సంశోధిత ముద్రణలు లేవు. తాళీదళప్రకర కాంతారంలో అసూర్యంపశ్యలుగానున్న ఎన్నో గ్రంథాల సమాచారం నామమాత్రంగా నైనా లేదు. ఒక నిర్దుష్టమైన ప్రణాళికతో రాసిన గ్రంథాలేవీ లేవు. వీరేశలింగంగారి సాహిత్య చరిత్రకు ఆనాడు ఆధారంగానున్న సామగ్రి :

  1. తంజావూరు సరస్వతీమహల్ లోని తాళపత్రాలు
  2. చెన్నపట్నంలోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం
  3. రాబర్ట్‌సీవెల్ శాసన సంపుటాలు
  4. మెకంజీ కైఫీయత్‌లు
  5. సి.పి. బ్రౌన్ సేకరించిన గ్రంథాలు
  6. ‘కార్మికేల్’ – ప్రోత్సాహంతో బుక్కపట్నం రాఘవాచార్యులు వ్రాసిన ఆంధ్రదేశచరిత్ర రాతప్రతి
    ఈ సామగ్రిని జాగ్రత్తగా విశ్లేషించుకొని ఒంటిచేత్తో కవులచరిత్రను రాశారు. మొట్టమొదట కవుల చరిత్రను 1886వ సంవత్సరంలో వివేకవర్ధనిలో సీరియల్‌గా ప్రచురించారు. అదే సంవత్సరం ప్రథమ భాగాన్ని డెబ్బైపుటలతో పుస్తక రూపంతో ప్రచురించారు. ఆ మరుసటి సంవత్సరమే అంటే 1887వ సంవత్సరంలో డెబ్బైపేజీల ఈ గ్రంధాన్ని పన్నెండు పేజీల అనుబంధంతో ప్రచురించారు. ఈ ప్రథమ భాగాన్నే 1890వ సంవత్సరంలో మూడవ ముద్రణ వెలువడింది. రెండవ ముద్రణలోని అనుబంధం ప్రధానభాగంలో చేర్చి 96 పేజీల గ్రంథంగా దీన్ని వెలువరించారు. 1895లో వచ్చిన నాల్గవ ముద్రణ 150 పుటల గ్రంథం. 72 పుటలు గల ప్రథమ భాగపు ప్రథమ ముద్రణ 1895 నాటికి రెట్టింపు అయింది. తమ సంపుటాలలో భాగంగా తిరిగి ఈ గ్రంథాన్ని 1899 నాటికి పునర్ముద్రిస్తున్న సందర్భంలో 160 పేజీల పరిమాణమైంది. ఈ తొలి భాగమే 1917వ సంవత్సరం నాటికి 684 పేజీల పరిమాణాన్ని పొందింది. దీనిని బట్టి కందుకూరి వారి నిరంతర పరిశోధన ప్రవణత ఏపాటిదో అర్థమవుతుంది. పుస్తకరూపంలో 1894లో ప్రచురించిన కవులచరిత్ర రెండోభాగాన్ని 1892–1894 సంవత్సరాల మధ్యకాలంలో చింతామణి పత్రికలో కందుకూరి ప్రకటించారు. అలాగే తృతీయభాగాన్ని 1897లో ప్రకటించారు. ఈ మూడు సంపుటాల్ని కలిపి ఒకే
    సంపుటంగా, తమ గ్రంథ సంపుటాలలో భాగంగా 1899వ సంవత్సరంలో ముద్రించారు. 1894లో ముద్రించిన కవుల చరిత్ర రెండో భాగంలోనున్న యాభైమంది కవుల సంఖ్య ఒకే సంపుటిగా ప్రచురించే నాటికి యాభై ఏడుకు పెరిగింది. మూడో భాగంలోని కవుల సంఖ్య 139. ఒకే సంపుటిగా 1899 సంవత్సరంలో ముద్రించేనాటికి కవులచరిత్రలో కూర్చబడిన కవుల సంఖ్య 218. 1917వ సంవత్సరాన పున: సంశోధించి ప్రచురించిన ఈ గ్రంథంలోని కవుల చరిత్రలు 232. మొదటి భాగంలో చెప్పిన చాలా అభిప్రాయాలు ఈ సంశోధిత ముద్రణకాలానికి మారాయి. వారు జీవించినంతకాలం కవులచరిత్రను సంస్కరిస్తూనే వచ్చారు. దానికి కారణం మానవల్లి, కొమఱ్ఱాజు, వేటూరి ప్రభాకరశాస్త్రి, వంగూరి సుబ్బారావు వంటి పరిశోధకులు కొత్త కొత్త పరిశోధనల ఫలాన్ని వెలువరించటమే. వీరేశలింగం కార్యదీక్షలోనూ, ఎప్పటికప్పుడు విజ్ఞానాత్మకంగా ఎదగటంలోనూ వెనుకబడలేదు. తన లోపాన్ని, రచనలో చేసిన దోషాన్ని సవరించుకోవటానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అది సాహిత్య చరిత్రకూ వర్తిస్తుంది. ఉదాహరణకు పోతన ఒంటిమిట్ట వాసి అనటం తరువాత సవరించుకోవటం.
    కవి కాలాదుల్ని నిర్ణయించటం, కావ్యతత్త్వ విమర్శ ఈ రెండు రెండు కళ్లుగా వీరేశలింగం గారి కవులచరిత్ర సాగుతుంది. ప్రతి కవికి సంబంధించిన కావ్యశైలిని పరిచయం చేస్తూ ఒకటి రెండు పద్యాలను ఉదాహరించటం కవులచరిత్రలో కనిపిస్తుంది. తనకు సమాచారం లేని కవులను గురించి పాఠకులకు, భావిపరిశోధకులకు వదలి వేశారే గాని ‘అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక:’ అని దబాయించలేదు. రెండో సంపుటంలో కొందరు కవుల కాలనిర్ణయాన్ని చేయలేదు. తనవి పొరపాట్లని రూఢమైనప్పుడు, ఆ సమాచారమందించిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పిమరీ సవరించుకున్నారు. రెండవ భాగంలో వీరేశలింగం పంతులుగారు చేసిన పొరపాట్లను మానవల్లి రామకృష్ణకవి ఎత్తిచూపగా వాటినన్నింటినీ తరువాత సవరించి మానవల్లి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Q129

కవుల చరిత్ర రెండోభాగం ఏ పత్రికలో ప్రకటితమైంది ?

  1. (1) పురుషార్ధ ప్రదాయిని
  2. (2) ఆముద్రిత గ్రంథ చింతామణి
  3. (3) వివేకవర్ధని
  4. (4) చింతామణి
See answer and solution
Q130

శబ్దరత్నాకరము రచించిన వారు :

  1. (1) వీరేశలింగం
  2. (2) బహుజన పల్లి సీతారామాచార్యులు
  3. (3) కాకర్ల సుబ్బారావు
  4. (4) గూడూరు వెంకట కృష్ణారావు
See answer and solution
Q131

‘బయోగ్రాఫికల్ స్కెచెస్ ఆఫ్ డెక్కన్ పోమెట్స్’ ఎవరిది ?

  1. (1) వీరేశలింగం పంతులు
  2. (2) కల్నల్ మెకంజీ
  3. (3) కావలి వేంకట రామస్వామి
  4. (4) గూడూరు వేంకట సుబ్బారావు
See answer and solution
Q132

ఆంధ్రకవుల చరిత్ర రెండవ భాగంలో పొరపాట్లను ఎత్తి చూపినవారు :

  1. (1) మానవల్లి రామకృష్ణ కవి
  2. (2) కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు
  3. (3) నందూరి సుబ్బారావు
  4. (4) వేటూరి ప్రభాకర శాస్త్రి
See answer and solution
Q133

పురాణ నామచంద్రిక ఎవరిది ?

  1. (1) కావలి వేంకట రామస్వామి
  2. (2) మెకంజీ
  3. (3) ఎనమండ్రము వేంకటరామయ్య
  4. (4) కాకర్ల సుబ్బయ్య
See answer and solution
Q134

‘ఆంధ్ర కవుల చరిత్ర’ రాసినది __________.

  1. (1) వీరేశలింగం
  2. (2) గురజాడ శ్రీరామ మూర్తి
  3. (3) కావలి వేంకట స్వామి
  4. (4) కల్నల్ మెకంజీ
See answer and solution
Q135

వీరేశలింగం కవుల చరిత్రను తొలుత ఏ పత్రికలో ప్రకటించారు ?

  1. (1) వివేక వర్ధిని
  2. (2) ఆముద్రిత గ్రంథ చింతామణి
  3. (3) పురుషార్థ ప్రదాయిని
  4. (4) ప్రబంధ కల్పవల్లి
See answer and solution
Q136

భాషా సామర్థ్యం అభ్యాసకులకు ఈ శక్తినస్తుంది :

  1. (1) వ్యాకరణం ప్రకారం సరైన వాక్యాలు, సరికాని వాక్యాలు వేరుచేసేందుకు
  2. (2) వ్యాకరణ సంబంధంగా సరికానప్పటికీ ధారళంగా మాట్లాడటం
  3. (3) భాషను ఎప్పుడు, ఎక్కడ సరిగ్గా వాడాలో తెలుసుకోవడం
  4. (4) మరింత విరివగ ఇంగ్లీషు వాడటం
See answer and solution
Q137

ప్రాథమిక స్థాయిలో ఒక ఉపాధ్యాయురాలు రంగులు వేయమని, బొమ్మలు గీయమని విద్యార్థులను ప్రోత్సాహిస్తుంది. అది ఇందుకు ఉపకరిస్తుంది :

  1. (1) అభ్యాసకులు తరగతి గదిలో మౌనంగా ఉండటంలో నిమగ్నం చేస్తుంది.
  2. (2) చక్కటి మోటరు నైపుణ్యాలను వృద్ధిపర్చుతుంది.
  3. (3) అభ్యాసకుల్ని ఆనందపర్చుతుంది.
  4. (4) ఉపాధ్యాయుడికి బోధన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
See answer and solution
Q138

ఇది ఉన్నప్పుడు పిల్లలు ఒక భాషను చాలా శక్తివంతంగా నేర్చుకుంటారు ?

  1. (1) నిపుణుడయిన భాషా ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు
  2. (2) మంచి వాచక పుస్తకం ఉన్నప్పుడు
  3. (3) ఆపుదల (inhibition)
  4. (4) ప్రోత్సాహం
See answer and solution
Q139

ఒక ఉపాధ్యాయురాలు తన తరగతి గదిలో గ్రూపు చర్చ మరియు సమవుజ్జీ సంవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అక్షర దోషాలు, ఉచ్చారణ దోషాల గురించి ఆమె పట్టించుకోదు, వాటిని సరిదిద్దదు. ఆమె తన తరగతి గదిలో __________ పద్ధతి ఉపయోగిస్తోంది.

  1. (1) సంప్రదాయ
  2. (2) మిశ్రమ (eclectic)
  3. (3) నిర్మాణ వాద (structural)
  4. (4) నిర్మితి వాద (constructivist)
See answer and solution
Q140

పాఠ్యాంశంలో ఉపయోగించబడిన భాష పిల్లలను చాలా కష్టంగా ఉందని ఒక ఉపాధ్యాయుడిగా మీరు గుర్తిస్తారు. పిల్లలకు అనుకూలంగా ఉండేందుకు మీరు భాషను సరళీకరించటంతో పాటు కొన్ని మార్పులు విషయానికి సంబంధించి చేస్తారు. మీరు చేసిన దానిని ఏమంటారు ?

  1. (1) దత్తత తీసుకోవటం
  2. (2) రూపాంతరీకరించటం
  3. (3) మూల్యాంకనం చేయటం
  4. (4) సమీక్షించటం
See answer and solution
Q141

రాజు పాఠశాలకు వెళుతున్నానని ఇవ్వాళ చాలా సంతోషంగా ఉన్నాడు. తన కుటుంబంలో పాఠశాలకు వెళుతున్న మొదటి వాడు తనే. తన తల్లిదండ్రులతో సహా తన కుటుంబంలో ఎవ్వరూ పాఠశాలకు వెళ్ళలేదు. ఆ విధంగా రాజు – అభ్యాసకుడు :

  1. (1) మొదటి తరం
  2. (2) రెండవ తరం
  3. (3) మార్జినలైజ్డ్
  4. (4) మైనార్టీ
See answer and solution
Q142

నువ్వు బోధించటానికి వెళ్ళినప్పుడు వాచక పుస్తకం రైమ్స్, బొమ్మలు, కథలతో మొదలయి అక్షరమాలతో ముగించటం గమనిస్తావు. ఈ తరహా విధానం ఏ భాషాబోధన శాస్త్రాన్ని సూచిస్తుంది ?

  1. (1) క్రింది నుంచి పైకి పద్ధతి
  2. (2) పై నుంచి క్రిందకు పద్ధతి
  3. (3) మిశ్రమ పద్ధతి
  4. (4) కళాత్మక పద్ధతి
See answer and solution
Q143

ఎటువంటి క్రమబద్ధ ఆచరణ లేకుండా సహజంగా భాషను నేర్చుకోవటాన్ని ఏమంటారు ?

  1. (1) అర్జిత పాండిత్యము
  2. (2) సమపార్జన
  3. (3) అంగీకారం
  4. (4) అభ్యసనం
See answer and solution
Q144

__________ యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి అభ్యాసకులు సమస్యలకు జంటలుగాను లేక బృందాలుగాను సంయుక్తంగా పరిష్కరిస్తారు.

  1. (1) భావ ప్రసార భాషా బోధన
  2. (2) ప్రవర్తనవాద పద్ధతి
  3. (3) సంపూర్ణ భాషా పద్ధతి
  4. (4) నిర్మాణ వాద పద్ధతి
See answer and solution
Q145

‘కాలుష్యం’ అనే అంశం గురించి పాఠ్యప్రణాళిక సిద్ధం చేస్తున్నప్పుడు మీ మొదటి ప్రాధాన్యత ఏమిటి ?

  1. (1) పరిచయ ప్రశ్నలు తయారుచేయటం
  2. (2) అంశాలను చాలాసార్లు చదవటం
  3. (3) బోధన సహాయకాలు ఎన్నుకోవటం
  4. (4) లక్ష్యాలు రూపొందిచటం
See answer and solution
Q146

ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను నీటి గురించి ఒక పేరాగ్రాఫ్ రాయమని అడుగుతుంది. అప్పుడు విద్యార్థులు సైన్స్, సోషల్ సైన్స్ తరగతుల్లో తమకు చెప్పబడిన విషయాల గురించి చర్చించటం మొదలుపెడతారు. ఆ తరువాత నీటి గురించి రాయడం మొదలు పెడతారు. ఇది ఇందుకు ఉదాహరణ :

  1. (1) ఉపయోగంలో భాష
  2. (2) సైన్స్ భాష
  3. (3) పాఠ్యాంశాలు అంతటా భాష
  4. (4) భావ ప్రసార పద్ధతి
See answer and solution
Q147

మీరు అందరూ హిందీ మాట్లాడే గ్రామంలో పుట్టిపెరిగారు. ఏ పాఠశాలకు వెళ్ళకుండా మీరు కూడ హిందీ మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ తర్వాత పాఠశాలకు వెళ్ళి ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, ఉర్దు అభ్యసించటం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతారు. ఇప్పుడు మీ మొదటి భాష ఏది ?

  1. (1) ఇంగ్లీషు
  2. (2) హిందీ
  3. (3) ఉర్దు
  4. (4) సంస్కృతం
See answer and solution
Q148

ఒక ఉపాధ్యాయురాలు నిజ జీవితంలో వాడే గొడుగు, వర్షపుకోటు, స్క్రూడ్రైవర్ లాంటివి తరగతి గదికి తీసుకువస్తుంది. ఆ వస్తువుల్ని రెండు మూడు వాక్యాలలో వర్ణించమని విద్యార్థుల్ని అడుగుతుంది. ఆ ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి తెచ్చే సామాగ్రిని సాంకేతికంగా ఏమంటారు ?

  1. (1) భాషా ఉత్పదకం
  2. (2) బోధన సూచికలు
  3. (3) పరికరాలు
  4. (4) రియాలియా
See answer and solution
Q149

మీరు తరగతి గదిలో కాల బోధకాన్ని (టెన్స్) చెప్పేందుకు ఒకే వ్యక్తికి సంబంధించిన రెండు ఫోటోలు వాడుతారు. ఒకటి 15 సంవత్సరాల క్రితం తీయించుకున్నది. రెండవది అప్పుడే తీయించుకున్నది. తరగతి గదిలో అతని గతానికి వర్తమాననికి సంబంధించిన, రూపం, అలవాట్లు మొదలైన వాటి గురించి చర్చ ప్రారంభించండి. ఈ సందర్భంలో మీరు ఉపయోగిస్తున్నది __________.

  1. (1) ఆదేశ వ్యాకరణ
  2. (2) నిర్మాణ వాద వ్యాకరణం
  3. (3) బోధనశాస్త్ర వ్యాకరణం
  4. (4) సూత్ర ఆధారిత వ్యాకరణం
See answer and solution
Q150

తమ తరగతి ముగిసేలోపు విద్యార్థులు సమపార్జించుకోవల్సిన జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులు మొదలైన వాటిని గురించి వర్ణించే ప్రకటనలు దేని క్రిందకు వస్తాయి :

  1. (1) బోధన ఫలితాలు
  2. (2) అభ్యసన ఫలితాలు
  3. (3) సంఖ్యా సంబంధ ఫలితాలు
  4. (4) మౌలిక అక్షరాస్యత ఫలితాలు
See answer and solution