By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 1 Telugu, Question 146

Topic: Pedagogy of language

Q146

ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను నీటి గురించి ఒక పేరాగ్రాఫ్ రాయమని అడుగుతుంది. అప్పుడు విద్యార్థులు సైన్స్, సోషల్ సైన్స్ తరగతుల్లో తమకు చెప్పబడిన విషయాల గురించి చర్చించటం మొదలుపెడతారు. ఆ తరువాత నీటి గురించి రాయడం మొదలు పెడతారు. ఇది ఇందుకు ఉదాహరణ :

  1. (1) ఉపయోగంలో భాష
  2. (2) సైన్స్ భాష
  3. (3) పాఠ్యాంశాలు అంతటా భాషCorrect answer
  4. (4) భావ ప్రసార పద్ధతి

Solution.

CBSE answer: (3)

జవాబు: (3) పాఠ్యాంశాలు అంతటా భాష

  1. నీటి గురించి రాయడానికి పిల్లలు సైన్స్, సోషల్ సైన్స్ తరగతుల్లో నేర్చుకున్న విషయాలను చర్చించి వాడుకుంటున్నారు.
  2. భాష ఒక్క భాషా తరగతికే పరిమితం కాదు; అన్ని విషయాలు నేర్చుకోవడానికీ, వ్యక్తం చేయడానికీ భాషే సాధనం. ఇదే పాఠ్యాంశాలు అంతటా భాష (language across the curriculum).

జాగ్రత్త: 'సైన్స్ భాష' ఒకే విషయానికి పరిమితం; ఇక్కడ రెండు విషయాలు కలుస్తున్నాయి.