By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 1 Telugu, Question 94

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

19వ శతాబ్దపు ఉత్తరార్థంలో కావ్య సమీక్షా క్షేత్రంలో కల్పనకు బదులుగా సాంఘిక, సాంస్కృతిక, నైతిక విలువలు పల్లవించినట్లు అగుపిస్తాయి. కార్లాయిల్ (Carlayal) (1795-1881) రస్కిన్ (Ruskin) (1819-1900) మేథ్యూ ఆర్నాల్డు (Mathew Arnald) (1812-1888) మెకాలె (Mecualay) (1800-1856) మొదలగు వారలు కావ్యంలో నైతిక, సాంస్కృతిక విలువల ప్రాధాన్యతను ప్రతిపాదించారు. ఈ దిశలో మైథ్యూ ఆర్నాల్డు ప్రాతినిధ్యం వహించిన సమీక్షకుడు. ఆస్కర్ వాయిల్డ్ (Oscar waild) (1854-1900) లో ఉపర్యుక్త నైతిక ప్రవృత్తికి ప్రతిక్రియాత్మక రూపం అగుపిస్తుంది. నానారకాలైన సాంఘిక బంధనాల నుండి విముక్తమైన విశుద్ధ కావ్యాత్మక ఆనందాన్ని ఆయన కావ్య లక్ష్యంగా భావించాడు. ఈ కాలంలోనే ఫ్రాన్స్‌లో జోలా (Emile Zola-1840-1902) యదార్థ వాదంతో కూడిన ప్రకృతి వాద కళకు నాంది పఠించాడు. ఆతని కావ్యదృక్పధంలో సైతం పరంపరాగత నైతికతను, మర్యాదను అవహేళన పరచెడి ప్రవృత్తి ద్యోతక మవుతుంది.

20వ శతాబ్ధంలో కావ్య చింతన అనేక దిశలలో పురోగమించింది. వర్స్‌ఫోల్డ్ ‘జజ్‌మెంట్ ఇన్ లిటరేచర్’ రచించు నాటికి 19వ శతాబ్ధపు సాహిత్యమే అతనికి అందుబాటులో ఉండుట వలన ఆధునిక యుగ సమీక్షా క్షేత్రంలో విభిన్న దిశలలో వికాసమానమవుతున్న కావ్య చింతనను విశ్లేషించ లేక పోయాడు. 20వ శతాబ్ధంలో ‘క్రోచే’ అభివ్యక్తీకరణ వాదం, ఫ్రాయెడ్, ‘అంతశ్చేతనావాదం’ ఆంధ్రబ్రేతా, పాల్ ఎడ్వర్డ్ల ‘అతియదార్థవాదం’ సార్త్ర్ ‘అస్తిత్వవాదం’ మున్నగు ప్రముఖ కావ్య చింతనా దిశలలో సమీక్షా క్షేత్రం ప్రభావితం అయింది. ఈ శతాబ్ధపు కావ్య చింతనపై ఫ్రాయెడ్, అతని శిష్య పరంపర, మార్క్స అతని అనుయాయుల ప్రభావం అధికంగా అగుపిస్తుంది. క్రోచే యొక్క అభివ్యక్తీకరణ వాదం పాతబడి పోయింది. సార్త్ర్ అస్తిత్వవాదం అధికంగా చర్చించబడుతూ ఉంది.

క్రోచే (Croche-1866-1952) ఇటలీ దేశపు దార్శనిక వేత్త, ఆయన కళానందాన్ని సహజానుభూత ఆనందంగా భావించాడు. ఆతని దృష్టిలో జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. సహజాతం, బుద్ధ్యుపలబ్ధం. కళ సహజ జ్ఞాన ప్రసూతం. శాస్త్రం బుద్ధ్యపలబ్ధ జ్ఞాన జాతం. ఈ తీరున సహజ జ్ఞానమే అభివ్యక్తీకరణం అవుతుంది. జ్ఞానం రూపగ్రహణ నిమిత్తం నాలుగు దశలలో పురోగమిస్తుంది. మొదట మనస్సు ప్రభావాన్ని గ్రహిస్తుంది. తరువాత ఈ ప్రభావం మనోజగత్తులో వ్యంజితం అవుతుంది. తదనంతరం దాని స్థూల అభివ్యక్తీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియలో మూల వస్తువు సహజ జ్ఞానం లేక అభివ్యక్తీకరణం అవుతుంది. అభివ్యక్తీకరణ ఎన్నడునూ వికారంగా ఉండదు. అందువలన అభివ్యక్తీకరణ సౌందర్యమే కావ్య సౌందర్యం అవుతుంది.

ఫ్రాయెడ్ (Frued 1856-1939) మానసిక శాస్త్రాధారంగా కావ్య రచనాత్మక ప్రక్రియను అవచేతన మానసంతో అనుసంధాన పరచాడు. అతని మతానుసారం మనస్సు రెండుగా విభజింపబడుతుంది. చేతనం, అవచేతనం, నెరవేరని కోరికలు నియంత్రిత వాసనల రూపంలో అవచేతన మానసంలో గూడుకట్టుకొని ఉంటాయి. ఈ నియంత్రిత వాసనలే కావ్యంలో శబ్ధ ప్రతీకాల రూపంలో సాక్షాత్కరిస్తాయి. ఈ విధంగా ప్రతి కావ్యం దానిని రచించిన కవి యొక్క ఏదో ఒక నియంత్రిత వాసనకు కళాత్మక మనోవేగమే అవుతుంది. ఫ్రాయెడ్ శిష్యుడు యూంగ్ (Yung 1875-1961) ఈ నియంత్రిత వాసనా సిద్ధాంతాన్ని అంగీకరింపక కావ్యం కవి యొక్క ‘అహం’ భావనతో షునిష్ఠ సంబంధాన్ని కలిగి ఉంటుందని వివరించాడు. అతని మతంలో కళాకారుని అహం భావన ఇతర భావాలన్నింటిని నియంత్రిత పరచి కళారూపంలో వ్యక్తం అవుతుంది. మానసిక శాస్త్రాధారంగా కళను పరిశీలించిన మూడవ శాస్త్రవేత్త ఎడ్లర్ (Edler 1870-1937) ఆయన కళాకారుని న్యూనతా భావనను కళాసృజనకు మూలంగా ప్రతిపాదించాడు. అతని దృష్టిలో గొప్ప గొప్ప కళాకారు లందరు ఏదో ఒక న్యూనతా భావనచే పీడింపబడిన వారై ఉంటారు. వారు కళాసృజన ద్వారా ఈ హీనతా భావన నుండి విముక్తిని కాంక్షిస్తారు.

అతియథార్థవాదం కూడా అంతశ్చేతనావాదం పై ఆధారపడి ఉంది. వాస్తవిక జీవనంలో ఉపలబ్ధం కానేరని రూపాల, బింబాల, ప్రతీకాల మాధ్యమంలో స్వప్న సంవేదన ఆధారంగా కళ సృష్టింపబడుతుందని అతి యధార్థవాదుల మతం. మొదట ఈ సిద్ధాంతం చిత్రకళలో లేవదీయ బడింది. సాహిత్యంలో దీనిని ప్రతిష్టించిన వారిలో ఫ్రాన్స్‌కు చెందిన అంద్రెబ్రెటాన్ (Andre Breton), పాల్ ఎడ్వర్డ్ (Paul Edward) ప్రముఖులు.

కార్ల మార్క్స (Carl Marx-1818-1883) యొక్క వస్తువాద దర్శనం 20వ శతాబ్దపు కళాచేతనను చాలావరకు ప్రభావిత పరిచింది. మార్క్సవాద దర్శనాన్ని ప్రాతిపదికగా గ్రహించి ‘క్రిస్టోఫర్ కాల్డ్‌వెల్’ తన ప్రసిద్ధ రచనయైన, ‘ఇల్యూజన్ అండ్ రియాలిటీ’లో కళాసిద్ధాంతాన్ని స్థాపించాడు. అతని మతానుసారం యుగవిశేషంలోని వర్గ చైతన్యం కళాకృతుల రచనకు మూలంగా పనిచేస్తుంది. తన వికాస యాత్రలో మానవతక్రమంగా పూర్వోత్తర శిలాయుగాలను, సామ్రాజ్య యుగాన్ని సామంతయుగాన్ని, ధనిక యుగాన్ని దాటి ఈ తీరున నేడు మనముందు నిలిచి ఉంది. ఏ యుగ సాహిత్యమైనా ఆ యుగ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. సాహిత్యకారుడు తెలిసియో, తెలియకయో ఆర్థిక వ్యవస్థా పాలక వర్గహితాన్నే కాంక్షిస్తాడు. కళాచింతన నితాంతం సమాజ నిరపేక్షం కాకుండా రక్షింప బడుటయే ఈ సిద్ధాంత స్థాపన ద్వారా సాహిత్యానికి చేకూరిన ప్రయోజనం.

సాహిత్య సమీక్షా క్షేత్రంలో ఐ.ఎ. రిచర్డ్స్ (I.A.Richards 1893-1979) స్థాపించిన సిద్ధాంతం ‘మనోవైజ్ఞానిక హితవాదం’ గా తెలుపబడుతుంది. రిచర్డ్స్ సుప్రసిద్ధ రచనయైన ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరరి క్రిటిసిజమ్’ 1924 లో ప్రచురింపబడింది. ఆయన కళానిరపేక్షతా సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు.

వర్తమాన యుగంలో ప్రతిభావంతుడైన కవి, విమర్శకుడు టి.యస్. ఇలియట్ (T.S. Eliot. 1888-1965) నిర్వైయక్తిక అనుభూతిని కళ యొక్క ఉత్కృష్టతకు ప్రమాణంగా భావించాడు. అతని మతంలో కళాకారుని భోగాత్మక మానసం సృజనాత్మక మానసం కన్నా భిన్నంగా ఉంటుంది. అందువలన కళాకృతి తటస్థ సృష్టి అవుతుంది. పారంపర్య ప్రాతిపదికపై ఇలియట్ కళాకారున్ని పరిశీలింప నిశ్చయించినాడు. ఆయన తన చింతనా పటిమచే సమీక్షా జగత్తును అత్యధికంగా ప్రభావితం చేసినాడు. ఒక రకంగా ఇలియట్ సాంప్రదాయిక చింతను పునఃప్రతిష్ఠించాడు.

Q94

‘అస్తిత్వవాదం’ ప్రతిపాదించిన వారు :

  1. (1) జోలా
  2. (2) సార్త్ర్Correct answer
  3. (3) ఇలియట్
  4. (4) మార్క్స

Solution.

CBSE answer: (2)

జవాబు: (2) సార్త్ర్

  1. గద్యంలో 'సార్త్ర్ అస్తిత్వవాదం' అని నేరుగా ఉంది; అది ఇప్పటికీ అధికంగా చర్చించబడుతోందని కూడా చెప్పబడింది.
  2. జోలాది యదార్థవాదంతో కూడిన ప్రకృతి వాద కళ, మార్క్స్‌ది వస్తువాద దర్శనం, ఇలియట్‌ది నిర్వైయక్తిక అనుభూతి సిద్ధాంతం.

జాగ్రత్త: పేర్లు, వాదాలు ఒకే చోట వరుసగా ఉన్నాయి; ప్రతి పేరుకు తన వాదాన్ని జాగ్రత్తగా జత చేయాలి.