ఆంధ్రుల చరిత్రము రాసినవారు :
- (1) చిలుకూరి వీరభద్ర రావు
- (2) న్యాపతి నారాయణరావు
- (3) వి.రామకృష్ణ
- (4) జి.వి. సుబ్బారావు
You are reading the question paper with answers. This is not the timed test: no clock is running and nothing is being scored.
Go to the timed test →సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
బ్రిటిష్ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినంత వరకు 20వ శతాబ్ది తొలి దశాబ్దులు జాతీయోద్యమం ఉధృతమైన కాలం. ఆంధ్రోద్యమం, సంఘసంస్కరణోద్యమం, గ్రంథాలయోద్యమం అన్నీ వెనుకపట్టు పట్టి, సత్యాగ్రహాలూ సహాయనిరాకరణలూ ప్రధాన ఉద్యమంగా మారిన కాలం. సోవియట్ విప్లవ ప్రభావం క్రమంగా పరుచుకుంటున్న కాలం. ప్రపంచయుద్ధ పర్యవసానంగా ముంచుకు వచ్చిన ఆర్థిక మాంద్యం తెలుగు జీవితాలను కూడా తాకిన కాలం. ప్రపంచవ్యాప్తంగా రంగం మీదకి వస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలు, పోరాటాలు, కళాసాహిత్య సిద్ధాంతాలు తెలుగు వారికి కూడా స్పర్శలోకి వస్తున్న కాలం. భాషా సాహిత్యాలకు సంబంధించి ఇది భావకవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వానికి ప్రయాణించిన కాలం. వ్యావహారిక భాషా వాదం వచనరచనల వెల్లువ బలంతో విజేత అవుతున్న కాలం. కథ, నవల, వ్యాసం వికసించిన కాలం.
1919, మద్రాసు. కందుకూరి వీరేశలింగం మరణించిన సంవత్సరం. అస్తమయానికి కొన్ని రోజుల ముందు, 1919 మే 27వ తేదీ. మద్రాసులోని ఎగ్మూరులో కొమర్రాజు లక్ష్మణరావు ఇల్లు వేదవిలాస్. వీరేశలింగం పడకకుర్చీలో కూర్చుని స్వీయ చరిత్ర మూడో భాగం రాస్తున్నారు. అప్పటికి నలభై ఐదు పేజీలు రాశారు. ఆయన చేయి కొంచెం వణికేది. ఆఖరి పంక్తిని పూర్తి చేయలేకపోయారు. ఆ కాయితాలన్నిటిని దగ్గర ఉన్న అచంట లక్ష్మీపతికి ఇచ్చారు. కడసారి సందేశంగా ఒక చీటీ రాసి లక్ష్మీపతికి ఇచ్చారు. “నా జీవితంలో సాధించవల్సిన కార్యములింకెన్నో ఉన్నవి. అవి సాధించబడక పూర్వమే అసువులు వీడవల్సి వస్తున్నది. అయినా నా అనుచరులు, మిత్రులు, సంస్కారాభిలాషులు నా యీ మిగిలిన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. అజ్ఞానంతో, అమాయకత్వంతో జీవిత సంస్కారం లేని ప్రజాసామాన్యానికి విద్య, విజ్ఞానం, సమానత్వం, సంస్కారం కలిగించడానికి కృషి చేయాలని కోరుతున్నాను” అని ఆ సందేశంలో ఉంది. (ఆచంట లక్ష్మీపతి, మా గురువుగారు, విరేశలింగ వర్ధంతి సంచిక, 1944:5)
వీరేశలింగం నిష్క్రమణతో యుగాంతం జరిగినా సంఘసంస్కరణోద్యమాల క్షీణత 1907 నుంచే ప్రారంభమైందని వి.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఆ తరువాత రాజకీయాలది పైచేయి అయిందని, ఆ కాలంలోనే బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశానికి రావడం, స్వదేశీ ఉద్యమం పుంజుకోవడం, సంస్కరణల కంటె రాజకీయ కార్యవాదుల మాట నెగ్గుతూ రావడం, ఇంతలో ఆంధ్రోద్యమం ముందుకు రావడం జరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే 1907 తరువాత కానీ, 1919 తరువాత కానీ సంఘసంస్కరణ అనేది అంతరించిపోయినట్లు కాదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. “...సూర్యరశ్మి మొక్కల చేత గ్రహింపబడినట్లు అది కండ్లకు కనిపించకుండా, నిశ్శబ్దంగా బౌద్ధిక వాతావరణంలో భాగమైంది, తరువాతి తరాన్ని నిర్మించిన పదార్థమైందని” ఆయన అన్నారు. (ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమాలు, 1986 : 136)
సంఘసంస్కరణలు తెర వెనుకకు పోగా, తెర ముందున్నవి ఆంధ్రోద్యమం, జాతీయోద్యమం. 1905లో జరిగిన బెంగాల్ విభజన దేశమంతటా భాషా జాతీయభావాలను ప్రేరేపించగా, 1911లో పట్టాభిషేకం కానుకగా ఐదో జార్జి బెంగాల్ విభజనను రద్దు చేయడమే కాకుండా, బంగ్లా భాష మాట్లాడే వారి కోసం బెంగాల్ రాష్ట్రాన్ని, హిందీ మాట్లాడే వారి కోసం బిహారు రాష్ట్రాన్ని, అస్సామీస్ భాషీయుల కోసం అస్సామ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఒకేసారి మూడు ఏకభాషా రాష్ట్రాలు ఏర్పాటు అయ్యేసరికి దాని ప్రభావం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు జిల్లాల మీద బాగా పడింది. అప్పటికే గవర్నర్ జనరల్ హార్డింజి భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫారసు చేశాడు. ఈ సిఫారసు, బెంగాల్ విభజనను రద్దుచేస్తూ, జార్జి చక్రవర్తి చేసిన ప్రకటనా కలిపి భాషాప్రయుక్త రాష్ట్రాలకు మేగ్నాకార్టా వంటివని చరిత్రకారులు రాశారు. [G.V.Subbarao, History of Andhra movement, (Andhra Region) Vol:1, 1982:89]
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఇతర భాషీయులతో సమానావకాశాలు కల్పించాలనే ఆకాంక్ష నుంచి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఆవిర్భవించింది. 1895 నుంచి సైన్యంలోకి ఆంధ్రులను తీసుకోవడం మానేశారు. ఈ వివక్ష తెలుగు మాట్లాడే ముస్లిముల మీదా, క్రైస్తవుల మీదా లేదు. 1910 కంటె ముందు మద్రాసు ప్రొవిన్షియల్ మహాసభలు మద్రాసీలకు సైన్యంలో ప్రవేశం కల్పించాలని కోరుతూ ఉండేవి. 1910 తరువాత నుంచి తెలుగు పత్రికలు ఈ డిమాండ్‌ను ప్రచారం చేస్తూ వచ్చాయి. సైనిక సర్వీసుల్లోకి తెలుగు హిందువులను తీసుకోకపోవడం ఒక అవమానంగా అనిపించింది. ఈ సమయంలోనే 1910లో చిలుకూరి వీరభద్రరావు ‘ఆంధ్రుల చరిత్రము’ వచ్చింది. అది విజ్ఞాన చంద్రిక ప్రచురణ. అది ఆంధ్రుల వైభవ గతాన్ని చాటిచెప్పింది. సైనిక సర్వీసులలోనే కాకుండా విద్యా ఉద్యోగావకాశాల్లో కూడా తమిళులకు, తెలుగువారికి మధ్య ఉన్న వివక్షను ప్రశ్నించడం మొదలయింది. తెలుగువారి వికాసానికి అవసరమయిన రాజధాని నగరం లేకపోవడం ఒక లోటుగా కనిపించింది. ఆ సమయంలో జె.గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, చల్లా శేషగిరిరావు, న్యాపతి నారాయణరావు, చట్టి నరసింగరావు, జి.సీతారామశాస్త్రి, ఎన్.వి.ఎన్. నరసింహారావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మొదలయిన వారు తెలుగువారి వెనుకబాటుతనం గురించి, దాని నివారణ గురించి విరివిగా పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ నేపథ్యంలో 1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. (ఈ సభకు తెలంగాణ నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారని ఆంధ్రపత్రిక వారపత్రిక రాసింది.) అప్పటికి ఆంధ్రపత్రిక ఇంకా ఆంధ్రదేశానికి రాలేదు. కానీ కృష్ణాపత్రిక రంగంలో ఉన్నది. అది కాక, బొంబాయి నుంచి వచ్చే ఆంధ్రపత్రిక వారపత్రిక, బొంబాయి నుంచి వచ్చే శశిలేఖ, స్వదేశీ మిత్రన్, హిందూ నేషన్, ఇండియన్ పేట్రియాట్, గుంటూరు నుంచి వెలువడే దర్బార్, తెనాలి నుంచి వచ్చే ధర్మ ప్రకాశిక, వెంకటేశ పత్రిక, రాజమండ్రి నుంచి వచ్చే దేశమాత, ఆంధ్రకేసరి, ఇంకా ఆంధ్రవాణి, భరత మాత, రవి, హితకారిణి వంటి అనేక పత్రికలు ఆంధ్రోద్యమం ఆవిర్భావానికి కారణమయ్యాయి. దోహదం చేశాయి. ఇందుకు భిన్నంగా హైదరాబాద్ రాజ్య ఆంధ్రోద్యమం ఆవిర్భవించినప్పుడు తెలంగాణ నుంచి తెలుగు పత్రిక ఒక్కటి కూడా లేదని, ఇంగ్లీషు, ఉర్దూ పత్రికల్లో కూడా ఇటువంటి జాతీయ భావాలను సమర్థించే పత్రికలు లేవని తరువాతి అధ్యాయాల్లో గమనించవచ్చు.
అంతకు ముందే 1907–08లో బందరులో నిజాం రాజ్యానికీ, కోస్తా ఆంధ్ర ప్రాంతానికీ చెందిన తెలుగువారి సంయుక్త సమావేశం జరిగింది. 1912 మే నెలలో నిడదవోలులో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల రాజకీయ, సంస్కరణలు జరిపినపుడు గుంటూరు జిల్లా కార్యదర్శిగా హాజరయిన ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కానీ అది నెగ్గలేదు. ఆ సందర్భంలోనే తెలంగాణ కూడా చేరిన విశాలాంధ్రపటాన్ని జొన్నవిత్తుల గురునాథం అనే ఆయనతో కలసి ఉన్నవ రూపొందించాడు.
రెండో ఆంధ్ర మహాసభ బెజవాడలో 1914 మేలో జరిగింది. ఆ సంవత్సరమే ఆంధ్ర పత్రిక మద్రాసు తరలివచ్చింది. మూడో ఆంధ్ర మహాసభ 1915లో విశాఖపట్టణంలో జరిగింది. నాలుగో మహాసభ కాకినాడలో 1916లో జరిగింది. అయిదవది 1917లో నెల్లూరులో, ఆరవ మహాసభ 1918లో కడపలో జరిగాయి. 1917లో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. 1919లో అనంతపురంలో ఏడవ మహాసభ, 1920లో ఎనిమిదో మహాసభ జరిగాయి. మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ నివేదిక విషయంపై ప్రత్యేకాంధ్ర కాంగ్రెస్ మహాసభ 1918లో గుంటూరులో జరిగింది. 1919లో గాంధీ మద్రాసు వచ్చారు. రౌలట్ సత్యాగ్రహంలో పాల్గొనమని టంగుటూరి ప్రకాశాన్ని కోరగా, ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 1916 నుంచి ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని మహాసభ ఆమోదిస్తూనే ఉంది. 1919 నుంచి దేశంలో రాజకీయ ఉద్యమం వేగం పుంజుకోవడం, 1921లో గాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం కావడంతో ఆంధ్రమహాసభ ఆంధ్ర గ్రంథాలయోద్యమాలు ప్రాముఖ్యాన్ని కోల్పోయాయి.
ఈ మధ్య కాలంలో ఆంధ్రోద్యమంలో బ్రాహ్మణ, బ్రాహ్మణేతర తగాదాలు ఎన్నో జరిగాయి. 1915లో విజయవాడలో జరిగిన రెండో ఆంధ్ర మహాసభకు కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం కూడా హాజరయ్యారు. ఆంధ్ర మహాసభలు తమ తీర్మానాల్లో సంఘసంస్కరణాంశాలు కూడా చేర్చుకునేవి. 1915లో బెజవాడ రామమోహన ధర్మ గ్రంథాలయ వార్షికోత్సవంలో రాయప్రోలు సుబ్బారావు ‘ఆంధ్రాభిమాన పూరితమైన పద్యములను రచించి మనోజ్ఞము’ గా చదివారు. ఈ సభకు హైదరాబాద్ రాజ్యానికి చెందిన పింగిలి వేంకట్రామా రెడ్డి అధ్యక్షులుగా వచ్చారు. ఈ సభ నాటికే రాయప్రోలు సుబ్బారావు ‘స్నేహలత’ వెలువడింది. 1911లో కొండా వెంకటప్పయ్య ‘ఆంధ్రోద్యమము’, 1913లో భోగరాజు పట్టాభిరామయ్య, కోపల్లె హనుమంతరావు కలసి ‘ఆంధ్రరాష్ట్రము’ అన్న గ్రంథాలు రాశారు.
హైదరాబాద్, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రతినిధులతో 1906లో ఏర్పడిన విజ్ఞానచంద్రికా మండలికి అనుబంధంగా 1912లో విజ్ఞాన చంద్రికా పరిషత్తు అనే సంస్థను పెట్టి పరీక్షలు నిర్వహించారు. దీనికి గుంటూరు, బందరు, బెజవాడ, నరసాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, హైదరాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు నెలకొల్పారు. ఈ పరిషత్తు పరీక్షాధికారులుగా కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగారెడ్డి, వనప్పాకం శ్రీనివాసాచార్యులు మొదలైన ఉద్ధండులు వ్యవహరించారు. 1915 నుంచి కొమర్రాజు వేంకటలక్ష్మణరావు విజ్ఞానసర్వస్వము ప్రాజెక్టు ప్రారంభమైంది. అది అ, ఆ ల దగ్గరే ఆగిపోయినా 2000 పేజీలకు పైగా పుస్తక రూపంలో వెలువడింది. ఇంతలో కొమర్రాజు లక్ష్మణారావు 1923లో మరణించారు. ఆ తరువాత అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో కొంతకాలం విజ్ఞానచంద్రిక కొనసాగింది. మునగాల రాజా నాయని వేంకటరంగారావు 1920 నాటికి రాజకీయాలకు దూరం అయ్యారు. లక్ష్మణరావు జీవించి ఉండగానే ఆయన విజ్ఞానచంద్రిక నుంచి తప్పుకున్నారు. 1920 గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వేంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం, అయ్యదేవర కాళేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మొదలైన వారు రాజకీయ, సంఘసంస్కార రంగంలో ఉన్నారు. అయినా అందరి మొగ్గూ రాజకీయాల మీదే ఉన్నది.
ఆంధ్రుల చరిత్రము రాసినవారు :
1923లో మరణించిందెవరు?
గాంధీ మద్రాసు వచ్చిన సంవత్సరం :
విజ్ఞాన సర్వస్వము ప్రాజెక్టు ఏ సంవత్సరంలో మొదలైంది ?
ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది?
‘ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమాలు’ ఎవరి రచన ?
ఆంధ్రోద్యమము ఎవరి రచన ?
ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది?
శశి లేఖ అనే పత్రిక ఎక్కడ నుండి వెలువడేది?
సూచన : ఈ క్రింది పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
బిసరుహపత్రలగ్న జలబిందువు చాడ్పున సంగవర్ణితో
ల్లసనమునన్ వసించితి నిలాపర! నీ మది నిట్టిదానిఁగాఁ
బొసఁగ నెఱుంగవైతి నను: బొంకగు టేర్పడియెన్ విముక్తి చొ
ప్పు సదయవృత్తి నీకు మునిపుంగవు చెప్పుట మాటలేటికిన్ ?
పద్యంలో యతి ఏయే అక్షరాలకు చెల్లుతుంది ?
పద్యంలో గల అలంకారము.
పద్యంలో గల ఛందస్సు –
‘బిసరుహ పత్ర’ మనగా –
పద్యపాదాలలోని ఆఖరి గణము :
పద్యపాదంలోని రెండవ గణము :
మాతృభాష ఆధారిత బహుభాషావాదం దీన్ని ప్రచోదిస్తుంది –
వాచక అవగాహన వ్యూహాల గురించి ఈ క్రింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి.
పిల్లలు వస్తువులు, సంఘటనలు, దృగ్విషయాలు లాంటి వాళ్ల చుట్టూ ఉన్న వాటిని గురించి అడిగేందుకు భాషను ఉపయోగించటం మొదలుపెట్టినప్పుడు, భాషకు సంబంధించిన ఈ క్రింది వాటిలో ఒకదాన్ని మిగితా వాటి కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఈ క్రింది వాటిలో మానవ భాషకు సంబంధించిన ఏ లక్షణం వల్ల మనుష్యులు తమ తక్షణ కాలం, స్థలంలో లేని వస్తువుల గురించి మాట్లాడగలుగుతారు?
ఈ క్రింది వాటిలో అవగాహనతో చదవటం అనే దానికి గుర్తుగా ఏది పరిగణించదు?
ఈ క్రింది వాటిలో ఏది ద్వితీయ భాషా బోధనకు సంబంధించిన వ్యాకరణ అనువాద పద్ధతి లక్షణం కాదు?
ఒక ఉపాధ్యాయురాలు తాను ఇచ్చిన అనుభవ ఆధారిత ప్రశ్నకు తామిచ్చిన సమాధానం గురించి ఆలోచించమని అడుగుతుంది. ఆ సమాధానం రాసినప్పుడు వాళ్లు ఎలా, ఏమి ఆలోచిస్తున్నారో ఆలోచించమనటం ఇది ఒక ఉదాహరణ–
ఈ క్రింది క్రషెన్ (Krashen) సిద్ధాంతాలలో వైగాట్ స్కీ (Vygotsky) ZPDలాగ వుంటుంది.
కమ్మిన్ (CUMMINS)పరస్పర ఆధార సిద్ధాంతం ప్రకారం, ఈ క్రింది వాటిలో ఏవి ఒకదాని మీద వేరొకటి ఆధారపడి ఉంటాయి ?
పఠన నైపుణ్యాలను అక్షరాలు, అక్షరమాల ద్వారా కాక పదాలు, కథలతో మొదలు పెట్టటాన్ని ఈ క్రింది వాటిలో ఏది సమర్థించదు?
ఈ క్రింది వాటిలో భాషలు, మాండలికాల గురించి భాషా శాస్త్రపరంగా ఏది సరైనది?
వీర ఆరు నెలల పసిపాప. ఇప్పుడు తను అచ్చులు, హల్లులు కలసి స్వరీకరణం చేస్తుంది. ఈ క్రింది వాటిలో దేనిని వాడటం ద్వారా ఆమె భావ ప్రసారం చేస్తోంది.
ఏది ఉత్పాదక అక్షరమాల –
ఈ క్రింది వాటిలో ఏది భాషాసముపార్జన పరికరం చేత వివరించబడలేదు ?
ఒక భాషా సమూహంలో ‘s’ అనే అక్షరాన్ని విరుద్ధ సామాజిక–ఆర్థిక బృందాలకు చెందిన వాళ్ళు విభిన్నంగా ఉచ్ఛరించటం గమనించటం జరిగింది. ఇది ఇందుకు ఉదాహరణ –
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తెలుగులో సంస్కృతం నుండి అనువదించబడ్డ రచనలే కాక బెంగాలీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల నుండి అనువదించబడిన రచనలు కూడా ఉన్నాయి. ఒక భాష నుండి మరొక భాషలోకి అనువదించేటపుడు అనువాదకులు సామాన్యంగా రెండు పద్ధతులు అవలంబిస్తారు. ఒకటి యధాతథానువాదం, రెండు మూలానికి కొద్ది మార్పులు చేసి అనువదించడం. వీటిలో మన రచయితలు మొదటి పద్ధతిని అనుకరించారని చెప్పుకోవచ్చు. మన దేశంలో నాటికా రచనకు దారి చూపినవారు బెంగాలీ నాటకకర్తలు. వీరిలో రవీంద్రనాథ్ ఠాగూర్, హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, బంకించంద్ర ఛటర్జీ ముఖ్యులు. తెలుగు భాషలోకి ప్రప్రథమంగా బెంగాలీ ఏకాంకికలను అనువదించిన వారు వేంకట పార్వతీశ్వర కవులు. వీరు మొదట బంకించంద్రుని రచన ‘పుష్పనాటకం’ అనే పేర 1924లో అనువదించారు. తదుపరి కుందూరి ఈశ్వరదత్తు అనువదించిన రవీంద్రుని ‘కాలరథం’. మొక్కపాటి నరసింహ శాస్త్రి అనువదించిన రవీంద్రుని ‘సోమకుడు–ఋత్వికుడు’ అనేవి ప్రచురింపబడ్డాయి. తదుపరి చాలాకాలం వరకు బెంగాలీ ఏకాంకికలు అనువాదం కాలేదు. తిరిగి 1943లో డా॥ బెజవాడ గోపాలరెడ్డి రవీంద్రుని రచనలను అనువదించారు. 1951లో అవి ప్రప్రథమంగా ‘రవీంద్రుని ఆరు నాటికలు’ అనే పేర ప్రచురింపబడ్డాయి. ఈ సంపుటంలో ‘గాంధారి ఆవేదన’, ‘భాషా చందనము’, ‘సహగమనము’, ‘పతిత’, ‘నరకవాసము’, ‘కర్ణకుంతీ సంవాదము’ అనే ఆరు రూపకాలున్నాయి. వీటిలో ‘నరకవాసము’ అనే దాన్ని ‘సోమకుడు–ఋత్వికుడు’ అనే పేర మొక్కపాటి నరసింహశాస్త్రి, రెంటాల గోపాలకృష్ణ అనువదించారు. డా॥ బెజవాడ గోపాలరెడ్డి తెలుగులోకి అనువదించేటప్పుడు వంగభాషా పలుకుబడిని తెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సంభాషణల్లో భావగాంభీర్యంతో ఒప్పే పదజాలాన్ని ప్రయోగించారు. శ్రీనివాస చక్రవర్తి కూడా 1961లో రవీంద్రుని ఒకానొక ఏకాంకికను ‘నందిని’ పేర అనువదించారు. మొత్తం మీద బెంగాలీ నుండి రవీంద్రుని ఏకాంకికలే ఎక్కువగా అనువదించబడ్డాయని చెప్పవచ్చు.
బెంగాలీ తరువాత దక్షిణ భాషా పుస్తక సంస్థ వారి ప్రోత్సాహంతో మన రచయితలు మలయాళ, కన్నడ, తమిళ భాషల నుండి అనువదించిన రచనల్ని గురించి చెప్పాల్సి ఉంది. ద్రావిడ భాషల్లో మొదట మలయాళ భాషలో కుట్టిపుజు కృష్ణపిళ్ళై సంకలనం చేసిన రూపకాలను తెలుగులో పుట్టపర్తి నారాయణాచార్యులు ‘తీరని బాకీ’ అనే సంపుటంగా ఆంధ్రీకరించారు. ఇందులో సి.జె.థామస్ రాసిన ‘శాలోమీ’, కుట్టి కృష్ణన్ ‘తీరని బాకీ’, తీక్కొడియన్ ‘ఏకాదశి’, చెరకాడ్ ‘బాకీ’, ఇరశ్శేరి గోవిందనాయర్ విశంకట సంబంధాలు, డిఫ్ ‘స్వప్నమేఖల’, ఎన్.కృష్ణపిళ్ళై ‘బంధాలు’, మలయట్టార్ రామకృష్ణన్ ‘తాజ్ మహల్’ అనే రూపకాలున్నాయి. వీటిలో మొదటిది, చివరిది తప్ప మిగిలిన రూపకాలన్నీ నాటికలే. ఇవి మలయాళ నాటకరంగ ప్రగతిని సూచించేందుకు తోడ్పడుతాయి. పుట్టపర్తి నారాయణాచార్యులు వీటిని యధాతథంగా అనువదించారు. వీరు కవి పండితులైనందున కొన్ని సందర్భాల్లో గ్రాంథిక భాషా పదాలు ఉపయోగించడం తప్పనిసరయింది.
తెలుగులో మలయాళ రూపక అనువాదాల తరువాత కన్నడ రూపక అనువాదాలు వచ్చాయి. 1960 ఏప్రిల్‌లో శ్రీరంగ ఎన్. కస్తూరి కన్నడ భాషలో సంపుటీకరించిన రూపకాలు ‘చెప్పుడు మాటలు’ అనే పేర తిరుమల రామచంద్ర అనువదించారు. ఈ సంపుటిలో శ్రీరంగ ‘సంపద్ధర్మం’, రాజేంద్ర ‘జాతర’, పర్వతవాణి ‘వార్షికోత్సవం’, ఎన్.కె. ‘చెప్పుడు మాటలు’, శ్రీ ఎన్. కస్తూరి ‘అతిథి మర్యాద’, ‘క్షీరసాగరం’, ‘మా ఊరికి పశ్చిమాన’ అనే రూపకాలున్నాయి. తెలుగు భాషలో వలెనే నాటిక కన్నడంలో కూడా నూతన ప్రక్రియ. కన్నడ రచనలు అనువదించేటపుడు తిరుమల రామచంద్ర శ్రీరంగ ఎన్. కస్తూరి రాసిన పీఠికను కూడా యధాతథంగా అనువదించారు. దీనివల్ల కన్నడ సాహిత్య ఏకాంకికల ఆవిర్భావం, వికాస పరిణామాలు తెలుస్తున్నవి. మొత్తం నాటికల్లో ‘సంపద్ధర్మం’ అనేది మాత్రం కొన్ని మార్పులతో రచితమైంది. సంభాషణలు మూలంలోని భావాలను వ్యక్తీకరించేవిగా ఉన్నాయి. సంభాషణల్లో పాత్రల సహజత్వం ఉట్టిపడే విధంగా రచించేందుకు తిరుమల రామచంద్ర ప్రయత్నించారు.
కన్నడ, తమిళ రచనలు దాదాపు ఏకకాలంలో తెలుగులో అనువదించబడ్డాయి. 1960 ఏప్రిల్‌లో తమిళంలో సా.సోమసుందరం సంకలనం చేసిన ప్రసిద్ధ తమిళ రూపకాలు ‘నవనాటికలు’ అనే పేర ప్రకటితమైనాయి. ఈ సంపుటిని శ్రీవాత్సవ అనువదించారు. ఇందులో ‘సౌందర్య మోహనము’, ‘కడసారి పిల్లాడు (సోమసుందర్), ధర్మపరీక్ష (వీరబాహు), రేపు తప్పదు సార్, వుదుమైపితన్, పిల్లల మనసు (వలియప్ప), ఓటమి (ఎన్. సుబ్రహ్మణ్యం), అల్లుడుగారొచ్చారు అనే రూపకాలున్నాయి.
మలయాళ, కన్నడ, తమిళ భాషల నుండే కాక హిందీ నుండి అనూదితమైన ఒకటి రెండు ఏకాంకికలు కూడా ఉన్నాయి. బి.ఎన్. సూరి బీబీ ఫాతిమా (చతురసేన శాస్త్రి), శ్రీమన్నారాయణ ఆటంబాంబు (ఖాజా అహ్మద్ అబ్బాస్) గొల్లపూడి మరుతీరావు హిందీ కథ ఆధారంగా వ్రాసిన ‘పగ’ ఇత్యాదులు. ఇటీవలి కాలంలో (1980) నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు, చంద్రగుప్త విద్యాలంకార్ సంపాదకత్వంలో ఆర్.శాంతసుందరి అనువదించిన పది హిందీ నాటికలని పుస్తకంగా ప్రచురించారు.
రవీంద్రుని ఆరు నాటికలు ఎవరు అనువదించారు ?
ప్రసిద్ధ తమిళ రూపకాలు సంకలనకర్త :
‘ఏకాదశి’ అనువాద కథకు మూల రచయిత :
‘తాజ్‌మహల్’ మలయాళ రూపకం ఎవరిది?
మలయాళ భాషా రూపకాలను సంకలనం చేసింది :
‘చెప్పుడు మాటలు’ అనువాదకులు.
బెంగాళీ ఏకాంకికలను వీరు అనువదించారు :
‘తీరని బాకీ’ ఆంధ్రీకరించిన సంపుటి ఎవరిది?
సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
రష్యన్ శాస్త్రజ్ఞులలో, శరీర ధర్మశాస్త్రంపైన విశిష్టమైన కృషి చేసిన వారిలో ఎ. ఫిలోమఫిత్‌స్కి, వి. బాసొవ్, ఎన్. మిలొస్లావ్‌స్కి, ఎస్. ఒవ్‌స్యాన్నికొవ్, ఎ. కుల్యాబ్‌కొ, ఎస్. బొత్‌కిన్ ప్రముఖులు. వీరిలో కొందరు రక్తం, రక్త ప్రసరణ గురించి, మరి కొందరు జీర్ణక్రియ ప్రవృత్తి గురించి, ఇంకొందరు శ్వాసక్రియ, నాడీ వ్యవస్థల గురించి అధ్యయనం చేసి కొత్త విషయాలు కనుగొన్నారు. ఇ.సెచెనొవ్, ఇ. పావ్‌లొవ్‌లు శరీరధర్మ శాస్త్ర ప్రగతికి విశిష్ట సేవ చేశారు.
ఇ.సెచెనొవ్ (1829–1905) రష్యన్ శరీర ధర్మశాస్త్రానికి ఆద్యులు. శరీర ధర్మశాస్త్రం లోని అనేక విభాగాలలో ఆయన అత్యద్భుతమైన పరిశోధనలు చేసి కొత్త విషయాలను కనుగొన్నారు. కేంద్ర నాడీ వ్యవస్థలోని ప్రావరోధాలను గురించి తెలుసుకున్న తొలి మేధావి ఆయనే. రక్తంలోని భిన్న వాయువుల సమ్మేళనాన్ని గురించి అధ్యయనం చేసిన తొలి మేధావీ ఆయనే! కర్బనద్వియామ్లజని, మొదలైన వాటిని రవాణా చేసే హిమోగ్లోబిన్ పాత్రనూ, ప్రాముఖ్యతనూ వివరించిందీ ఆయనే! సెచెనొవ్ రచించిన ‘మెదడు యొక్క ప్రతీకార చర్యలు’ (ది రిఫ్లెక్సెస్ ఆఫ్ ది బ్రెయిన్) శరీరధర్మశాస్త్ర విజ్ఞానానికి ఎంతగానో ప్రోది చేసింది. ఈ గ్రంథం 1863లో ప్రచురింపబడింది. సెరిబ్రల్ (మెదడులో పై భాగం) చైతన్యమంతా ప్రతీకార చర్యలేనని, అందుచేత మానవ మస్తిష్కంలోకి ఆలోచనా విధానాలన్నీ శరీర ధర్మానుగుణంగానే వుంటాయనీ, మనం తెలుసుకోలేని (అతని శక్తి) కారణాలేమీ లేవనీ తెలియజేసిన తొలి రచన అది. జీవి బాహ్య పరిసరాల ఏకోన్ముఖత గురించి తెలియచేసిన తొలి మేధావుల్లో సెచెనొవ్ ఒకడు. ఆయన ఇలా వ్రాశారు : “బాహ్య పరిసరావరణం లేకుండా, మనుగడ సాగించే జీవి అసలు ఆలోచనకందదు. అందుచేత శాస్త్రీయంగా జీవిని నిర్వచించాలంటే పరిసరావరణాన్నీ, పరిస్థితుల్నీ పరిగణించాలి.”
సెచెనొవ్ నేతృత్వంలో శరీరధర్మశాస్త్ర నిపుణుల అధ్యయన కేంద్రం వెలిసింది. ఎన్.వ్వెదెన్‌స్కి, ఎమ్.షత్యొర్నికొవ్, మరికొందరు ప్రసిద్ధ శరీరధర్మశాస్త్రజ్ఞులు ఆయన విద్యార్థులే.
ఇ.పావ్‌లొవ్ (1849–1936) 60 సంవత్సరాల జీవితాన్ని శరీరధర్మశాస్త్ర పరిశోధనల కోసం వెచ్చించిన మహనీయుడు, భౌతికవాది. వైద్యానికి, జీవశాస్త్రానికి గణనీయమైన సేవ చేశాడు.
పావ్‌లొవ్ యింకా యువకుడుగా వున్న కాలంలో అతడి దృక్పథాన్ని విప్లవ ప్రజాస్వామ్య వాదులైన ఎన్. చెర్ని షెవ్‌స్కీ ఎన్. దొబ్రొల్యుబోవ్, డి. సిసరెవ్‌లు ప్రభావితం చేశారు. సెచెనొవ్ గ్రంథాలు, ముఖ్యంగా ‘రిఫ్లెక్సెస్ ఆఫ్ ది బ్రెయిన్’, ఆయనను ప్రభావితం చేయటమే కాక, జీవశాస్త్ర అవగాహనము ప్రసాదించాయి.
సెచెనొవ్ లాగే పావ్‌లొవ్ కూడా జీవిని మొత్తంగానూ, అది పరిసరాలతో తాదాత్మ్యం చెందటాన్నీ ముఖ్యంగా గుర్తించి తన పరిశోధనలు కొనసాగించాడు. ఈ ప్రాతిపదికపైన వివిధ అవయవాల పని తీరును ఆయన పరిశీలించాడు. ఆ పరిశీలనలో అవయవాన్ని దేనికి దాన్నిగా కాక మిగితా శరీరావయాలన్నింటితోనూ దానికున్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకునీ, జీవి యొక్క బాహ్య పరిసరావరణాన్ని దృష్టిలో పెట్టుకునీ పరిశీలించాడు. పావ్‌లొవ్‌కి ముందు శరీరధర్మశాస్త్రజ్ఞులు శాస్త్ర పరిశోధనలకు విశ్లేషణాత్మకమైన పద్ధతులనే అనుసరించే వారు. జంతువులపై తరుణ ప్రయోగాల ఆధారంగా పరిశీలన జరిగేది. అంటే శస్త్ర చికిత్స చేసి, అవయవాన్ని వెంటనే పరిశీలించే వారు. తరుణ ప్రయోగాలకు ఒక ఉదాహరణ: ఒక ప్రాణి గుండె ఎలా పని చేస్తున్నదో తెలుసుకునేందుకు దాని ఛాతీని కోసి చూడటం.
జీవి యొక్క ఏకోన్ముఖ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పావ్‌లొవ్ ఒక సంయోజనాత్మకమైన పద్ధతిని రూపొందించాడు. ఆయన దీర్ఘకాలిక ప్రయోగాలు చేస్తూ పరిశీలనలను కొనసాగించాడు. జంతువులపై జరిపే శస్త్రచికిత్సలను కాలక్రమేణా అమలు పరుస్తూ వాటిని కొన్ని నెలల పాటు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాలుగా పరిశీలించే వాడు. అంతకాలమూ జంతువు ప్రాణంతోనే ఉండేది.
శరీర ధర్మశాస్త్రంలోని వివిధ విభాగాలకు సంబంధించి పావ్‌లొవ్ అతి ముఖ్యమైన ఆవిష్కరణలని ఎన్నో చేశాడు. రక్త ప్రసరణ, జీర్ణక్రియ, సెరిబ్రల్ అర్ధ గోళాలకు సంబంధించి పావ్‌లొవ్ అతిముఖ్యమైన పరిశోధనలు చేశాడు. రక్త ప్రసరణ వ్యవస్థపై ఆయన చేసిన పరిశోధన గుండె – రక్త ప్రసరణ వ్యవస్థల నియంత్రణ సిద్ధాంతానికి మార్గదర్శకమైంది.
ఇరవై సంవత్సరాలు నిర్విరామంగా జీర్ణాశయాది అవయవాలపై ఆయన చేసిన పరిశోధన శరీర ధర్మశాస్త్రంలో జీర్ణక్రియ సిద్ధాంతంగా రూపొందింది.
జీర్ణవ్యవస్థ అవయవాల పనులన్నీ నాడీ వ్యవస్థ అదుపులోనే జరుగుతాయనీ, బాహ్య పరిసరావరణం లోని అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయనీ ఆయన ధృవపరిచాడు.
పావ్‌లొవ్ పరిశీలనలు సెచెనొవ్ అభిప్రాయాలను అత్యద్భుతంగా ధ్రువీకరించాయి. ప్రాణి యొక్క చేష్టల ప్రతివర్తన చర్య స్వభావం గురించి మొదట చెప్పింది సెచెనొవ్. దానినే పావ్‌లొవ్ పరిశోధనలు ధృవీకరించాయి. బాహ్య పరిసరావరణంలోని ప్రేరణలను నాడీ వ్యవస్థ అందుకుని, సంబంధిత అవయవాల కార్యనిర్వహణలో మార్పుల్ని తెస్తుంది. బాహ్య ప్రేరణలు నాడీ వ్యవస్థ ద్వారా వెళ్లి సృష్టించే ప్రతిస్పందనలనే ‘రిఫ్లెక్సెస్’ అంటారు. అవే ప్రతీకార చర్యలనీ, ప్రతివర్తనలనీ పిలవబడుతున్నాయి.
సెరిబ్రల్ కార్ టెక్స్ యొక్క విధులను గురించిన పావ్‌లొవ్ పరిశోధనకు విశిష్ట ప్రాముఖ్యత వున్నది. మానవుడి మేధో చైతన్యము సెరిబ్రల్ కార్ టెక్స్‌తో జరిగే శారీరక ధర్మాలననుసరించి వుంటాయని ఆయన పరిశోధనలు చూపించాయి. సెచెనొవ్, పావ్‌లొవ్‌లకు ముందు మానసిక (మేధో) చైతన్యం ఎలాంటిదో తెలియదు. అది తెలుసుకోలేనిది అని కూడా అనుకునే వారు. నియంత్రిత ప్రతీకార చర్యలే సెరిబ్రల్ కార్ టెక్స్ చైతన్యానికి కారణమని పావ్‌లొవ్ రుజువు చేశాకే, మన మానసిక చైతన్యానికి కారణభూతమైన సెరిబ్రల్ కార్ టెక్స్ ధర్మాలను అధ్యయనం చేసే అవకాశం కలిగింది.
కేంద్ర నాడీ వ్యవస్థ చైతన్య సిద్ధాంతాన్ని పావ్‌లొవ్ రూపొందించాడు. అత్యంత భౌతికమూ, ప్రయోజనాత్మకమూ అయిన ఈ సిద్ధాంతం, “ఆత్మ”ను గురించిన మతపరమైన ఊహాత్మక భావాల్ని వమ్ము చేసింది. అలాగే మానవులు తెలుసుకోలేరనే “ఆత్మగతి కర్మ”ను కూడా తిరస్కరించింది.
హిమోగ్లోబిన్ పాత్ర ప్రాముఖ్యాన్ని వివరించింది.
మెదడు యొక్క ప్రతీకార చర్యలు ప్రచురింపబడిన సంవత్సరం :
కేంద్రనాడీ వ్యవస్థ చైతన్య సిద్ధాంత రూపకర్త.
‘రిఫ్లెక్స్ ఆఫ్ ది బ్రెయిన్’ గ్రంథకర్త.
శరీర ధర్మ శాస్త్ర ప్రగతికి విశిష్ట సేవ చేసినవారు :
సెరిబ్రల్ కార్టెక్స్ విధులను గురించి పరిశోధన చేసింది :
జీవి బాహ్యపరిసరాల ఏకోన్ముఖత గురించి తెలియపరిచినది.
మూల్యాంకనం గురించి ఈ క్రింది వాటిలో ఏది సరి కాదు?
అభ్యసనలో ఖాళీలను చూసేందుకు తప్పుల విశ్లేషణ అవసరం. ఎందుకంటే –
ఈ క్రింది వాటిలో ఏది స్టిఫెన్ క్రాషన్ మానిటర్ సిద్ధాంతానికి సంబంధించి వాస్తవం కాదు?
రూపొందుతున్న మూల్యాంకనానికి ఈ క్రింది వాటిలో ఏది ఉదాహరణ కాదు?
ఒక ప్రారంభ పాఠ్యకుడు వాచన విషయం, సాంస్కృతిక అంశాలు మొదలయిన వాటికి సంబంధించి ఒక వాచకపు అర్థం కోసం తన సాధారణ జ్ఞానాన్ని వాడటాన్ని ఏమంటారు?
ఈ క్రింది వాటిలో ఏది వాచక అవగాహనలో పదజాల అభివృద్ధిలో వ్యవహరించదు ?
రెండు ప్రధాన మూల్యాంకనాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది ?
ఈ క్రింది వాటిలో ఏది కలుపుకుపోయే తరగతి గది సృష్టించటంలో సహాయకారి కాదు?
ఈ క్రింది లక్షణం ఉన్న పిల్లలలో ‘p’ ని ‘b’ గా, 6ను 9గా చదవటం సాధారణంగా జరిగే తప్పు –
ప్రాథమిక పరస్పర భావప్రసార నైపుణ్యాలను ఇలా అంటారు.
హిందీ మాట్లాడే వాళ్లకు ద్వితీయ భాషగా ఇంగ్లీషును బోధిస్తున్న ఉపాధ్యాయురాలు విద్యార్థులకు స్పష్టంగా నియమాలు చెప్పకుండా చిన్న చిన్న ఇంగ్లీషు సంభాషణలు చేసే అవకాశం కల్పిస్తుంది. ఆమె ఉదాహరణలిస్తే వాళ్లు తమ సంభాషణల్లో వాడతారు. క్రమంగా ఉపాధ్యాయురాలి సహాయంతో తమకు తాముగా సూత్రాలతో ముందుకు వస్తారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయురాలు అనుసరిస్తున్న పద్ధతి ఏది?
భావ ప్రసార పద్ధతికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది లక్షణం కాదు?
బహుళ భాషావాదాన్ని బహుళ సంస్కృతీవాదాన్ని ప్రచారం చేయటానికి అత్యంత ప్రాసంగికత కలిగిన కథలు ఏ ప్రక్రియకు సంబంధించినవి?
పిల్లల సాహిత్యానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది కోరుకోదగినది కాదు?
ఏది ఉన్నతస్థాయి అభ్యసన రంగం కాదు?