జీవి బాహ్యపరిసరాల ఏకోన్ముఖత గురించి తెలియపరిచినది.
- (1) వి.బాసొవ్
- (2) ఎ.కుల్యాబ్కొ
- (3) సెచెనొవ్
- (4) ఎస్. బొత్కిన్
సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
రష్యన్ శాస్త్రజ్ఞులలో, శరీర ధర్మశాస్త్రంపైన విశిష్టమైన కృషి చేసిన వారిలో ఎ. ఫిలోమఫిత్స్కి, వి. బాసొవ్, ఎన్. మిలొస్లావ్స్కి, ఎస్. ఒవ్స్యాన్నికొవ్, ఎ. కుల్యాబ్కొ, ఎస్. బొత్కిన్ ప్రముఖులు. వీరిలో కొందరు రక్తం, రక్త ప్రసరణ గురించి, మరి కొందరు జీర్ణక్రియ ప్రవృత్తి గురించి, ఇంకొందరు శ్వాసక్రియ, నాడీ వ్యవస్థల గురించి అధ్యయనం చేసి కొత్త విషయాలు కనుగొన్నారు. ఇ.సెచెనొవ్, ఇ. పావ్లొవ్లు శరీరధర్మ శాస్త్ర ప్రగతికి విశిష్ట సేవ చేశారు.
ఇ.సెచెనొవ్ (1829–1905) రష్యన్ శరీర ధర్మశాస్త్రానికి ఆద్యులు. శరీర ధర్మశాస్త్రం లోని అనేక విభాగాలలో ఆయన అత్యద్భుతమైన పరిశోధనలు చేసి కొత్త విషయాలను కనుగొన్నారు. కేంద్ర నాడీ వ్యవస్థలోని ప్రావరోధాలను గురించి తెలుసుకున్న తొలి మేధావి ఆయనే. రక్తంలోని భిన్న వాయువుల సమ్మేళనాన్ని గురించి అధ్యయనం చేసిన తొలి మేధావీ ఆయనే! కర్బనద్వియామ్లజని, మొదలైన వాటిని రవాణా చేసే హిమోగ్లోబిన్ పాత్రనూ, ప్రాముఖ్యతనూ వివరించిందీ ఆయనే! సెచెనొవ్ రచించిన ‘మెదడు యొక్క ప్రతీకార చర్యలు’ (ది రిఫ్లెక్సెస్ ఆఫ్ ది బ్రెయిన్) శరీరధర్మశాస్త్ర విజ్ఞానానికి ఎంతగానో ప్రోది చేసింది. ఈ గ్రంథం 1863లో ప్రచురింపబడింది. సెరిబ్రల్ (మెదడులో పై భాగం) చైతన్యమంతా ప్రతీకార చర్యలేనని, అందుచేత మానవ మస్తిష్కంలోకి ఆలోచనా విధానాలన్నీ శరీర ధర్మానుగుణంగానే వుంటాయనీ, మనం తెలుసుకోలేని (అతని శక్తి) కారణాలేమీ లేవనీ తెలియజేసిన తొలి రచన అది. జీవి బాహ్య పరిసరాల ఏకోన్ముఖత గురించి తెలియచేసిన తొలి మేధావుల్లో సెచెనొవ్ ఒకడు. ఆయన ఇలా వ్రాశారు : “బాహ్య పరిసరావరణం లేకుండా, మనుగడ సాగించే జీవి అసలు ఆలోచనకందదు. అందుచేత శాస్త్రీయంగా జీవిని నిర్వచించాలంటే పరిసరావరణాన్నీ, పరిస్థితుల్నీ పరిగణించాలి.”
సెచెనొవ్ నేతృత్వంలో శరీరధర్మశాస్త్ర నిపుణుల అధ్యయన కేంద్రం వెలిసింది. ఎన్.వ్వెదెన్స్కి, ఎమ్.షత్యొర్నికొవ్, మరికొందరు ప్రసిద్ధ శరీరధర్మశాస్త్రజ్ఞులు ఆయన విద్యార్థులే.
ఇ.పావ్లొవ్ (1849–1936) 60 సంవత్సరాల జీవితాన్ని శరీరధర్మశాస్త్ర పరిశోధనల కోసం వెచ్చించిన మహనీయుడు, భౌతికవాది. వైద్యానికి, జీవశాస్త్రానికి గణనీయమైన సేవ చేశాడు.
పావ్లొవ్ యింకా యువకుడుగా వున్న కాలంలో అతడి దృక్పథాన్ని విప్లవ ప్రజాస్వామ్య వాదులైన ఎన్. చెర్ని షెవ్స్కీ ఎన్. దొబ్రొల్యుబోవ్, డి. సిసరెవ్లు ప్రభావితం చేశారు. సెచెనొవ్ గ్రంథాలు, ముఖ్యంగా ‘రిఫ్లెక్సెస్ ఆఫ్ ది బ్రెయిన్’, ఆయనను ప్రభావితం చేయటమే కాక, జీవశాస్త్ర అవగాహనము ప్రసాదించాయి.
సెచెనొవ్ లాగే పావ్లొవ్ కూడా జీవిని మొత్తంగానూ, అది పరిసరాలతో తాదాత్మ్యం చెందటాన్నీ ముఖ్యంగా గుర్తించి తన పరిశోధనలు కొనసాగించాడు. ఈ ప్రాతిపదికపైన వివిధ అవయవాల పని తీరును ఆయన పరిశీలించాడు. ఆ పరిశీలనలో అవయవాన్ని దేనికి దాన్నిగా కాక మిగితా శరీరావయాలన్నింటితోనూ దానికున్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకునీ, జీవి యొక్క బాహ్య పరిసరావరణాన్ని దృష్టిలో పెట్టుకునీ పరిశీలించాడు. పావ్లొవ్కి ముందు శరీరధర్మశాస్త్రజ్ఞులు శాస్త్ర పరిశోధనలకు విశ్లేషణాత్మకమైన పద్ధతులనే అనుసరించే వారు. జంతువులపై తరుణ ప్రయోగాల ఆధారంగా పరిశీలన జరిగేది. అంటే శస్త్ర చికిత్స చేసి, అవయవాన్ని వెంటనే పరిశీలించే వారు. తరుణ ప్రయోగాలకు ఒక ఉదాహరణ: ఒక ప్రాణి గుండె ఎలా పని చేస్తున్నదో తెలుసుకునేందుకు దాని ఛాతీని కోసి చూడటం.
జీవి యొక్క ఏకోన్ముఖ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పావ్లొవ్ ఒక సంయోజనాత్మకమైన పద్ధతిని రూపొందించాడు. ఆయన దీర్ఘకాలిక ప్రయోగాలు చేస్తూ పరిశీలనలను కొనసాగించాడు. జంతువులపై జరిపే శస్త్రచికిత్సలను కాలక్రమేణా అమలు పరుస్తూ వాటిని కొన్ని నెలల పాటు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాలుగా పరిశీలించే వాడు. అంతకాలమూ జంతువు ప్రాణంతోనే ఉండేది.
శరీర ధర్మశాస్త్రంలోని వివిధ విభాగాలకు సంబంధించి పావ్లొవ్ అతి ముఖ్యమైన ఆవిష్కరణలని ఎన్నో చేశాడు. రక్త ప్రసరణ, జీర్ణక్రియ, సెరిబ్రల్ అర్ధ గోళాలకు సంబంధించి పావ్లొవ్ అతిముఖ్యమైన పరిశోధనలు చేశాడు. రక్త ప్రసరణ వ్యవస్థపై ఆయన చేసిన పరిశోధన గుండె – రక్త ప్రసరణ వ్యవస్థల నియంత్రణ సిద్ధాంతానికి మార్గదర్శకమైంది.
ఇరవై సంవత్సరాలు నిర్విరామంగా జీర్ణాశయాది అవయవాలపై ఆయన చేసిన పరిశోధన శరీర ధర్మశాస్త్రంలో జీర్ణక్రియ సిద్ధాంతంగా రూపొందింది.
జీర్ణవ్యవస్థ అవయవాల పనులన్నీ నాడీ వ్యవస్థ అదుపులోనే జరుగుతాయనీ, బాహ్య పరిసరావరణం లోని అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయనీ ఆయన ధృవపరిచాడు.
పావ్లొవ్ పరిశీలనలు సెచెనొవ్ అభిప్రాయాలను అత్యద్భుతంగా ధ్రువీకరించాయి. ప్రాణి యొక్క చేష్టల ప్రతివర్తన చర్య స్వభావం గురించి మొదట చెప్పింది సెచెనొవ్. దానినే పావ్లొవ్ పరిశోధనలు ధృవీకరించాయి. బాహ్య పరిసరావరణంలోని ప్రేరణలను నాడీ వ్యవస్థ అందుకుని, సంబంధిత అవయవాల కార్యనిర్వహణలో మార్పుల్ని తెస్తుంది. బాహ్య ప్రేరణలు నాడీ వ్యవస్థ ద్వారా వెళ్లి సృష్టించే ప్రతిస్పందనలనే ‘రిఫ్లెక్సెస్’ అంటారు. అవే ప్రతీకార చర్యలనీ, ప్రతివర్తనలనీ పిలవబడుతున్నాయి.
సెరిబ్రల్ కార్ టెక్స్ యొక్క విధులను గురించిన పావ్లొవ్ పరిశోధనకు విశిష్ట ప్రాముఖ్యత వున్నది. మానవుడి మేధో చైతన్యము సెరిబ్రల్ కార్ టెక్స్తో జరిగే శారీరక ధర్మాలననుసరించి వుంటాయని ఆయన పరిశోధనలు చూపించాయి. సెచెనొవ్, పావ్లొవ్లకు ముందు మానసిక (మేధో) చైతన్యం ఎలాంటిదో తెలియదు. అది తెలుసుకోలేనిది అని కూడా అనుకునే వారు. నియంత్రిత ప్రతీకార చర్యలే సెరిబ్రల్ కార్ టెక్స్ చైతన్యానికి కారణమని పావ్లొవ్ రుజువు చేశాకే, మన మానసిక చైతన్యానికి కారణభూతమైన సెరిబ్రల్ కార్ టెక్స్ ధర్మాలను అధ్యయనం చేసే అవకాశం కలిగింది.
కేంద్ర నాడీ వ్యవస్థ చైతన్య సిద్ధాంతాన్ని పావ్లొవ్ రూపొందించాడు. అత్యంత భౌతికమూ, ప్రయోజనాత్మకమూ అయిన ఈ సిద్ధాంతం, “ఆత్మ”ను గురించిన మతపరమైన ఊహాత్మక భావాల్ని వమ్ము చేసింది. అలాగే మానవులు తెలుసుకోలేరనే “ఆత్మగతి కర్మ”ను కూడా తిరస్కరించింది.
జీవి బాహ్యపరిసరాల ఏకోన్ముఖత గురించి తెలియపరిచినది.
CBSE answer: (3)
జవాబు: (3) సెచెనొవ్
జాగ్రత్త: పావ్లొవ్ ఈ భావనను తరువాత అనుసరించాడు; ముందు చెప్పింది సెచెనొవ్.