By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 14 Dec 2024 Paper 1 Telugu, Question 146

Topic: Pedagogy of language

Q146

హిందీ మాట్లాడే వాళ్లకు ద్వితీయ భాషగా ఇంగ్లీషును బోధిస్తున్న ఉపాధ్యాయురాలు విద్యార్థులకు స్పష్టంగా నియమాలు చెప్పకుండా చిన్న చిన్న ఇంగ్లీషు సంభాషణలు చేసే అవకాశం కల్పిస్తుంది. ఆమె ఉదాహరణలిస్తే వాళ్లు తమ సంభాషణల్లో వాడతారు. క్రమంగా ఉపాధ్యాయురాలి సహాయంతో తమకు తాముగా సూత్రాలతో ముందుకు వస్తారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయురాలు అనుసరిస్తున్న పద్ధతి ఏది?

  1. (1) భావప్రసార పద్ధతిCorrect answer
  2. (2) ప్రత్యక్ష పద్ధతి
  3. (3) వ్యాకరణ అనువాద పద్ధతి
  4. (4) ఆడియో లింగ్వల్ పద్ధతి

Solution.

CBSE answer: (1)

జవాబు: (1) భావప్రసార పద్ధతి

  1. ఉపాధ్యాయురాలు సూత్రాలు చెప్పకుండా సందర్భాలు, చిన్న సంభాషణలకు అవకాశాలు ఇస్తోంది.
  2. పిల్లలు ఉదాహరణలు వాడుతూ, ఉపాధ్యాయురాలి సహాయంతో సూత్రాలను తామే కనుగొంటున్నారు.
  3. అర్థవంతమైన సంభాషణ, సూత్రాల ఆవిష్కరణ భావప్రసార పద్ధతి లక్షణాలు.

జాగ్రత్త: ప్రత్యక్ష పద్ధతి కూడా అనువాదం లేకుండా జరుగుతుంది, కానీ అది సందర్భ సంభాషణ కంటే ఉపాధ్యాయుడి ప్రదర్శన, పునరావృతంపై ఆధారపడుతుంది.