By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 14 Dec 2024 Paper 2 Telugu Language Question Paper with Answer Key

You are reading the question paper with answers. This is not the timed test: no clock is running and nothing is being scored.

Go to the timed test →

Passage

సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
విద్వాన్ విశ్వంగా ప్రసిద్ధులైన విశ్వరూపశాస్త్రి 1915 అక్టోబరులో 21వ తేదీన అనంతపురం జిల్లాలోని తరిమెలలో జన్మించాడు. తల్లి లక్ష్మమ్మ తండ్రి మీసరగండముని రామాచార్యులు. ‘మీసరగండ’ బిరుదు నామం. వీరి పూర్వీకులకు విజయనగర రాజులిచ్చినది. రామాచార్యులు సంప్రదాయ కుటుంబీకుడు. విద్యావేత్త, సంఘ సంస్కర్త. రాజకీయాల్లో ప్రవేశం ఉంది. విశ్వం పైన తండ్రి ప్రభావం ఉంది. తండ్రి మూడో ఏట మరణించాక గోవిందమ్మ, ఈశ్వరమ్మల దగ్గర పెరిగాడు. రామాయణం శంకరశాస్త్రి వద్ద సంస్కృతాంధ్ర సాహిత్యాలు, కర్నూలులోని శ్రీమాన్ వేంకటాచార్యుల వద్ద వ్యాకరణం, ధన్నవాడ రాఘవాచార్యుల వద్ద తర్కం నేర్చుకొన్నాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో చిలుకూరి నారాయణరావు వద్ద తర్ఫీదు పొంది ‘విద్వాన్’ పట్టా పుచ్చుకొన్నాక విశ్వరూపశాస్త్రి ‘విద్వాన్ విశ్వం’ కావడంతో ఆ పేరే స్థిరపడింది. విద్వాన్ ముగించాక బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృత సాహిత్యంలో పరిశోధన చేయదలిచాడు. కానీ తీవ్రంగా జబ్బుపడి పరిశోధన కొనసాగించలేకపోయినా, ఆ ఆలోచనను పక్కకు పెట్టలేదు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని అనారోగ్య కారణాల వల్ల వదిలివేసినా తరువాతి కాలంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి నేతృత్వంలో పరిశోధన ముగించాడు.
విశ్వం రచనలు స్వీయ రచనలు, అనువాదాలు, వ్యాసాలు, అవీ–ఇవీ అన్నీ శత సంఖ్యను దాటి ఉంటాయి. 1935లో ‘విరికన్నె’, 1938లో ‘పాపం’, 1940–45 ప్రాంతంలో వ్రాసిన కవితలు ‘రాతలు–గీతలు’ కాగా 1950లో ‘నా హృదయం’, 1955లో ‘పెన్నేటి పాట’, 1965లో ‘ఒకనాడు’ మొదలైనవి స్వీయర చనలు ప్రసిద్ధాలు. విశ్వం అనువాదాలు చేశాడు. వేదాలలోని ఋక్కులను అనువదించాడు. అధర్వణ వేదాన్ని ‘శ్రీనివాస బాలశిక్ష’గా అనువదించాడు. 22,000 శ్లోకాలతో ‘కథా సరిత్సాగరాన్ని’ ‘రాజతరంగిణి’ని అనువదించాడు. సంస్కృతానువాదాలలో ‘శిశుపాల వధ’ పద్యకావ్యాలు ‘దశకుమార చరిత్ర’, ‘కాదంబరి’ గద్య కావ్యాలు ప్రసిద్ధాలు. హాలుని గాధాసప్తశతి నుండి కొన్ని శ్లోకాలను అనువదించాడు.
సంస్కృతానువాదాలే కాకుండా ఆంగ్లానువాదాలు కూడా ఉన్నాయి. నవలలో జాన్ స్టీవెన్ వ్రాసిన Moon is down ‘దురాక్రమణ’ పేరుతో రోమారోలా (Jarcistove) జాక్రిస్టోవ్ – ‘మానవుడు’ పేరుతోనూ, తర్లిసేవ్ First Love ‘ప్రథమ ప్రేమ’ గానూ అనువదించాడు. హెన్రీ ఇబ్సన్ Enemity of the people ‘ప్రజా విరోధి’గానూ బెర్నాడ్ షా రచన Who he lied to her husband ‘అబద్ధాలు’ గానూ చేసిన అనువాదాలు పాశ్చాత్యులుగా కనబడుతున్నాయి.
విశ్వం భారతదేశంలోని పలు భాషలలో ప్రసిద్ధి పొందిన రచనలను కూడా అనువదించాడు. హిందీలోని రసభావి, కబీరు, రహీం, మీరా, తులసీదాసు, బీహార్ లాల్, ఇక్బాల్ రచనలను, బెంగాలీలో రవీంద్రనాథ్ ఠాగూర్, రజనీ ప్రాణదత్, చండీదాస్ రచనలను, గుజరాతీలో అభాభగత్, దయారామ్, సోమసుందర్, నర్మదలాల్, గోరఖ్‌నాథ, ప్రేమ్‌చంద్ రచనలను అనువదించాడు. తమిళంలో తిరువళ్ళువర్, నమ్మాల్వార్, తిరుజ్ఞాన సంబందర్, అండాళ్ రచనలను, కన్నడంలో సర్వజ్ఞుని ‘త్రిపదులు’ అనువదించాడు. విశ్వం అనువాదాలను గమనిస్తే ఎన్ని భాషలలో ప్రవేశం ఉందో తెలుస్తుంది.
ఉద్యోగ జీవితానికి వస్తే విశ్వం అనేక వార, దినపత్రికలలో పనిచేశాడు. 1938లో స్థాపించబడ్డ ‘నవసాహిత్యమాల’లో ఎడిటర్‌గా, పబ్లిషర్‌గా చేరాడు. 1934–35లో ‘నవ్యసాహిత్య పరిషత్తు’లో సభ్యుడయ్యాడు. నవ్యసాహిత్య పరిషత్తులో అప్పటికే ప్రసిద్ధులైన కవులు, రచయితలు ఉండేవాళ్ళు. 1936–37 మధ్యలో ‘భారతి’ పత్రికకు సమీక్షకుడిగా ఉండేవాడు. హైదరాబాద్ నుండి వెలువడే ‘మీజాన్’ పత్రికకు విలేఖరిగా 1945లో చేరాడు. తరువాత ‘ప్రజాశక్తి’ దినపత్రికలో చేరాడు. 1948 వరకూ కొనసాగాడు. పత్రికా ఆఫీసు విజయవాడలో ఉండేది. 1948లో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. 1949 తరువాత విశ్వం మద్రాసుకు తరలి వెళ్లాడు.‘ప్రోగ్రెసివ్ రైటర్స్’ సంస్థకు కార్యనిర్వాహక సంపాదకుడుగా ఉన్నాడు. ‘బాలభారతి’ విద్యాలయానికి కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా ఉండి బాలల మనస్తత్వం పట్ల పరిశోధన చేయడమే కాకుండా ఇటలీ దేశస్థురాలైన మేడమ్ మాంటిసోరీ రచనలను ఎన్నిటినో అనువదించాడు. రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా ఉన్నాడు. 1951లో ‘ఇంటింటి విజ్ఞానమాల’ను ప్రారంభించి దానికి ప్రథమ సంపాదకులుగా ఉండి ఎన్నో రచనలను ముద్రించారు. 1959లో స్థాపింపబడ్డ ఆంధ్రప్రభ వారపత్రికకు సంపాదకునిగా ఉండి అది తాత్కాలికంగా తొలగింపబడేదాకా పని చేశాడు. విశ్వం 1960–62లలో ఆంధ్రజ్యోతిలోనూ, 1963లో ఆంధ్రప్రభ దినపత్రికలోనూ పని చేశాడు. ఆంధ్రప్రభ వారపత్రికలో 1967 నుండి పని చేసిన తరువాత సంపాదకుడై 1986లో రిటైరయ్యాడు.
విశ్వం ఎడిటర్‌గా, పబ్లిషర్‌గా, జర్నలిస్ట్‌గా, వ్యాసరచయితగా బహుముఖాలతో రచనలు వెలువరిస్తూ వచ్చాడు. భారతిలో సాహితీ రచనలు ప్రచురింపబడ్డాయి. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకుడిగా ఉన్నప్పుడు ‘తెలుపు–నలుపు’, ‘అవి–ఇవి’, ‘మాణిక్యవీణ’ మొదలైన శీర్షికలతో వ్యాసాలు వ్రాసేవాడు. ఆంధ్రజ్యోతిలో ‘నా కథ’ పేరుతో కొన్ని వారాలు విశ్వం స్వయంగా తెలిపిన జీవిత విశేషాలు ప్రచురింపబడుతూ ఉండి 1987లో విశ్వం మరణించడంతో ఆగిపోయింది.
విశ్వం సాహిత్య స్రష్టే కాకుండా రాజకీయ రంగంలో కూడా నిష్ణాతులు. కవిగా, సాహితీవేత్తగా ఉంటూ రాజకీయ రంగంలో కూడా నిలబడగలగడం సాధ్యమైన విషయం కాదు. దీన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి విశ్వం. కాంగ్రెసు పార్టీ అభివృద్ధి కోసం 1937లో తీవ్రంగా కృషి చేశాడు. అనంతపురం జిల్లా కాంగ్రెసు కమిటీకి 1938లో కార్యదర్శిగా పని చేశాడు. దశాబ్ది కాలం పాటు కార్యదర్శిగా ఉన్నాడు. ‘ఆంధ్రమహాసభ’కు కొన్ని రోజులు కార్యదర్శిగా పనిచేశాడు. 1939–40లో ‘ఆకాశవాణి’ ప్రచురించాడు. 1935–45 ఆకాశవాణి పత్రికను బ్రిటిషు దురాగతాలకు వ్యతిరేకంగా నడిపి జైలు పాలయ్యాడు.

Q91

ఆంధ్రప్రభ వారపత్రిక స్థాపించబడిన సంవత్సరం :

  1. (1) 1959
  2. (2) 1945
  3. (3) 1948
  4. (4) 1949
See answer and solution
Q92

ఈ క్రిందివారిలో బెంగాలీ రచయిత కానివారు :

  1. (1) రజనీ ప్రాణదత్
  2. (2) రవీంద్రనాథ్ ఠాగూర్
  3. (3) గోరఖ్ నాథ్
  4. (4) చండీదాస్
See answer and solution
Q93

‘ప్రజా విరోధి’ ఎవరి రచన ?

  1. (1) బెర్నార్డ్ షా
  2. (2) తర్లినేవ్
  3. (3) రోమారోలా
  4. (4) జాన్ స్టీవెన్
See answer and solution
Q94

ఈ క్రింది వారిలో గుజరాతీ భాషా రచయిత :

  1. (1) చండీదాస్
  2. (2) దయారామ్
  3. (3) రజనీ ప్రాణదత్
  4. (4) బీహార్ లాల్
See answer and solution
Q95

ప్రజాశక్తి పత్రిక నిషేధించబడిన సంవత్సరం :

  1. (1) 1948
  2. (2) 1938
  3. (3) 1934–35
  4. (4) 1936–37
See answer and solution
Q96

పెన్నేటి పాట వెలువడిన సంవత్సరం :

  1. (1) 1965
  2. (2) 1950
  3. (3) 1955
  4. (4) 1915
See answer and solution
Q97

ఇంటింటి విజ్ఞానమాలను ప్రారంభించినవారు :

  1. (1) సోమసుందర్
  2. (2) వేటూరి ప్రభాకర శాస్త్రి
  3. (3) విద్వాన్ విశ్వం
  4. (4) నర్మదలాల్
See answer and solution
Q98

విశ్వం పరిశోధనకు నేతృత్వం ఎవరిది?

  1. (1) ధన్నవాడ రాఘవాచార్యులు
  2. (2) రామాయణం శంకరశాస్త్రి
  3. (3) శ్రీమాన్ వేంకటాచార్యులు
  4. (4) శ్రీవేటూరి ప్రభాకర శాస్త్రి
See answer and solution
Q99

‘జాక్రిస్టోవ్’ మూలగ్రంథకర్త :

  1. (1) బెర్నార్డ్ షా
  2. (2) జాన్ స్టీవెన్
  3. (3) తర్లినేవ్
  4. (4) రోమారోలా
See answer and solution

Passage

సూచన : ఈ క్రింది పద్యభాగమును చదివి 100 నుండి 105 ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
క్రూరుఁడు ధార్తరాష్ట్రుఁ డతికుత్సితుఁ; డెంతయుఁ బాపబుద్ధి గాం
ధారుఁడు పెక్కుమాయలకుఁ దావల; మక్కట! యద్దురాత్మకుల్
వారక యెద్దియేని యొకవంచనమై యిటు సేసిరొక్కొ! యె
వ్వారలు నాత్మ నమ్ముదురె వక్రవిచారులఁ బాపకర్ములన్.

Q100

పద్యంలోని ఛందస్సు :

  1. (1) మత్తేభము
  2. (2) చంపకమాల
  3. (3) ఉత్పలమాల
  4. (4) శార్దూలము
See answer and solution
Q101

పద్యం ప్రకారం గాంధార రాజపుత్రుడెవరు?

  1. (1) దుశ్శాసనుడు
  2. (2) శకుని
  3. (3) దుర్యోధనుడు
  4. (4) గాంధారి కొడుకు
See answer and solution
Q102

పద్యంలో యతి ఏయే అక్షరాలకు చెల్లుతుంది ?

  1. (1) 1–14 అక్షరాలు
  2. (2) 1–10 అక్షరాలు
  3. (3) 1–11 అక్షరాలు
  4. (4) 1–13 అక్షరాలు
See answer and solution
Q103

ధారుడు లోని గణము :

  1. (1) తగణము
  2. (2) భగణము
  3. (3) సగణము
  4. (4) యగణము
See answer and solution
Q104

పద్యంలోని అలంకారం :

  1. (1) పూర్ణోపము
  2. (2) ఉపమ
  3. (3) రూపకము
  4. (4) అర్థాంతరన్యాసము
See answer and solution
Q105

దురాత్మలోని సంధి :

  1. (1) గుణ సంధి
  2. (2) యణదేశ సంధి
  3. (3) సవర్ణదీర్ఘ సంధి
  4. (4) వృద్ధి సంధి
See answer and solution
Q106

విషయాల ప్రామాణికత దీన్ని సూచిస్తుంది –

  1. (1) విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చే సమాచారం
  2. (2) తన తరగతి కోసం ఉపాధ్యాయరాలు రూపొందించిన సమాచారం
  3. (3) అధికారంలో ఉన్నవాళ్ళు రాసిన అభివృద్ధి చేసిన సమాచారం
  4. (4) యధార్థ జీవితం నుంచి రాసిన, అభివృద్ధి చేసిన సమాచారం
See answer and solution
Q107

అపర్ణ అనే ఒక 5వ తరగతి విద్యార్థి శ్రవణం అంటే ఒక ఉపన్యాసం లేక ఆడియోను అర్థం చేసుకోవాలంటే అందులోని ప్రతి శబ్దాన్ని, పదాన్ని, వాక్యాలను వినటం అని గ్రహిస్తుంది. ఈ శ్రవణ నైపుణ్యానికి ఆమె నమ్ముతున్న వ్యూహం :

  1. (1) పైనుంచి క్రిందకు కాదు, క్రింద నుంచి పైకి కాదు
  2. (2) పైనుంచి క్రిందకు పద్ధతి
  3. (3) క్రింద నుంచి పైకి పద్ధతి
  4. (4) పైనుంచి క్రిందకు, క్రింద నుంచి పైకి రెండు పద్ధతులు
See answer and solution
Q108

భాషను అభ్యసించటంలో క్రమబద్ధ సామర్థ్యం అంటే ఏమిటి?

  1. (1) మనుష్యులందరికీ అనేక భాషల వ్యవస్థలు ఉన్నాయని అర్థం చేసుకోవటం
  2. (2) భాష ఒక వ్యవస్థ పని చేస్తుందని అర్థం చేసుకోవటం అనువర్తింపజేయటం
  3. (3) భాషకు వ్యాకరణ వ్యవస్థ ఉందని అర్థం చేసుకోవటం అనువర్తింపజేయటం
  4. (4) అన్ని భాషలకు నిర్మాణ వ్యవస్థ ఉంటుందని అర్థం చేసుకోవటం
See answer and solution
Q109

ఈ క్రింద కొన్ని వాక్యాలు లేక ఒక వాచకం ఇవ్వబడింది. అది ఏ భాషా ‘రిజిష్టర్’ను ఈ వాచకం తెలియజేస్తుంది?
భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తిని సమానంగా గుర్తిస్తుంది. దీనర్థం దేశంలోని ప్రతి వ్యక్తి, పురుషులు, స్త్రీలు, అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, తెగల వాళ్ళు, విద్య, ఆర్థిక నేపథ్యాల వాళ్ళు సమానం. దీనర్థం అసమానత్వం అంతరించిపోయిందని కాదు. అది పోలేదు. అయితే, కనీసం ప్రజాస్వామిక భారతదేశంలో అందరి వ్యక్తుల సమానత్వం గుర్తించబడింది.

  1. (1) సైన్స్ రిజిష్టరు
  2. (2) రాజకీయ రిజిష్టరు
  3. (3) సామాజిక శాస్త్ర రిజిష్టరు
  4. (4) న్యాయ రిజిష్టరు
See answer and solution
Q110

ఒక ఆరవ తరగతి ఉపాధ్యాయురాలు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని, అనుభవాన్ని వాళ్ళు చదవబోయే పుస్తకంతో కలిపేందుకు ఒక ఉత్తేజితం చేసే కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. తన విద్యార్థులకు చదువుతున్న పుస్తకం (కథ) లోని చిత్రాలను తను దాన్ని బోధించటానికి ముందే చూడమని అడుగుతుంది. ఈ సందర్భంలో ఆమె తన విద్యార్థులు ఏమి చేయాలనుకుంటుంది?

  1. (1) వాళ్ళు బొమ్మల్ని అర్థం చేసుకునేటట్లు చేయటం
  2. (2) కథను బొమ్మల ద్వారా దృశీకరించుకోవటం
  3. (3) బొమ్మలను అభినందించటం
  4. (4) చదువున్న పుస్తకం గురించి వూహించి చెప్పటం
See answer and solution
Q111

అభ్యాసకుల అభ్యాసం గురించిన ఉదాహరణ క్రమానుగతమైన రికార్డును ఇలా పిలుస్తారు –

  1. (1) డయాగ్నస్టిక్ పరీక్ష
  2. (2) పోర్ట్‌ఫోలియో
  3. (3) నిరంతర సమగ్ర మూల్యాంకనం
  4. (4) కౌశల మూల్యాంకనం
See answer and solution
Q112

ఈ క్రింది వాటిలో ఏవి స్వీకృత నైపుణ్యాలుగా పిలువబడుతాయి?

  1. (1) శ్రవణ మరియు పఠన
  2. (2) శ్రవణ మరియు లేఖన
  3. (3) పఠన మరియు భాషణ
  4. (4) భాషణ మరియు లేఖన
See answer and solution
Q113

విదేశాలకు వెళ్ళే చాలామంది భారతీయులు అక్కడి భాషను నేర్చుకుంటారు. ఈ ప్రేరణను ఏమంటారు ?

  1. (1) అది సమైక్యాత్మకం కానీ పరికరాత్మకం కానీ కాదు
  2. (2) సమైక్యాత్మక, పరికరాత్మక ప్రేరణ రెండూ
  3. (3) సమైక్యాత్మక ప్రేరణ
  4. (4) పరికరాత్మక ప్రేరణ
See answer and solution
Q114

ఈ క్రింది వాటిలో ఏది ప్రాచీన భాష కాదు?

  1. (1) హిందీ
  2. (2) తమిళం
  3. (3) సంస్కృతం
  4. (4) తెలుగు
See answer and solution
Q115

విదేశీ భాషల అధ్యయనం గురించి ఈ క్రింది వాటిలో ఏది నూతన జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం వాస్తవం కాదు?

  1. (1) ఫ్రెంచ్ భాష అనేది అదనపు ఐచ్ఛికాంశంగా చదవబడే భాషగా చెప్పబడినది.
  2. (2) రెండవ దశలో అదనపు ఐచ్ఛికంగా విదేశీ భాషలు చదవటం.
  3. (3) విదేశీ భాషలను అధ్యయనం చేయటం త్రిభాషా సూత్రంలో ఒక అంశంగా కలపబడింది.
  4. (4) విదేశీ భాషలను అధ్యయనం చేయటం త్రిభాషా సూత్రం క్రింద చదివే భాషలలో కలపబడలేదు.
See answer and solution
Q116

ఈ క్రింది వాటిలో ‘భాష గురించి తెలుసుకోవటా’ని సూచిస్తుంది.

  1. (1) వ్యూహాత్మక సామర్థ్యం
  2. (2) ప్రకటనాత్మక జ్ఞానం
  3. (3) నిబంధనలకు సంబంధించిన జ్ఞానం
  4. (4) వ్యాకరణ జ్ఞానం
See answer and solution
Q117

ఒక ఆరవ తరగతి విద్యార్థి ఉపాధ్యాయురాలు ఒక భాషణ కార్యకలాపం కోసం ఈ క్రింది కార్యకలాపాల్ని రూపొందిస్తుంది.
‘ఎడారి గురించి దాని వాతావరణ స్థితుల గురించి ఐదు వాక్యాలు మాట్లాడు’.
అది మంచి కార్యకలాపమా? కాదా ? అందుకు తగిన అంశాన్ని ఈ క్రింది వాటి నుంచి ఎన్నిక చేయండి.

  1. (1) అది మంచి కార్యకలాపం కాదు, ఎందుకంటే దానికి సందర్భం లేదు. ఎడారి గురించి, దాని స్థితి గురించి మాట్లాడే విషయం లేదు.
  2. (2) అది మంచి కార్యకలాపం ఎందుకంటే విద్యార్థులు దాన్ని గురించి తమ భూగోళ శాస్త్రంలో చదివివుంటారు, అందువల్ల దాన్ని గురించిన సమాచారం వాళ్ళ దగ్గర వుంటుంది.
  3. (3) అది మంచి కార్యకలాపం, ఎందుకంటే దాని వల్ల విద్యార్థులు మాట్లాడుతారు, ఈ సందర్భంలో ఎడారి గురించి.
  4. (4) అది మంచి కార్యకలాపం కాదు, ఎందుకంటే కొంతమంది విద్యార్థులకు ఎడారి గురించి తెలవకపోవచ్చు.
See answer and solution
Q118

ఒక భాషకు సంబంధించిన మాండలికం గురించి ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన వాస్తవం?

  1. (1) కొన్ని సందర్భాలలో విభిన్న సామాజిక బృందాలు ఒకే భాషకు సంబంధించిన విభిన్న మాండలికాలను మాట్లాడవచ్చు.
  2. (2) భాష మాండలికాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతాయి.
  3. (3) ఒక మాండలికంలో మాట్లాడే వ్యక్తి ఇతర మాండలికంలో మాట్లాడే వ్యక్తిని అర్థం చేసుకోగలడు.
  4. (4) ఒక మాండలికం అనే పెద్ద వర్గీకరణ భాష చిన్న వర్గీకరణ.
See answer and solution
Q119

ఈ క్రింది వాటిలో ఏ కార్యకలాపం సమైక్య అభ్యసన నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది ?

  1. (1) వ్యాసం రాయటం
  2. (2) పాత్ర పోషణ (రోల్ ప్లే)
  3. (3) అసైన్‌మెంట్
  4. (4) ప్రాజెక్ట్ వర్క్
See answer and solution
Q120

వ్యాకరణ బోధన సందర్భంలో ఈ క్రింది వ్యూహాన్ని ఏమంటారు?
సందర్భాలలో భాష అంశం పరిచయం చేయటం, అభ్యాసకులు భాషకు సంబంధించిన అంశాలను అభ్యాసకులు గమనించేటట్లు చేయటం, యధార్థ జీవన సందర్భాలలో వాళ్ళు వాటిని ఉపయోగించేటట్లు చేయటం, అభ్యాసకుడి దృష్టి తాను కనిపెట్టటం ద్వారా రూపం వైపుకు తీసుకురావటం.

  1. (1) చైతన్యాన్ని పెంచటం
  2. (2) ఒక సిద్ధాంతం సృష్టించటం
  3. (3) నిగమ పద్ధతి
  4. (4) కనుగొనే పద్ధతులు
See answer and solution

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రపంచంలో అనేక దేశాలు ప్రతి ఏటా అంతర్జాతీయ పురస్కారాలను ప్రకటిస్తూనే ఉంటాయి. వీటన్నింటిలోకీ, అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదీ, ఆర్థికంగా కూడా పరిపుష్టమైందీ నోబెల్ బహుమతి. రాజకీయాలకు, సామాజిక, సాంస్కృతిక సరిహద్దులకు అతీతంగా, ఎంపిక చేసిన కొన్ని రంగాలలో, విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇంజనీరు, కెమిస్టు, ‘డైనమెట్’ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్, స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో 1833లో జన్మించాడు. ఆయన పేరు మీద ఏర్పాటైన వార్షిక పురస్కారమే నోబెల్.
ఆల్ఫ్రెడ్ తండ్రి ఇమ్మాన్యుయెల్ కూడా పేరు మోసిన ఇంజినీరే. పుట్టిన ఎనిమిది మంది సంతానంలో ఆల్ఫ్రెడ్, మరో ముగ్గురు సోదరులు మాత్రమే మిగిలారు. బాల్యంలో ఆల్ఫ్రెడ్ కూడా పలు సార్లు అనారోగ్యంతో బాధపడ్డాడు. శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి ఉన్న ఈ కుర్రాడు తండ్రి వద్దే ఇంజనీరింగ్‌లో తొలి పాఠాలు నేర్చుకున్నాడు, కాని చదువు కొనసాగలేదు. వ్యాపారంలో నష్టం రావటంతో ఇమ్మాన్యుయెల్ 1837లో, కుటుంబాన్ని స్వీడన్‌లోనే వదిలి, సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా) వెళ్లి గనులలో వుపయోగించే పేలుడు పదార్థాలూ, మెషీన్ పరికరాల ఉత్పత్తి ప్రారంభించాడు. అనతికాలంలో బాగా లాభాలు వచ్చాయి. భార్యాపిల్లల్ని రష్యాకు పిలిపించుకున్నాడు. ప్రైవేటు ట్యూటర్ల వద్ద ఆల్ఫ్రెడ్ విద్యాభ్యాసం కొనసాగింది (ఇది చాలా ఖరీదైన వ్యవహారం!). పదహారు సంవత్సరాలకే మంచి కెమిస్టుగా గుర్తింపు వచ్చింది. ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్, రష్యన్‌లలో ప్రావీణ్యం సంపాదించాడు.
1850లో, పారిస్ కెళ్ళి, ఏడాది పాటు కెమిస్ట్రీలో వున్నత విద్యనభ్యసించి, అమెరికాలో నౌకలు నిర్మించే జాన్ ఎరిక్‌సన్ వద్ద నాలుగేళ్లు సహాయకుడిగా పని చేశాడు. ఆ తర్వాత, సెయింట్ పీటర్స్‌బర్గ్ తిరిగివచ్చి, తండ్రి ఫ్యాక్టరీలో, క్రిమియన్ యుద్ధానికి అవసరమైన ఆయుధ సామగ్రి ఉత్పత్తిలో సహాయం చేశాడు. కాని యుద్ధం తర్వాత, ఆయుధాలకు గిరాకీ తగ్గి, ఫ్యాక్టరీ మూతపడింది.
అప్పటికీ, వాడుకలో ఉన్న ఒకే ఒక పేలుడు పదార్థం బ్లాక్ పౌడర్ (ఇది ఒక రకమైన గన్ పౌడర్). సంయోగ క్రియల ద్వారా కొత్త పదార్థాల కోసం ప్రయోగాలు ప్రారంభించాడు ఆల్‌ఫ్రెడ్. నైట్రోగ్లిసరిన్ గురించి తెలుసుగాని దానికి జ్వలనశక్తి చాలా ఎక్కువ. ముట్టుకుంటేనే పేలుతుందని అందరి భయం. సమకాలీన శాస్త్రజ్ఞులు, కెమిస్టులు ఆశ్చర్యపడేలా నైట్రోగ్లిసరిన్ ఉత్పత్తి కోసం ఫ్యాక్టరీ నెలకొల్పాడు ఆల్ఫ్రెడ్. 1863లో తొలి డిటోనేటర్‌ను రూపొందించాడు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఆవిష్కర్తగా ఆయనకు పేరు రావటానికి, అపారమైన సంపాదనకూ మూలం యిదే. 1864లో సాంకేతికంగా దీన్ని మరింత మెరుగుపరిచాడు. అయితే, నైట్రోగ్లిసరిన్ విధ్వంసక శక్తి ఈయన్నూ వదిలిపెట్టలేదు. 1865లో ఫ్యాక్టరీ పేలిపోయింది. ఆ ప్రమాదంలో ఒక సోదరుడు మరణించాడు. విస్తృత అధ్యయనం, పలు ప్రయోగాల తర్వాత, అందుబాటులోకి వచ్చిన ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో, కొత్త ‘మోడల్’ను తయారుచేసి ఈ సారి దీనికి ‘డైనమెట్’ అని పేరు కూడ పెట్టాడు. (గ్రీకు భాషలో Dynamics అంటే శక్తి), ఇంగ్లండు, అమెరికాలో దీనికి పేటెంట్లు సంపాదించాడు. సొరంగాలు తవ్వటానికి, కాలువలు తీయటానికి, రైలు మార్గాలు, రోడ్లు నిర్మించటానికి దీన్ని విరివిగా వాడటంతో అనతికాలంలోనే ఆల్ఫ్రెడ్ అపర కుబేరుడయ్యాడు.
1893లో, స్వీడన్‌లోని ఆయుధ పరిశ్రమ పట్ల దృష్టి సారించిన ఆల్ఫ్రెడ్, ‘బోఫోర్స్’లోని ఇనుప కర్మాగారాలను కొనుగోలు చేశాడు. బోఫోర్స్ ఆయుధ కర్మాగారానికి తొలి దశ యిది. పేలుడు పదార్థాలు మాత్రమే గాక, కృత్రిమ సిల్కు, చర్మం వగైరాల గురించి చేసిన ప్రయోగాలలో కూడా విజయం సాధించాడు ఆల్ఫ్రెడ్. మరణించే నాటికి తన పేరు మీద మూడు వందల యాభైకి పైగా పేటెంట్లు రిజిష్టర్ చేయించుకున్నాడు. అవివాహితుడిగానే జీవితం గడిపిన ఆల్ఫ్రెడ్, పలు నాటకాలు, నవలలు, కవితలు కూడా రాశాడుగానీ ప్రచురించలేదు. ఆల్‌ఫ్రెడ్ ఎప్పుడూ ఒకచోట నివసించలేదు. ఐరోపా – అమెరికా ఖండాలలో ఎక్కువగా ప్రయాణాలతోనే కాలం గడిచేది. తనను తాను శాంతికాముకుడిననే భావించాడు ఆల్‌ఫ్రెడ్. తన చివరి వీలునామా మీద నవంబర్ 27, 1895 నాడు పారిస్‌లో సంతకం పెట్టాడు. ఆయన మరణాంతరం (10 డిసెంబర్, 1896) వెలుగులోకొచ్చిన ఆ వీలునామా అందర్నీ కలవరపర్చింది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంచుమించు తన ఆస్తినంతా ఒక బహుమతి ఏర్పాటు చెయ్యటానికే వినియోగించాలన్నది దాని సారాంశం.
అన్ని బహుమతుల్లాగే, నోబెల్ కూడా, వివాదాలకు అతీతమైనదేమీ కాదు. పలుసార్లు, అర్హులకు రాలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉదాహరణకు : సాహిత్యంలో లియో టాల్‌స్టాయ్, ఆంటన్ చెహోవ్, హైన్రిక్ ఇబ్సెన్, థామస్ హార్డీ, జోసెఫ్ కోన్రాడ్, మార్క్‌ట్వేన్, మాక్సింగోర్కీ, జేమ్స్ జాయస్, మార్సెల్ ప్రూస్ట్, వర్జినియా వూల్ఫ్, హెచ్.జి. వెల్స్, సామర్సెట్ మాంలు నోబెల్ బహుమతికి అనర్హులనుకున్నారు స్టాక్‌హోం అకాడెమీ జడ్జీలు.

Q121

ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరి వద్ద నౌకా నిర్మాణ సహాయకుడిగా పని చేశాడు.

  1. (1) హెచ్.జి. వెల్స్
  2. (2) జోసెఫ్ కోన్రాడ్
  3. (3) వర్జినియా వూల్ఫ్
  4. (4) జాన్ ఎరిక్‌సన్
See answer and solution
Q122

ఆల్ఫ్రెడ్ తండ్రి :

  1. (1) ఇమ్మాన్యుయెల్
  2. (2) జాన్ ఎరిక్‌సన్
  3. (3) ఆంటన్ చెహోవ్
  4. (4) మార్సెల్ ప్రూస్ట్
See answer and solution
Q123

డిటోనేటర్ రూపొందించిన సంవత్సరం :

  1. (1) 1896
  2. (2) 1863
  3. (3) 1833
  4. (4) 1837
See answer and solution
Q124

ఆల్ఫ్రెడ్ నిర్మించిన ఫ్యాక్టరీ పేలిపోయిన సంవత్సరం :

  1. (1) 1837
  2. (2) 1865
  3. (3) 1863
  4. (4) 1893
See answer and solution
Q125

ఆల్ఫ్రెడ్ వీలునామా వెలుగులోకి వచ్చిన సంవత్సరం :

  1. (1) 1883
  2. (2) 1837
  3. (3) నవంబర్ 27,1895
  4. (4) 10 డిసెంబర్, 1896
See answer and solution
Q126

ఆల్ఫ్రెడ్ నోబెల్ జన్మించింది :

  1. (1) 1893
  2. (2) 1837
  3. (3) 1850
  4. (4) 1833
See answer and solution
Q127

ఆల్ఫ్రెడ్ చివరి వీలునామాపై సంతకం ఎక్కడ చేశాడు ?

  1. (1) పారిస్
  2. (2) రష్యా
  3. (3) అమెరికా
  4. (4) స్వీడన్
See answer and solution
Q128

పేలుడు పదార్థాలూ, మెషీన్ పరికరాల ఉత్పత్తి మొదలుపెట్టిందెవరు?

  1. (1) జేమ్స్ జాయిస్
  2. (2) ఇమ్మాన్యుయేల్
  3. (3) జాన్ ఎరిక్‌సన్
  4. (4) ఆల్ఫ్రెడ్ నోబెల్
See answer and solution

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
నిజాం టిప్పు సుల్తాన్‌తో చేతులు కలుపుతాడేమోనని ఇంగ్లీషు వారు భయపడ్డారు. ఎందుకంటే 1795లో మరాఠాలు హైదరాబాద్ మీద దాడి చేసి, విపరీతమైన నష్టాన్ని కలిగించి కొంత భూభాగాన్ని ఆక్రమించినప్పుడు గత ఒడంబడిక ప్రకారం సహాయం చేయవలసిన ఇంగ్లీషు వారు మాట తప్పారు. అందువల్ల ఫ్రెంచి సైనిక నిపుణుడు మోనసేర్ రేమండ్ శిక్షణలో రూపుదిద్దుకుంటున్న తన సొంత బలగం మీదనే నిజాం ఆధారపడడం ప్రారంభించాడు. (ఈ మోనసేర్ రేమండ్ పేరుతో హైదరాబాద్‌లో మూసారాం బాగ్ ఏర్పడింది. అక్కడే అతని సమాధి ఉన్నది) అయితే, 1798లో రేమండ్ అకస్మాత్తుగా మరణించడంతో తిరిగి నిజాం ఇంగ్లీషు వారి మీద ఆధారపడవలసి వచ్చింది. ఫ్రెంచి సైనిక శిక్షిత సైన్యాన్ని రద్దు చేస్తేనే మరాఠాల దాడి నుంచి రక్షణ కల్పిస్తామని అప్పుడు వారు నిజాంకు చెప్పారు. టిప్పు సుల్తాన్‌తో జరిగిన ఆఖరి యుద్ధంలో అతను మరణించిన తరువాత ఆక్రమించుకున్న భూభాగాలలో 1799 నాటి మైసూరు ఒడంబడిక ప్రకారం నిజాంకు ఎక్కువ వాటా వచ్చింది. 1800 సంవత్సరంలో నిజాంకూ, బ్రిటిష్ వారికీ కొత్తగా మరో ఒడంబడిక కుదిరింది. దీని ప్రకారం అనుబంధ సైనిక బలగాన్ని పెంచుతారు. వాటి నిర్వహణకు గాను 1792, 1799 ఒప్పందాల ప్రకారం పొందిన టిప్పుసుల్తాన్ రాజ్యభాగాలను నిజాం బ్రిటిష్ వారికి ఇవ్వాలి. అంతేకాదు, యుద్ధ అవసరం వచ్చినప్పుడు నిజాం తన సైన్యం మొత్తాన్ని, (వ్యక్తిగత అవసరాలకు మినహాయించుకొని మిగితాది) బ్రిటిష్ వారి కోసం కేటాయించాలి. అలా 1800 నాటి ఒడంబడిక ప్రకారం రాయలసీమ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వారి హస్తగతమైంది. హైదరాబాద్ రాజ్యం సరిహద్దులు దాదాపుగా స్థిరపడిపోయాయి. 1850 తరువాత బీరారు ప్రాంతాన్ని, రాయచూర్ దో ఆబ్ జిల్లాలను నిజాం నుంచి తీసుకున్నారు కానీ, 1857 తిరుగుబాటు తరువాత రాయచూర్‌ను తిరిగి ఇచ్చేశారు. బీరారు గురించి నిజాంలు పదేపదే పోరుపెట్టగా, 20వ శతాబ్దంలో దాన్ని నామమాత్రంగా నిజాం ప్రాంతాలలో ఒకటిగా గుర్తిస్తూ, కొంత వార్షిక పరిహారాన్ని చెల్లించనారంభించారు.
1757లో ప్లాసీ యుద్ధం వరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల భారత జైత్రయాత్రలో మొదటి దశగా చెప్పవచ్చు. 1765లో క్లైవ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఢిల్లీ చక్రవర్తి నుంచి బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు ‘దివానీ’ అధికారాలను సంపాదించాడు. స్వదేశ రాజులకూ, బ్రిటిష్ వారికీ మధ్య సంబంధాలను చర్చిస్తూ వింజమూరి గోవిందరాజులు అనే రచయిత 1918లో ఇలా రాశారు. “...ఇంగ్లీషు వారీ దేశమున ప్రవేశించినది మొదలు పదునెనిమిదవ శతాబ్ద మధ్యభాగము వరకును జరిగిన కాలమును, వారికిని, స్వదేశ రాజులకును గలిగిన సంబంధముల నాలోచించునపుడు, మొదటి దశ క్రింద మనము పరిగణింపవచ్చును. ఈ యుగమారంభమున ఇంగ్లీషువారు వర్తకులుగా నున్నను, యుగాంతమగు సరికి ఇతర రాజులతో పాటు రాజులై హిందూ దేశమునందలి కొన్ని భాగములను పరిపాలన చేయుచుండిరి.....స్వదేశ రాజులకును ఇంగ్లీషు వారికిని ఏయే కాలములందెట్టి సంబంధములుండెడివో యాలోచించునప్పుడు, 1798 నుంచి 1805 వరకు నుండిన వెల్లస్లీ గారి ప్రభుత్వ కాలమును వదిలివేసితిమేని, 1757 నుంచి 1813 వరకును గల కాలము రెండవ దశగా కావచ్చును. ఈ కాలమునందింగ్లీషు వారు తామిదివర కార్జించిన రాజ్యముతో సంతుష్టులై, తమ ప్రక్కనున్న దేశము లెంత యల్లకల్లోలముగా నున్నను, ఇతర రాజులు తమ సాహాయ్యమును కోరిననను తమకు సామంత రాజులుగా నుండుట కంగీకరించినను కూడ, వారితో నెట్టి సంపర్కమును కలిగించుకొనమని శపథము పట్టిరి. వెల్లస్లీగారు మాత్రమీ పద్ధతి ప్రకారము నడచుకొనలేదు. వారితర రాజులకు సైన్య సాహాయ్యము నొనరించుట కంగీకరించి వారి వలన దాని కగు కర్చులను పుచ్చుకొనుట కారంభించిరి. ఇది రెండు విధముల ఇంగ్లీషు వారికి లాభకారిగా నుండెను. స్వదేశ రాజుల క్రింద సైన్యము లున్నపుడెల్లను, వారి సైన్యము నెవరి మీద నుపయోగింతురో యను భయముండెను. కాని, ఈ పద్ధతి వలన రాష్ట్రములను కాపాడుకొనుటకు కావలసిన సైన్యమును వారి కొరకు బ్రిటిషు వారే జాగ్రత్త పెట్టుట వలన, అప్పటి నుండియు ఈ భయము లేకుండెను. ఇది మొదటి లాభము. రెండవ లాభము బ్రిటిషు వారి యధికారము క్రిందనున్న సైన్యము హెచ్చుగుటమే. పేరునకు స్వదేశ రాజ్యముల సంరక్షణమునకై యుంచబడిన సైన్యమైనను, బ్రిటిషు వారి యధికారము క్రిందనుండుటచే నీ సైన్యము వారి యుపయోగములకు కూడ పనికివచ్చుచుండెను. కాని, దాని కగు ఖర్చు మాత్రము స్వదేశపు రాజులే భరించుచుండిరి. (స్వదేశ సంస్థానములు, హైందవ రాజ్యాంగ పరిణామము, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, 1 మే, 1918 : 18)
హైదరాబాద్ చరిత్రకు సంబంధించి 1800 నాటి సైన్య సహాయ సంధి (Treaty of Subsidiary Alliance) చాలా రాజకీయ ప్రాముఖ్యం ఉన్న పత్రం. ఈ పత్రం ద్వారా రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి దత్తం చేయడమే కాకుండా, నిజాం తన స్వతంత్ర ప్రతిపత్తిని చాలా మేరకు కోల్పోయాడు. తమతో తప్ప మరే ఇతర రాజ్యంతోనూ సంబంధాలు కానీ, చర్చలను కానీ జరపకూడదన్న షరతును విధిస్తూ, అందుకు ప్రతిగా హైదరాబాద్ ఆంతరంగిక వ్యవహారాల్లో తమ జోక్యం ఉండదని హామీ ఇస్తున్న 15వ అధికరణం ఒకటి ఉంది.(1956:7). అంతకు ముందే సర్కారు జిల్లాలను కోల్పోయిన నిజాం 1800 తరువాత వాటి మీద రావలసిన కప్పాన్ని కూడా వదులుకోవలసి వచ్చింది.
1803లో మరాఠా యుద్ధం సంభవించింది. పీష్వాలలో ఆఖరివాడైన బాజీరావును తిరిగి బ్రిటిష్ వారు అధికారానికి తెచ్చినందుకు ఆగ్రహించిన సింధియా, హోల్కర్‌లు యుద్ధానికి దిగారు. యుద్ధం జరుగుతున్న సమయంలోనే సైన్య సహాయ సంధి చేసుకున్న నిజామ్ అలీ ఖాన్ 7 ఆగస్టు 1803లో మరణించాడు. తరువాత అధికారానికి వచ్చిన సికిందర్ జాహ్ బ్రిటిష్ వారికి అంతగా అనుకూలంగా లేడు. మరాఠా యుద్ధంలో తన సొంత సైన్యంతో సహాయపడవలసిన నిజాం ఆ విషయంలో అంతగా సహకరించలేదు. ఆ సమయంలో బ్రిటిష్ వారికి అనుకూలుడయిన మీర్ ఆలం ప్రధానిగా ఉన్నాడు. ఆ తరువాత నుంచి హైదరాబాద్ రాజ్యంలో ప్రధానుల్ని తనకు అనుకూలురను నియమించుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒత్తిడి చేసింది. 1850 తరువాత అయితే, బ్రిటిష్ వారి అనుమతి లేకుండా ప్రధానమంత్రి ఎంపిక జరిగే అవకాశమే లేదు.
జాల్నా వద్ద 1803 సెప్టెంబర్ 23వ తేదీన జరిగిన ఆస్సే యుద్ధంలో వెల్లస్లీ మరాఠాలను చిత్తుగా ఓడించాడు. బాజీరావును తిరిగి ప్రతిష్టించారు. పీష్వాలకు నైజాంలోని కొన్ని ప్రాంతాలలో చౌత్ వసూలు చేసే అధికారం ఉండేది. అది 1818 వరకు కొనసాగి, 1818లో పీష్వా పతనం తరువాత బ్రిటిష్ వారికి సంక్రమించింది. 1822లో జరిగిన మరో ఒడంబడిక ప్రకారం నిజాంకు చౌత్ నుంచి విముక్తి దొరికింది.

Q129

మరాఠాలను ఓడించినవారు :

  1. (1) క్లైవ్
  2. (2) మోనసర్ రేమండ్
  3. (3) సింధియా
  4. (4) వెల్లస్లీ
See answer and solution
Q130

మరాఠా యుద్ధం జరిగిన సంవత్సరం :

  1. (1) 1850
  2. (2) 1803
  3. (3) 1818
  4. (4) 1822
See answer and solution
Q131

హైదరాబాద్ పై మరాఠాల దాడి ఏ సంవత్సరంలో జరిగింది ?

  1. (1) 1918
  2. (2) 1795
  3. (3) 1799
  4. (4) 1798
See answer and solution
Q132

చౌత్ వసూలు చేసే అధికారం ఎవరికుంది ?

  1. (1) మోనసర్ రేమండ్
  2. (2) పీష్వాలు
  3. (3) ఈస్టిండియా కంపెనీ
  4. (4) వెల్లస్లీ
See answer and solution
Q133

ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది ?

  1. (1) 1757
  2. (2) 1857
  3. (3) 1800
  4. (4) 1792
See answer and solution
Q134

రేమండ్ మరణించిన సంవత్సరం :

  1. (1) 1798
  2. (2) 1768
  3. (3) 1790
  4. (4) 1795
See answer and solution
Q135

ఫ్రెంచి సైనిక నిపుణుడు :

  1. (1) బాజీరావు
  2. (2) వెల్లస్లీ
  3. (3) క్లైవ్
  4. (4) మోనసర్ రేమండ్
See answer and solution
Q136

అశ్విన్‌కు తన పుట్టుక నుండి ఓడియా తెలుసు. తను ఇంగ్లీషు, హిందీ చదివాడు. దీనిని బట్టి ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన సరికాదో చెప్పండి.

  1. (1) అతని ఇంగ్లీషు అభ్యసనం భాషను సముపార్జించటం
  2. (2) అతని ఓడియా అభ్యసనం భాషాసముపార్జనం
  3. (3) అతని హిందీ అభ్యసనం భాష నేర్చుకోవటం
  4. (4) అతని ఇంగ్లీషు అభ్యసనం భాష నేర్చుకోవటం
See answer and solution
Q137

పరికరాత్మక ప్రేరణ ఎప్పుడు ఉంటుంది ?

  1. (1) ఒక వ్యక్తి పుస్తకం రాయటం కోసం భాష నేర్చుకుంటాడు
  2. (2) ఒక వ్యక్తి ఉద్యోగం లాగ ఒక ఉపయోగ కారణం కోసం భాషను నేర్చుకుంటాడు
  3. (3) ఒక వ్యక్తి స్థానిక ప్రజలకు దగ్గరగా ఉండేందుకు వాళ్ళ భాషను నేర్చుకుంటాడు
  4. (4) ఒక వ్యక్తి వాళ్ళ కమ్యూనిటిస్, మత, సాంఘిక పండుగల కోసం భాషను నేర్చుకుంటాడు
See answer and solution
Q138

క్రిప, కరన్ ఇద్దరూ కవలలు. వాళ్ళు మణిపురికి సంబంధించిన మాండలికంలో మాట్లాడుతారు. అయితే వాళ్ళు మాట్లాడటంలో ఇద్దరికీ తేడా ఉంటుంది. వాళ్ళు ఆ మాండలికాన్ని ప్రత్యేకంగా మాట్లాడటాన్ని ఏమంటారు?

  1. (1) మణిపురి
  2. (2) వైయక్తిక భాష (idiolect)
  3. (3) మాండలికం
  4. (4) భాషణ చర్య
See answer and solution
Q139

భారత రాజ్యాంగంలో ఇంగ్లీషు భాషకు ఇవ్వబడిన స్థాయి :

  1. (1) చట్టబద్ధ సంస్థల భాష
  2. (2) అధికార భాష
  3. (3) అనుబంధ అధికార భాష
  4. (4) విదేశీ భాష
See answer and solution
Q140

ఒక విద్యార్థి వ్యక్తిగత బలాన్ని, బలహీనతను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షను ఏమంటారు?

  1. (1) రూపొందే పరీక్ష
  2. (2) ఆబ్జెక్టివ్ పరీక్ష
  3. (3) విలువ పరీక్ష
  4. (4) డయాగ్నస్టిక్ పరీక్ష
See answer and solution
Q141

‘పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్’ గురించిన సూత్రాలు అతిథికి తెలుసు. అయితే ఆమె ఒక సందర్భంలో వాడలేదు. ఆమెకు ఉన్న జ్ఞానం :

  1. (1) జ్ఞాన అనువర్తన
  2. (2) భాషాసముపార్జన పరికరం
  3. (3) విధాన జ్ఞానం
  4. (4) ప్రకటనాత్మక జ్ఞానం
See answer and solution
Q142

భాష గురించి ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం కాదు?

  1. (1) కొన్ని భాషలు సైన్స్, ఇంజినీరింగ్ విషయాలను మాత్రమే బాగా చెప్పగలవు.
  2. (2) భాష గుర్తింపును వ్యక్తం చేస్తుంది.
  3. (3) భాష అనేది చరిత్ర యొక్క గని.
  4. (4) భాష మానవ జ్ఞానానికి దోహదం చేస్తుంది.
See answer and solution
Q143

ఒక తరగతి గదిలో ఒక ప్రాజెక్టు వర్క్ రూపకల్పనలో, చేయటంలో దశలు ఏవి?

  1. (1) ఉపాధ్యాయుడు, విద్యార్థులు తాము అన్న విధంగా ప్రాజెక్టును రూపొందించి చేయగలరు.
  2. (2) బృందాలు రూపొందించటం, ప్రణాళిక వేయటం, డేటా ప్రోగు చేయటం, డేటాను వ్యాఖ్యానించటం, ప్రతి రాయటం, శీర్షిక గుర్తించటం, రిపోర్టు ముగించటం
  3. (3) బృందాలు రూపొందించటం, శీర్షిక గుర్తించటం, ప్రణాళిక వేయటం, డేటా ప్రోగు చేయటం, డేటాను వ్యాఖ్యానించటం, ప్రతి రాయటం, రిపోర్టు ముగించటం
  4. (4) బృందాలు రూపొందించటం, శీర్షిక గుర్తించటం, ప్రణాళిక వేయటం, డేటా ప్రోగు చేయటం, డేటాను వ్యాఖ్యానించటం, రిపోర్టు ముగించటం
See answer and solution
Q144

శ్రవణానికి సంబంధించిన పైనుంచి క్రిందకు పద్ధతి దీన్ని బాగా చేస్తుంది –

  1. (1) ప్రతి శబ్దం, పదం, పదబంధాలు, నిబంధనాలు, వాక్యాలు వినటం
  2. (2) ప్రత్యేక వివరాలపై దృష్టి పెట్టడం
  3. (3) భాషణం, వాచకం, ఆడియోల సారం వినటం
  4. (4) వాచకపు, ఉపన్యాసపు, ఆడియో మొత్తం సందేశం వినటం
See answer and solution
Q145

ఒక ఉపాధ్యాయురాలు తన ఏడవ తరగతి విద్యార్థులకు ఒక వ్యక్తిని వర్ణించే లేఖన కార్యకలాపాన్ని ఇవ్వాలనుకుంది. ఆమె తరగతి బయటకు వెళ్ళి వీధుల వెంబడి తిరిగి వస్తువులు అమ్ముకునే వ్యక్తిని అతని బుట్టతో సహా తరగతి గదిలోకి తీసుకువస్తుంది. అతనిని ఒక ఏడు నిమిషాలు ఉండమని చెప్పి, ఆ తరువాత విద్యార్థుల్ని జంటలుగా ఏర్పడి ఆ వ్యక్తి గురించిన వర్ణన రాయమని అడుగుతుంది. ఈ సందర్భంలో ఆ వస్తువులు అమ్ముకునే వ్యక్తిని ఏమంటారు ?

  1. (1) వస్తువులు/సామగ్రి
  2. (2) ఉపాధ్యాయురాలి సహాయకుడు
  3. (3) వస్తువులు అమ్ముకునే వాడు
  4. (4) కార్యకలాపంలో పాల్గొనే వాడు
See answer and solution
Q146

ఒక ఉపాధ్యాయురాలు తన ఏడవ తరగతి విద్యార్థుల్ని ఒక కథ చదివి ఆ వాచకంలోని ప్రజల, కమ్యూనిటీ యొక్క అధికారం, గుర్తింపును అర్థం చేసుకోమని అడుగుతుంది. ఈ సందర్భాలలో ఆ ఉపాధ్యాయురాలు విద్యార్థులలో ఏ విషయాన్ని ప్రోత్సహిస్తోంది.

  1. (1) సాహిత్య నైపుణ్యాలు
  2. (2) భాషా అక్షరాస్యత
  3. (3) విమర్శనాత్మక అక్షరాస్యత
  4. (4) విశ్లేషణాత్మక పఠనం
See answer and solution
Q147

ప్రాచీన భాషల అధ్యయనం గురించి నూతన విద్యావిధానం 2020 చెప్పిన విషయం గురించి ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం?

  1. (1) ప్రాచీన భాషల అధ్యయనం రెండవ దశలో మౌలిక భాగంగా
  2. (2) ప్రాచీన భాషల అధ్యయనం అనేది రెండవ దశలో ఒక అదనపు ఐచ్ఛికాంశంగా
  3. (3) ప్రాచీన భాషల అధ్యయనం అనేది త్రిభాషా సూత్రంలో ఒక ఐచ్ఛికాంశంగా
  4. (4) ప్రాచీన భాషల అధ్యయనం అనేది ప్రారంభదశలో
See answer and solution
Q148

ఈ క్రింద ఒక వాచకం ఇవ్వబడింది. చదివి ఆ వాచకం ఏ భాష ‘రిజిష్టర్’కు సంబంధించినదో గుర్తించండి.
హఠాత్తుగా, విప్లవం తరువాత దీన్ని మార్చటం సాధ్యమనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల, ఐరోపా, ఆసియాలలో, కొత్త భావాలు వ్యక్తి హక్కుల గురించి, సాంఘిక అధికారాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు అనే వాటి గురించి చర్చించటం మొదలయింది. భారతదేశంలో, రాజా రామమోహన్ రాయ్, డిరోజియో ఫ్రెంచి విప్లవపు ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. వలసల్లో జరిగిన అభివృద్ధిలు, వాటి వైపు నుంచి సామాజిక మార్పు గురించిన ఈ భావాలకు తిరిగి ఆకృతినిచ్చాయి.

  1. (1) విప్లవ రిజిష్టర్
  2. (2) సైన్స్ రిజిష్టర్
  3. (3) రాజకీయ రిజిష్టర్
  4. (4) సామాజిక శాస్త్ర రిజిష్టర్
See answer and solution
Q149

సుభాష్ అనే 8వ తరగతి ఉపాధ్యాయుడు, “భాషా మూల్యాంకనం సాధారణంగా గ్రహణ నైపుణ్యాలకు ప్రాధాన్యతనివ్వదు” అని విచారిస్తాడు. అతని దృష్టిలో ‘గ్రహణ నైపుణ్యాలు’ అంటే –

  1. (1) భాషణం మరియు లేఖనం
  2. (2) వినికిడి మరియు లేఖనం
  3. (3) భాషణం మరియు పఠనం
  4. (4) శ్రవణం మరియు పఠనం
See answer and solution
Q150

భాష ఒక వ్యవస్థగా పని చేస్తుందని అభ్యాసకుడు అవగతం చేసుకుంటాడు, అనువర్తింపజేస్తాడు.

  1. (1) వ్యూహాత్మక సామర్థ్యం
  2. (2) భావప్రసార సామర్థ్యం
  3. (3) వ్యవస్థాగత సామర్థ్యం
  4. (4) సామాజిక భాషా శాస్త్ర సామర్థ్యం
See answer and solution