ఈ క్రిందివారిలో బెంగాలీ రచయిత కానివారు :
- (1) రజనీ ప్రాణదత్
- (2) రవీంద్రనాథ్ ఠాగూర్
- (3) గోరఖ్ నాథ్
- (4) చండీదాస్
సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
విద్వాన్ విశ్వంగా ప్రసిద్ధులైన విశ్వరూపశాస్త్రి 1915 అక్టోబరులో 21వ తేదీన అనంతపురం జిల్లాలోని తరిమెలలో జన్మించాడు. తల్లి లక్ష్మమ్మ తండ్రి మీసరగండముని రామాచార్యులు. ‘మీసరగండ’ బిరుదు నామం. వీరి పూర్వీకులకు విజయనగర రాజులిచ్చినది. రామాచార్యులు సంప్రదాయ కుటుంబీకుడు. విద్యావేత్త, సంఘ సంస్కర్త. రాజకీయాల్లో ప్రవేశం ఉంది. విశ్వం పైన తండ్రి ప్రభావం ఉంది. తండ్రి మూడో ఏట మరణించాక గోవిందమ్మ, ఈశ్వరమ్మల దగ్గర పెరిగాడు. రామాయణం శంకరశాస్త్రి వద్ద సంస్కృతాంధ్ర సాహిత్యాలు, కర్నూలులోని శ్రీమాన్ వేంకటాచార్యుల వద్ద వ్యాకరణం, ధన్నవాడ రాఘవాచార్యుల వద్ద తర్కం నేర్చుకొన్నాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో చిలుకూరి నారాయణరావు వద్ద తర్ఫీదు పొంది ‘విద్వాన్’ పట్టా పుచ్చుకొన్నాక విశ్వరూపశాస్త్రి ‘విద్వాన్ విశ్వం’ కావడంతో ఆ పేరే స్థిరపడింది. విద్వాన్ ముగించాక బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృత సాహిత్యంలో పరిశోధన చేయదలిచాడు. కానీ తీవ్రంగా జబ్బుపడి పరిశోధన కొనసాగించలేకపోయినా, ఆ ఆలోచనను పక్కకు పెట్టలేదు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని అనారోగ్య కారణాల వల్ల వదిలివేసినా తరువాతి కాలంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి నేతృత్వంలో పరిశోధన ముగించాడు.
విశ్వం రచనలు స్వీయ రచనలు, అనువాదాలు, వ్యాసాలు, అవీ–ఇవీ అన్నీ శత సంఖ్యను దాటి ఉంటాయి. 1935లో ‘విరికన్నె’, 1938లో ‘పాపం’, 1940–45 ప్రాంతంలో వ్రాసిన కవితలు ‘రాతలు–గీతలు’ కాగా 1950లో ‘నా హృదయం’, 1955లో ‘పెన్నేటి పాట’, 1965లో ‘ఒకనాడు’ మొదలైనవి స్వీయర చనలు ప్రసిద్ధాలు. విశ్వం అనువాదాలు చేశాడు. వేదాలలోని ఋక్కులను అనువదించాడు. అధర్వణ వేదాన్ని ‘శ్రీనివాస బాలశిక్ష’గా అనువదించాడు. 22,000 శ్లోకాలతో ‘కథా సరిత్సాగరాన్ని’ ‘రాజతరంగిణి’ని అనువదించాడు. సంస్కృతానువాదాలలో ‘శిశుపాల వధ’ పద్యకావ్యాలు ‘దశకుమార చరిత్ర’, ‘కాదంబరి’ గద్య కావ్యాలు ప్రసిద్ధాలు. హాలుని గాధాసప్తశతి నుండి కొన్ని శ్లోకాలను అనువదించాడు.
సంస్కృతానువాదాలే కాకుండా ఆంగ్లానువాదాలు కూడా ఉన్నాయి. నవలలో జాన్ స్టీవెన్ వ్రాసిన Moon is down ‘దురాక్రమణ’ పేరుతో రోమారోలా (Jarcistove) జాక్రిస్టోవ్ – ‘మానవుడు’ పేరుతోనూ, తర్లిసేవ్ First Love ‘ప్రథమ ప్రేమ’ గానూ అనువదించాడు. హెన్రీ ఇబ్సన్ Enemity of the people ‘ప్రజా విరోధి’గానూ బెర్నాడ్ షా రచన Who he lied to her husband ‘అబద్ధాలు’ గానూ చేసిన అనువాదాలు పాశ్చాత్యులుగా కనబడుతున్నాయి.
విశ్వం భారతదేశంలోని పలు భాషలలో ప్రసిద్ధి పొందిన రచనలను కూడా అనువదించాడు. హిందీలోని రసభావి, కబీరు, రహీం, మీరా, తులసీదాసు, బీహార్ లాల్, ఇక్బాల్ రచనలను, బెంగాలీలో రవీంద్రనాథ్ ఠాగూర్, రజనీ ప్రాణదత్, చండీదాస్ రచనలను, గుజరాతీలో అభాభగత్, దయారామ్, సోమసుందర్, నర్మదలాల్, గోరఖ్‌నాథ, ప్రేమ్‌చంద్ రచనలను అనువదించాడు. తమిళంలో తిరువళ్ళువర్, నమ్మాల్వార్, తిరుజ్ఞాన సంబందర్, అండాళ్ రచనలను, కన్నడంలో సర్వజ్ఞుని ‘త్రిపదులు’ అనువదించాడు. విశ్వం అనువాదాలను గమనిస్తే ఎన్ని భాషలలో ప్రవేశం ఉందో తెలుస్తుంది.
ఉద్యోగ జీవితానికి వస్తే విశ్వం అనేక వార, దినపత్రికలలో పనిచేశాడు. 1938లో స్థాపించబడ్డ ‘నవసాహిత్యమాల’లో ఎడిటర్‌గా, పబ్లిషర్‌గా చేరాడు. 1934–35లో ‘నవ్యసాహిత్య పరిషత్తు’లో సభ్యుడయ్యాడు. నవ్యసాహిత్య పరిషత్తులో అప్పటికే ప్రసిద్ధులైన కవులు, రచయితలు ఉండేవాళ్ళు. 1936–37 మధ్యలో ‘భారతి’ పత్రికకు సమీక్షకుడిగా ఉండేవాడు. హైదరాబాద్ నుండి వెలువడే ‘మీజాన్’ పత్రికకు విలేఖరిగా 1945లో చేరాడు. తరువాత ‘ప్రజాశక్తి’ దినపత్రికలో చేరాడు. 1948 వరకూ కొనసాగాడు. పత్రికా ఆఫీసు విజయవాడలో ఉండేది. 1948లో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. 1949 తరువాత విశ్వం మద్రాసుకు తరలి వెళ్లాడు.‘ప్రోగ్రెసివ్ రైటర్స్’ సంస్థకు కార్యనిర్వాహక సంపాదకుడుగా ఉన్నాడు. ‘బాలభారతి’ విద్యాలయానికి కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా ఉండి బాలల మనస్తత్వం పట్ల పరిశోధన చేయడమే కాకుండా ఇటలీ దేశస్థురాలైన మేడమ్ మాంటిసోరీ రచనలను ఎన్నిటినో అనువదించాడు. రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా ఉన్నాడు. 1951లో ‘ఇంటింటి విజ్ఞానమాల’ను ప్రారంభించి దానికి ప్రథమ సంపాదకులుగా ఉండి ఎన్నో రచనలను ముద్రించారు. 1959లో స్థాపింపబడ్డ ఆంధ్రప్రభ వారపత్రికకు సంపాదకునిగా ఉండి అది తాత్కాలికంగా తొలగింపబడేదాకా పని చేశాడు. విశ్వం 1960–62లలో ఆంధ్రజ్యోతిలోనూ, 1963లో ఆంధ్రప్రభ దినపత్రికలోనూ పని చేశాడు. ఆంధ్రప్రభ వారపత్రికలో 1967 నుండి పని చేసిన తరువాత సంపాదకుడై 1986లో రిటైరయ్యాడు.
విశ్వం ఎడిటర్‌గా, పబ్లిషర్‌గా, జర్నలిస్ట్‌గా, వ్యాసరచయితగా బహుముఖాలతో రచనలు వెలువరిస్తూ వచ్చాడు. భారతిలో సాహితీ రచనలు ప్రచురింపబడ్డాయి. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకుడిగా ఉన్నప్పుడు ‘తెలుపు–నలుపు’, ‘అవి–ఇవి’, ‘మాణిక్యవీణ’ మొదలైన శీర్షికలతో వ్యాసాలు వ్రాసేవాడు. ఆంధ్రజ్యోతిలో ‘నా కథ’ పేరుతో కొన్ని వారాలు విశ్వం స్వయంగా తెలిపిన జీవిత విశేషాలు ప్రచురింపబడుతూ ఉండి 1987లో విశ్వం మరణించడంతో ఆగిపోయింది.
విశ్వం సాహిత్య స్రష్టే కాకుండా రాజకీయ రంగంలో కూడా నిష్ణాతులు. కవిగా, సాహితీవేత్తగా ఉంటూ రాజకీయ రంగంలో కూడా నిలబడగలగడం సాధ్యమైన విషయం కాదు. దీన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి విశ్వం. కాంగ్రెసు పార్టీ అభివృద్ధి కోసం 1937లో తీవ్రంగా కృషి చేశాడు. అనంతపురం జిల్లా కాంగ్రెసు కమిటీకి 1938లో కార్యదర్శిగా పని చేశాడు. దశాబ్ది కాలం పాటు కార్యదర్శిగా ఉన్నాడు. ‘ఆంధ్రమహాసభ’కు కొన్ని రోజులు కార్యదర్శిగా పనిచేశాడు. 1939–40లో ‘ఆకాశవాణి’ ప్రచురించాడు. 1935–45 ఆకాశవాణి పత్రికను బ్రిటిషు దురాగతాలకు వ్యతిరేకంగా నడిపి జైలు పాలయ్యాడు.
ఈ క్రిందివారిలో బెంగాలీ రచయిత కానివారు :
CBSE answer: (3)
జవాబు: (3) గోరఖ్ నాథ్
జాగ్రత్త: ప్రశ్న 'కానివారు' అని అడుగుతోంది; బెంగాలీ రచయితను ఎంచుకోకూడదు.