By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 2 Telugu Language Question Paper with Answer Key

You are reading the question paper with answers. This is not the timed test: no clock is running and nothing is being scored.

Go to the timed test →

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానములు రాయండి.
కవిత్వానికి 1990లో నోబెల్ బహుమతి పొందిన మొదటి మెక్సికన్ కవి, రచయిత, దౌత్యవేత్త ఓక్టావియోపాజ్, మెక్సికో నగరంలో జన్మించారు. తల్లి జోసెఫెనా లోజానో ది స్పానిష్ సంతతి. తండ్రి ఓక్టానియో పాజ్ సొలోర్జనో, న్యాయవాది. మెక్సికో విప్లవకాలంలో జపాటాని సమర్థించారు. చెప్పుకోదగ్గ వ్యవసాయక సంస్కరణలు చేసారు. అప్పటి డైయాజ్ పాలనకు వ్యతిరేకి అయిన, ఎమిలియానో జపాటాకి కార్యదర్శిగా పనిచేశారు. వెదికి వెదికి జపాటా చంపబడ్డప్పుడు, దానికి భయపడి, పాజ్ కుటుంబమంతా కొన్నాళ్లబాటు అమెరికా వలసపోయారు. తాత ఇరెనివో పాజ్ విలేఖరి. నవలాకారుడు. బాల్యం నుండీ వయస్సుకు మించిన మేధావి కావడంతో తాతయ్య విస్తృత గ్రంథాలయంలోని పుస్తకాలు చదువుకుంటూ గడిపేవారు. అందులో ఏడువేల పుస్తకాల వరకూ ఉండేవి. అప్పుడు చదువుకున్న వోల్టెయిర్ రచనల మూలానే ఆయన నాస్తికులయ్యారని చెప్పుకునేవారు. జీవితమంతా నిరంతరం చదువుతోనే ఉండేవారు.
యువకుడిగా ఉన్నప్పటి నుంచే కవి కావాలని కలలు కన్నారు. మెక్సికోలో చదువు పూర్తయాక ఉపకార వేతనం మీద, కవిత్వం కోసం పాజ్ అమెరికా వెళ్లారు. అప్పట్లో మెక్సికన్ అతర్యుద్ధం మూలాన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. వీరికి రాజకీయాల్లో రుచి ఎక్కువ. సమాజవాదిగా తనకు తానే ప్రకటించుకున్నారు.
1937లో స్పానిష్ అంతర్యుద్ధం శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు, ప్రజాతంత్రవాదిగా, స్టాలిన్ విరోధిగా అక్కడి రచయితలకు సంఘీభావంగా స్పెయిన్ వెళ్లారు. అప్పుడే పెళ్లి చేసుకున్న భార్య ఎలెనా గార్లోని తనతోబాటు వెంట తీసుకువెళ్లారు. వీరికి ఒక కుమార్తె గార్రో పేరుపొందిన నవలాకారిణి. సినిమా రచయిత్రి కూడా. 1937లో వివాహం చేసుకుని 1959లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత భారతదేశంలో పరిచయమైన ఫ్రెంచి మహిళ మారీ జోస్ ట్రామిని, భారతదేశంలోనే ఢిల్లీలోని తన నివాసానికి దగ్గర్లో వేపచెట్టు కింద వివాహం చేసుకున్నారు.
1938లో మెక్సికోకి తిరిగొచ్చాక పాజ్ స్వయాన ఒక సాహిత్య రాజకీయ పత్రికను నెలకొల్పారు. 19 ఏళ్లప్రాయంలో ఆయన మొదటి కవిత్వ సంపుటి ‘అడవి చంద్రుడు’ వెలువడింది. 1944లో గుగ్గెన్ హైం ఫెలోషిప్ పొంది, న్యూయార్క్‌లోను, సాన్‌ఫ్రాన్సిస్కోలోను, స్పానిష్ అమెరికన్ కవిత్వం చదివారు. అది ఉత్తర అమెరికా, మెక్సికన్ల నాగరికతలు తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది. 1950లో వచ్చిన ఆయన ‘నిర్జనప్రదేశపు పద్మవ్యూహం’ సంకలనానికి అదే నాంది. మెక్సికన్ – స్వభావం, చరిత్రకు వ్యాఖ్యానం, మానసిక ప్రభావం అందులో అద్భుతంగా చిత్రితమైనాయి. ఆధునికవాదం, అధివాస్తవికత ఆయన్ని ఎక్కువగా ఆకర్షించిన విషయాలు.
1945లో పాజ్ మెక్సికో దౌత్యసంబంధ విభాగంలో చేరి ఫ్రాన్స్, జపాన్, స్విట్జర్లాండ్‌లో వివిధ హోదాల్లో పనిచేసారు. 1962 నుండి 1968 వరకూ భారతదేశంలో మెక్సికో రాయబారిగా ఉన్నారు. మెక్సికో నగరంలో ప్లాజా ట్లాటెలోకో విద్యార్థుల పట్ల జరిగిన అమానుషాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛంద పదవీ వరమణ చేసి, తనకు తానే విధించుకున్న ప్రవాసంలోకి వెళ్లిపోయారు. ‘వ్యాకరణవేత్త కోతి (రాజస్థాన్ పర్యటన ఆధారంగా నవల)’, ‘తూర్పు నిమ్నత (కవిత్వం)’ ఈ రెండూ భారతదేశంలో ఉన్నప్పుడు రాసినవే. 1969లో కేంబ్రిడ్జ్‌లోను, 1971–72 మధ్య హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోను గడిపారు. ఆ తరువాత మెక్సికోకి తిరిగొచ్చి ప్లూరల్ సాహిత్య సాంస్కృతిక దినపత్రికను నడిపారు. 1976లో మరో మాసపత్రిక వ్యూల్టాను అదే పద్ధతిలో ప్రారంభించారు. ఈ రెండు పత్రికలు మెక్సికో సాహిత్య ప్రస్థానానికి గణనీయమైన సేవచేసాయి.
పాజ్ వామపక్ష భావాలున్నా అతివాదాన్ని, మానవహక్కుల హననాన్ని నిరసించేవారు. గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌ల అహింసావాదంతో ఏకీభవించినా నిర్మలమైన హింసను సమర్థించారు. 1976లో వచ్చిన ‘ప్రత్యామ్నాయ ప్రవాహం’లో, తిరుగుబాటుదారుడు, విప్లవకారుడు, ఎదిరించేవాడి మధ్య ప్రత్యేకతల్ని స్పష్టంగా ప్రస్తావించారు.
పాజ్ రచనలు అనేక భాషల్లోకి తర్జుమా అయినాయి. ఎలియట్ వెయిన్ బెర్గర్ ఆయన రచనల్ని ఎక్కువగా ఆంగ్లంలోకి అనువాదం చేసారు. వీరి అనువాద కవితల సంకలనాలు హిందీ, బెంగాలీలో వచ్చాయి. 1937లో ‘నీ స్పష్టమైన నీడ కింద ఇంకా ఇతర కవితలు’, 1957లో ‘లోపలి వృక్షం’ మొదలైనవి వచ్చాయి. 1980 లో హార్వర్డ్, 1984లో న్యూయార్క్ విశ్వవిద్యాలయాలు ఆయన్ని గౌరవ పట్టాలతో సత్కరించాయి. వచ్చిన పురస్కారాల్లో – 1977 జెరూసలేం, మెక్సికో సాహిత్య పురస్కారాలు, 1981లో సెర్వాంటీ బహుమతి, 1984లో జర్మని పుస్తక విక్రేతల శాంతి బహుమతి, 1987లో స్పెయిన్ మెనెండెజ్ పెలాయో బహుమతి ముఖ్యమైనవి. చివరికి 1990లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన సాహిత్యానికి మచ్చుతునకగా నోబెల్ బహుమతి ప్రదాతలు, ఆయన కవిత ‘నేను చూస్తున్న దానికి చేస్తున్నదానికి మధ్య’ను ఉదహరించారు. పాబ్లో నెరూడాతోను, గాబ్రియల్ గార్సియా మార్క్వేజ్‌తోనూ, సాహిత్యపరంగా ఎంత దగ్గరతనమున్నా రాజకీయ కారణాలతో వైరుధ్యాలుండేవి. అప్పుడు రాసినదే ఈ కవిత. ఆయన సమగ్ర సంపుటి 1994లో వచ్చింది. 1933 నుండి 40కి పైగా పుస్తకాలొచ్చాయి. వీటిల్లో ఎక్కువ భాగం కవిత్వం, తతిమ్మావి వ్యాసాలు, నాటకాలు, ఉత్తరాలు వగైరా.
పాజ్ రెండు పుస్తకాలు ‘భారతదేశ కాంతి ఇంకా రెండు ఉద్యానవనాల వృత్తాంతం’, ‘1952–1955 మధ్య భారతదేశం నుండి కవితలు’, 1997లో వచ్చాయి. ‘భారతదేశం కాంతి ఇంకా రెండు ఉద్యానవనాల వృత్తాంతం’ అన్న వ్యాస సంపుటిలో భారతదేశంలో ఉన్న తక్కువ సమయం (1960–1968) తన జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిందిగా ఆయన రాసుకున్నారు. తన మాతృదేశాన్ని పరీక్షించుకునేందుకు భారతదేశం ఒక మంచి అద్దం అని పాజ్ బలంగా నమ్మారు.

Q91

పాజ్ మాతృమూర్తి పేరు :

  1. (1) ఎలెనా గార్లోని
  2. (2) మారీ జోన్ ట్రోమిని
  3. (3) గార్రో
  4. (4) జోసెఫెనాలోజానో
See answer and solution
Q92

పుస్తక విక్రేతల శాంతి బహుమతి పొందిన సంవత్సరం :

  1. (1) 1984
  2. (2) 1969
  3. (3) 1984
  4. (4) 1987
See answer and solution
Q93

పాజ్‌కు నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం :

  1. (1) 1990
  2. (2) 1987
  3. (3) 1981
  4. (4) 1980
See answer and solution
Q94

పాజ్ రచనలను ఇంగ్లీషులోకి అనువదించినవారు :

  1. (1) గాంధీ
  2. (2) మార్టిన్ లూథర్ కింగ్
  3. (3) ఎలియట్ వెయిన్ బెర్గర్
  4. (4) మారీజోన్ ట్రామిని
See answer and solution
Q95

స్పానిష్ అంతర్యుద్ధం తీవ్రమైన సంవత్సరం :

  1. (1) 1937
  2. (2) 1938
  3. (3) 1959
  4. (4) 1950
See answer and solution
Q96

పాజ్ మెక్సికో దౌత్య సంబంధ విభాగంలో ఎప్పుడు చేరారు ?

  1. (1) 1962
  2. (2) 1945
  3. (3) 1971
  4. (4) 1990
See answer and solution
Q97

పాజ్ భారతదేశంలో మెక్సికో రాయభారిగా ఉన్న కాలం :

  1. (1) 1971 - 72
  2. (2) 1962 - 1968
  3. (3) 1969
  4. (4) 1976
See answer and solution
Q98

‘లోపలి వృక్షం’ వెలువడిన సంవత్సరం :

  1. (1) 1937
  2. (2) 1957
  3. (3) 1976
  4. (4) 1984
See answer and solution
Q99

పాజ్ గూగ్గెన్ హైం ఫెలోషిప్ పొందిన సంవత్సరం :

  1. (1) 1938
  2. (2) 1944
  3. (3) 1950
  4. (4) 1937
See answer and solution

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకు గల ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
అనయంబున్ శ్రుతవంతుఁడై వినుత శిష్టాచారమార్గంబులం
జను పుణ్యాత్ముఁడు దుర్గముల్ గడచి ప్రజ్ఞాహర్మ్యసంరూఢుఁడై
కనుచుండుం బటు మోహపంకజలమగ్నం బైన లోకంబు వీఁ
క నధోభాగమునందు డింది కడుదుఃఖం బొందఁగా నవ్వుచున్

Q100

పద్యంలో యతి ఏయే అక్షరాలకు చెల్లుతుంది :

  1. (1) 1 - 11 అక్షరాలు
  2. (2) 1 - 14 అక్షరాలు
  3. (3) 1 - 13 అక్షరాలు
  4. (4) 1 - 10 అక్షరాలు
See answer and solution
Q101

పద్యంలోని గణముల క్రమం :

  1. (1) భ–ర–న–భ–భ–ర–వ
  2. (2) స–భ–ర–న–మ–య–వ
  3. (3) మ–స–జ–స–త–త–గ
  4. (4) న–జ–భ–జ–జ–జ–ర
See answer and solution
Q102

‘పుణ్యాత్ముడు’ ఏ సంధి ?

  1. (1) సవర్ణదీర్ఘ సంధి
  2. (2) యణాదేశ సంధి
  3. (3) వృద్ధి సంధి
  4. (4) యడాగమం
See answer and solution
Q103

పద్యంలో గల అలంకారము :

  1. (1) ఉపమాలంకారము
  2. (2) రూపకాలంకారము
  3. (3) దృష్టాంతాలంకారము
  4. (4) నిదర్శనాలంకారము
See answer and solution
Q104

‘అనయంబున్’ పదానికి అర్థము :

  1. (1) నయముకానిది
  2. (2) కన్నుకానిది
  3. (3) ఎల్లప్పుడును
  4. (4) అవినయము
See answer and solution
Q105

దుర్గము అనగా :

  1. (1) దుర్గమనము
  2. (2) దూరగమనము
  3. (3) కోట
  4. (4) రాజధాని
See answer and solution
Q106

విద్యార్థులపై, ఉపాధ్యాయులు, సామగ్రి పరీక్షలు, మూల్యాంకనాల ప్రభావాన్ని ఇలా వ్యవహరించవచ్చు :

  1. (1) కార్పస్ ప్రభావం
  2. (2) వాష్‌బాక్ ప్రభావం
  3. (3) తరగతిగది ప్రభావం
  4. (4) రీఇన్‌ఫోర్స్‌మెంట్
See answer and solution
Q107

పాఠశాలలు అదనపు ద్విభాషా వాదాన్ని అనుసరించాలి ఎందుకంటే :

  1. (1) పిల్లవాడి భాషా సంస్కృతులను విలువైందిగా చూడటం కోసం
  2. (2) ద్వితీయ భాషగా ఆంగ్లం బోధించటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది
  3. (3) విద్యార్థి భాషను ప్రోత్సాహిస్తుంది కానీ సంస్కృతిని కాదు
  4. (4) ప్రథమ భాషా అభివృద్ధిని మరుగుపరుస్తుంది
See answer and solution
Q108

భాషా ప్రకార్యాలైన తాన కల్పన, ఊనిక, స్వరం, లయ మొదలైనవాటిని ఇలా వ్యవహరించవచ్చు :

  1. (1) కవిత్వం
  2. (2) ఛందస్సు
  3. (3) ధ్వని సంబంధి
  4. (4) ప్రాగ్మాటిక్స్
See answer and solution
Q109

భారత దేశంలోని భాషల విషయంలో ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు ?

  1. (1) రాజ్యాంగం ప్రకారం ఆంగ్లం సహ అధికార భాష
  2. (2) భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులోని జాబితా ప్రకారం ఇరవైరెండు భాషలున్నాయి
  3. (3) సంస్కృతం ఆధునిక భారతీయ భాష
  4. (4) భారత ఉపఖండంలో హిందీ మాట్లాడే భాష
See answer and solution
Q110

భాషా తరగతి గదిలో ఉపాధ్యాయురాలి పర్యవేక్షణలో బృందాలుగా ఏర్పడి ఇచ్చిన అంశం మీద ప్రకటనను ప్రదర్శించారు. ఈ పద్ధతిలో భాష నేర్చుకోవడం అనేది ఇలా వ్యవహరించవచ్చు :

  1. (1) సహకార అభ్యసనం
  2. (2) పోటీ తత్త్వం, శత్రుత్వం
  3. (3) భాషా క్రీడలు
  4. (4) మార్గదర్శనం, కౌన్సెలింగ్
See answer and solution
Q111

ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు రెస్టారెంట్లలో వాడే భాషను పరిచయం చేసేందుకు ఒక పని ఇచ్చింది. ఈ క్రిందివాటిలో ఆ పాఠం యొక్క లక్ష్యం ఏమిటి ?

  1. (1) అభ్యాసకుడికి నిఘంటువు పదాలను నేర్చుకోవటం
  2. (2) వ్యాకరణాంశాలను ప్రఖ్యాత పరచటం
  3. (3) సెలవు గమ్యం గురించి వాచకం పరిచయం చేయటం
  4. (4) విశ్లేషణాత్మక ఆలోచనను వృద్ధి పరచటం
See answer and solution
Q112

భాష నేర్చుకోవడం అన్నది అది శాబ్దిక, శాబ్దికేతర అలవాటు రూపొందటం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుందని ఏ విధానం విశ్వసిస్తుంది ?

  1. (1) ఫంక్షనలిస్ట్
  2. (2) బిహేవియరిస్ట్
  3. (3) కాగ్నిటివిస్ట్
  4. (4) ఇంటరాక్షనలిస్ట్
See answer and solution
Q113

కథలో స్థల కాలాలను ఏమంటారు ?

  1. (1) వస్తువు
  2. (2) సెట్టింగ్
  3. (3) ఇతివృత్తం
  4. (4) క్లైమాక్స్
See answer and solution
Q114

ఒక భాషా తరగతి గదిలో ఉపాధ్యాయురాలు కొంతమంది విద్యార్థుల బృందాన్ని విక్రయదారులుగా, ఆస్తి అమ్మకందారులుగా కొనుగోలు దారులుగ, భూస్వాములుగా, కౌలుదారుగా వ్యవహరించమని కోరి, మిగతా విద్యార్థులను వారినే గమనిస్తూ వారి సంభాషణను ఆస్వాదించమని కోరింది. ఈ కార్యకలాపాన్ని ఏమంటారు ?

  1. (1) రోల్ ప్లే
  2. (2) డ్రామా
  3. (3) నటనా తరగతి
  4. (4) మార్గదర్శనం
See answer and solution
Q115

ఐదవ తరగతి విద్యార్థులకు నేర్పేందుకు ఉపాధ్యాయురాలు ప్రతిదినం పత్రికలు, మెనూకార్డులు, రైలు టికెట్లులాంటి వస్తువులను తరగతి గదికి తెస్తుంది. అభ్యసనం జరిగేట్లు చూడటానికి ఆమె చేస్తున్న దేమిటి ?

  1. (1) ఆమె బోధన వాస్తవికంగా, ఉపయోగకరంగా ఉండేందుకు ప్రామాణిక సామగ్రిని ఉపయోగిస్తున్నది
  2. (2) బహుభాషలు నేర్చుకునేందుకు విద్యార్థులకు ఆమె సహాయ పడుతున్నది
  3. (3) వాస్తవ జీవన పరిస్థితుల ఆధారంగా విద్యార్థులు ఆంగ్ల భాష నేర్చుకోవాలని ఆశిస్తున్నది
  4. (4) విద్యార్థులలో చైతన్యం కలిగిస్తున్నది
See answer and solution
Q116

ఈ క్రింది వాటిలో శ్రవణం పాఠానికి సంబంధించిన ప్రణాళికలో ఏది అంత ముఖ్యమైంది కాదు ?

  1. (1) విరామం, రికార్డింగ్
  2. (2) స్పీడు డెలివరీ
  3. (3) వక్తల జండర్
  4. (4) ఎక్కువ మంది వక్తలుడటం
See answer and solution
Q117

భారత దేశంలో బహుభాషా వాదం ఉపాధ్యాయులు దీనిని అర్థం చేసుకోవడాన్ని లక్షిస్తుంది :

  1. (1) భావ ప్రసారం జరుగుతుంది సామాజిక సంయోగం నిర్వహింపబడుతుంది
  2. (2) ఆధిక్య భాషలతోటి మైనారిటీ భాషలను కలుపుతుంది
  3. (3) భిన్నత్వం గల సమాజంలో ఒక భాషా విధాన చట్రం ఏర్పరచాలి
  4. (4) భాష గుర్తింపు, సంస్కృతి అనేవి ప్రత్యేక అస్తిత్వాలు
See answer and solution
Q118

ఈ క్రింది వాటిలో ఏ భాషా నైపుణ్యం భాషా గ్రహణ కౌశలంగా వ్యవహరింపబడుతుంది ?

  1. (1) శ్రవణం మరియు భాషణం
  2. (2) భాషణం మరియు లేఖనం
  3. (3) పఠనం మరియు లేఖనం
  4. (4) శ్రవణం మరియు పఠనం
See answer and solution
Q119

శ్రవణం నిమగ్నం చేస్తుంది :

  1. (1) ధ్వనిని వినడం, ఆ ధ్వనిని యథాతథంగా డీకోడ్ చేయటం
  2. (2) విషయాన్ని ఊహించటం
  3. (3) విషయానికి సంబంధించి పూర్వజ్ఞానాన్ని ఉపయోగించటం
  4. (4) ధ్వనులను గుర్తించి దానినుంచి అర్థాన్ని రాబట్టడం
See answer and solution
Q120

ఈ క్రింది కాలం A లో ఉన్నభాషా బోధన పద్ధతులలో వాటిని అర్థం చేసుకోవటం లేదా కాలం B లోని సంబంధిత కార్యకలాపాతో జతపరచండి.

A B
(a) కమ్యూనికేటివ్ భాషా బోధన (i) సామాజిక అంగీకారం మరియు సందర్భానికి సరిపోయిన భాషా
(b) ప్రత్యక్ష పద్ధతి (ii) మౌన పాఠం
(c) వ్యాకరణ అనువాదం (iii) లిఖిత సాహిత్య వాచకాలు
(d) వెస్ట్ నూతన పద్ధతి (iv) వ్యాకరణం అనుగమ పద్ధతిలో బోధించాలి
  1. (1) (a)-(i), (b)-(iv), (c)-(iii), (d)-(ii)
  2. (2) (a)-(iv), (b)-(ii), (c)-(iii),(d)-(i)
  3. (3) (a)-(iii), (b)-(i), (c)-(ii), (d)-(iv)
  4. (4) (a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)
See answer and solution

Passage

సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 121 నుండి 128 వరకూ గల ప్రశ్నలకు సమాధానములు రాయండి.
ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు వర్గాల మధ్య ఏ రకమైనా పోటీ అయినా అది వ్యక్తిగతం. దాని వలన కలిగే లాభ నష్టాలు వ్యక్తి ఇష్టం. కానీ ఆట..మాట..పాట వంటి విభాగాలలో జరిగే పోటీ వ్యక్తి గతమైనా తద్వారా ప్రదర్శితమయ్యే ప్రతిభ మూలంగా జనించే రసానుభూతి సామాజికులకు ఆనంద దాయకం. ఈ రకమైన పోటీలో ఒకరి కన్నా మరొకరు చూపే నైపుణ్యం మూలంగా ఆ కళ చరితార్థమౌతుంది. పోటీ అనేది అన్ని రంగాలలోనూ సృష్టి ఆరంభం నుండి కన్పిస్తున్నా లలిత కళల్లో ఉత్పన్నమయ్యే పోటీ సామాజికులకు ఆనందం పంచి పెట్టబడుతుంది. క్రీ.పూ. ఐదవ శతాబ్దం నుంచి గ్రీకు దేశంలో డయోనిసెస్ దేవత ఉత్సవాల్లో నాటక కర్తలైన సోఫోక్లిస్, ఎస్కిలస్, యురిపిడిస్ వంటి ప్రముఖులు ఈ పోటీలలో పాల్గొని బహుమతులు పొందినట్లు తెలుస్తుంది. దాదాపు పది నుంచి 15 వేల మంది ప్రేక్షకులు తిలకించే ఈ నాటకాలకు డయోనిసెస్ దేవత గుడి ప్రధాన పూజారితో పాటు, పలువురు ఏథెన్స్ నగర ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేచారు.
తెలుగు నాటకం పుట్టిన కొద్దిరోజులకే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈ పోటీతత్వం రాజ్యం ఏలింది. బందరుకు చెందిన పుస్తక ప్రచురణకర్త, కొనుకొలను వెంకట్రామయ్య 1914లో ధర్మవరం కృష్ణమాచార్యుల చిత్రనళీయం నాటకానికి బందరులో పోటీలను ఏర్పాటు చేశాడు. తెలుగు దేశంలో జరిగిన తొలి నాటక పోటీలుగా ఇవి చరిత్రలో నిలిచిపోయాయి. ఈ పోటీలలో ఆరు నాటక సమాజాలు పాల్గొని చిత్రనళీయం నాటకాన్ని ప్రదర్శించాయి. ఈ పోటీలలో బందరు ఇండియన్ డ్రమెటిక్ కంపెనీకి ఉత్తమ ప్రదర్శన, ఆ సమాజానికే చెందిన వెంపటి వేంకటేశ్వర్లుకు ఉత్తమ నటుడూ, ముప్పిడి జగ్గరాజు పోషించిన దమయంతి పాత్రకు ఉత్తమనటి అవార్డులు లభించాయి. ఈ పోటీలు విజయవంతమైన స్ఫూర్తితో వెంకట్రామయ్య 1915లో ఇచ్చాపురపు యజ్ఞనారాయణ శాస్త్రి రసపుత్ర విజయం నాటక పోటీలను ఏర్పాటు చేశాడు. ఈ పోటీలలో బందరు రాయల్ థియేటర్‌కు ఉత్తమ ప్రదర్శన బహుమతితో పాటు ఈ సమాజ నటులైన ముంజులూరి కృష్ణరావు (దుర్గాదాసుపాత్ర), పింగళి లక్ష్మీకాంతం (రాజసింహుని పాత్ర)లకు ఉత్తమ నటుల బహుమతులు లభించాయి. 1916లో వడ్డాది సుబ్బారాయుడు వేణీ సంహారం నాటక పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో బందరు రాయల్ థియేటర్‌కే ఎక్కువ బహుమతులు లభించాయి. దుర్యోధనుని పాత్ర బహుమతిని బి.టి.నరసింహాచార్యులు, పింగళి వీరయ్యలకు సంయుక్తంగా ప్రకటించారు. కానీ ఈ బహుమతిని అందుకోవడానికి నరసింహాచార్యులు తిరస్కరించడంతో వివాదం రాజుకొని పరిషత్తు రసాభాసగా మిగిలింది. బహుమతి ప్రదానం జరగలేదు.
నాటక పోటీల నిర్వహణాభిలాష ఇతర పట్టణాలకు కూడా పాకింది. 1917లో గుంటూరులో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్యహరిశ్చంద్ర నాటక పోటీలు జరిగాయి. ఈ పోటీలకు హరిశ్చంద్ర పాత్రకు అఖండ కీర్తి ప్రతిష్ఠలార్జించిన హరిప్రసాద రావు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. బందరు నాటక సమాజానికి చెందిన డి.వి. సుబ్బారావు ఉత్తమ నటునిగా బహుమతి పొందాడు. 1917 నుంచి 1921 వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గయోపాఖ్యానం, కనకతార, పాదుకా పట్టాభిషేకం నాటకాల పోటీలను నిర్వహించారు. 1921లో విజయవాడలో జరిగిన చింతామణి నాటక పోటీలలో పలు సమాజాలు పాల్గన్నాయి. పోటీల ఆరంభదశలో ప్రస్తుత విధానానికి భిన్నంగా నిర్వహకులు ఒక నాటకాన్ని ఎంపిక చేసి, దానికే పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శనతోపాటు, ఆ నాటకంలోని ప్రధానమైన పాత్రలకు బహుమతులు ప్రదానం చేశారు.
1919లో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు సర్వేపల్లి రాధాకృష్ణ, జయపూర్ సంస్థాన మహారాజు రాజా విక్రమదేవవర్మ సహకారంతో విశాఖ ప్రాంతంలోని కళాకారులను, కళాసంస్థలను ఒక తాటి మీద నడపాలనే సదుద్దేశంతో విశాఖ పట్టణాంధ్ర నాటక కళాపరిషత్తును స్థాపించారు. ఒకే నాటకానికి పోటీలను నిర్వహించే విధానానికి భిన్నంగా నాటక సమాజాలు తమకు నచ్చిన నాటకాన్ని పోటీలలో ప్రదర్శించ వచ్చుననే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. బహుమతులను వెండి, బంగారు కప్పులు కాకుండా నగదు రూపంలో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గనడానికి రాష్ట్రంలోని ఎన్నో సమాజాలు ఉత్సాహం చూపాయి. కళను పోటీలతో కొలవడం దారుణమని, ఇది కళను అవమానించడమని కొందరు సుదీర్ఘ ప్రకటన చేశారు. ఈ సమయంలో స్వాతంత్ర్య పోరాటం తారాస్థాయికి అందుకొంది. బ్రిటిష్ వారు అణచిచేత చర్యల పేరున దారుణ మారణ కాండ చేశారు. ఇటువంటి వాతావరణంలో పోటీలు జరగక పోయినా, వారు నిర్దేశించిన నిబంధనావళి ఇప్పటికీ అమలులో ఉండడం విశేషం. 1923 జనవరిలో మల్లాది విశ్వనాథ కవిరాజు నాయకత్వంలో గంజాం మండల ఆంధ్ర నాటక కళాపరిషత్తును స్థాపించి పోలాకీ అనే గ్రామంలో నాటక పోటీలను నిర్వహించారు. ఇది నాటక పరిషత్తు ప్రస్థానంలో తొలిదశగా చెప్పవచ్చు.

Q121

దుర్గా దాసు పాత్రను పోషించినవారు :

  1. (1) బి.టి. నరసింహాచార్యులు
  2. (2) సర్వేపల్లి రాధాకృష్ణన్
  3. (3) మల్లాది విశ్వనాథ కవిరాజు
  4. (4) ముంజులూరి కృష్ణరావు
See answer and solution
Q122

విజయవాడలో ఏ నాటక పోటీలు జరిగాయి :

  1. (1) చింతామణి నాటక పోటీలు
  2. (2) చిత్రనళీయ నాటక పోటీలు
  3. (3) సత్యహరిశ్చంద్ర నాటక పోటీలు
  4. (4) రసపుత్ర విజయ నాటక పోటీలు
See answer and solution
Q123

గంజాం మండల ఆంధ్ర నాటక పరిషత్తును స్థాపించినవారు :

  1. (1) మల్లాది విశ్వనాథ కవిరాజు
  2. (2) మహారాజు విక్రమ దేవవర్మ
  3. (3) బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
  4. (4) ధర్మవరం రామకృష్ణమాచార్యులు
See answer and solution
Q124

సత్యహరిశ్చంద్ర నాటక పోటీలు జరిగిన సంవత్సరం :

  1. (1) 1914
  2. (2) 1915
  3. (3) 1916
  4. (4) 1917
See answer and solution
Q125

హరిశ్చంద్ర నాటక పోటీలకు న్యాయ నిర్ణేత :

  1. (1) ధర్మవరం రామకృష్ణమాచార్యులు
  2. (2) డి.వి. సుబ్బారావు
  3. (3) హరిప్రసాద రావు
  4. (4) వెంపటి వెంకటేశ్వర్లు
See answer and solution
Q126

దుర్యోధనుని పాత్ర బహుమతిని తిరస్కరించినవారు :

  1. (1) బి.టి. నరసింహాచార్యులు
  2. (2) పింగళి వీరయ్య
  3. (3) బలిజేపల్లి లక్ష్మీకాంతకవి
  4. (4) డి.వి. సుబ్బారావు
See answer and solution
Q127

దమయంతి పాత్రను పోషించినవారు :

  1. (1) ముప్పిడి జగ్గరాజు
  2. (2) పింగళి లక్ష్మీకాంతం
  3. (3) ముంజలూరి కృష్ణరావు
  4. (4) బి.టి. నరసింహాచార్యులు
See answer and solution
Q128

రసపుత్ర విజయం నాటక పోటీలను ఏర్పాటు చేసిందెవరు ?

  1. (1) కొనుకొలను వెంకట్రామయ్య
  2. (2) ధర్మవరం రామకృష్ణమాచార్యులు
  3. (3) ముప్పిడి జగ్గరాజు
  4. (4) ఇచ్చాపురపు యజ్ఞనారాయణ శాస్త్రి
See answer and solution

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1931 నుండి 1943 వరకూ పదమూడు సినిమాలలో నటించిన ఖుర్షీద్ సినిమా పాటలపై తనదైన ముద్ర వేసింది. 1947లో పాకిస్తాన్ వెళ్ళిపోయిన ఖుర్షీద్ అప్పటి ఆనవాయితీ ప్రకారం తన పాటలు తానే పాడుకునేది. కానీ ఖుర్షీద్‌కు సంగీతంలో ఎటువంటి శిక్షణ లేదు. ఆమె స్వరం మరీ బలహీనంగా ఉండేది. పాటలు విన్నవారికి శాంతిగా అనిపించేది. ఆమె పెద్దగా హై పిచ్‌లో పాడగలిగేది కాదు. అందుకే ఆమె తన గాన ప్రతిభ వల్ల కాక స్వరమాధుర్యం వల్లనే చక్కటి గాయనిగా గుర్తింపు పొందింది. ఆమె దీర్ఘంగా రాగాలు తీయగలిగేది కాదు. ఎప్పుడైనా రాగం తీయవలసి వస్తే స్వరంలో వణుకు స్పష్టంగా తెలిసేది. పాటలు ఎలా పాడమంటే అలా పాడేది తప్ప, గాయనిగా తనవైపు నుంచి బాణీకి ప్రత్యేకతను ఆపాదించగలిగేది కాదు. అందుకే ఖేమ్‌చంద్ ప్రకాశ్ ‘ముంతాజ్ (1943)’ సినిమాలో ‘దిల్ కో ధడ్‌కన్ బనాలియా’ పాటలో ఖుర్షీద్ ఒక పాదం పాడగానే, దానికి అనుబంధంగా వాయిద్యాలతో పాటను సుందరం చేయాలని ప్రయత్నించాడు. అయితే, తన పాటలు తానే పాడుకునేది కాబట్టి ఆమెను నేపథ్య గాయనిగా పరిగణించే వీలు లేదు.
అమీర్ బాయి కర్ణాటకి నటిగా తెరపైకి వచ్చినా గాయనిగానే ఆమెను సినీ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. 1940 నుంచి 1950 నడుమ ఆమె దాదాపు 225 పాటలు పాడింది. ఆ కాలంలో గొప్ప హిట్ పాటలు పాడింది. కిస్మత్ (1943) సినిమాలో ‘ధిరే ధీరే ఆరె బాదల్’, రతన్ (1944) సినిమాలో ‘మిల్ కే చిఛడ్ గయే అఖియాన్’, సమాధి (1950)’లో ‘గోరే గోరే ఓ బాన్కే చోరే’ వంటి హిట్ పాటలు పాడింది అమీర్ బాయి కర్ణాటకి. ఈమె కుడా శిక్షణ పొందిన గాయని కాదు. ఆమె స్వరం శక్తివంతమైనది. ఈమె పాటల్లో భావాన్ని స్పష్టంగా వ్యక్తపరిచేది. పాటల్లో పదాలను కాస్త నెమ్మదిగా ఉచ్చరించటం ద్వారా గొప్ప ప్రభావాన్ని సృజించేది. ‘కిస్మత్’ సినిమాలో ‘ఘర్ ఘర్ మే దివాలీ’ పాటలో పలు భావాలను ఒకేసారి సమర్థవంతంగా పలికించి మెప్పించింది. అయితే 1940 దశకం చివరికి వచ్చేసరికి ఈమె కుటుంబపరంగా వ్యక్తిగత సమస్యలలో చిక్కుకుంది. పాటల పై దృష్టి పెట్టలేకపోయింది. దాంతో నెమ్మదిగా సినీ పరిశ్రమకు దూరమయింది. కానీ విశ్లేషకులు లత తెరపైకి రావటం, అమీర్ బాయి కర్ణాటకి కెరీర్‌ను దెబ్బ తీసిందని వ్యాఖ్యానిస్తారు. కానీ అది పొరపాటు. 1950లో ‘సమాధి‘ సినిమాలో లత ‘గోరెగోరె’ పాటను అమీర్ బాయి కర్ణాటకితో పాడే సమాయనికి అమీర్ బాయి వ్యక్తిగత సమస్యల వల్ల పాటలను తగ్గించింది. సి. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటలో నాయిక నళినీ జయవంత్‌కు లత, కుల్దీప్ షార్‌కు అమీర్ బాయి పాడారు. సాధారణంగా మన సినిమాలలో నాయికకు పాడే స్వరం నెంబర్ వన్ గాయనిది అయి ఉంటుంది. అంటే, అప్పటికే లత అగ్రస్థాయి గాయనిగా పరిగణించబడుతోందన్నమాట.
బెంగల్‌కు చెందిన గాయని అయినా నటి కానన్ దేవి పాటలో బెంగాలీ యాస కనబడేది కాదు. ఆమె స్వరం బలమైనది. హైపిచ్‌లో కీచు గొంతు వచ్చేది కాదు. ‘విద్యావతి (1938)’ సినిమాలో ‘డోలే హృదయ కీ నయ్యా’ పాటలో ఆమె హైపిచ్‌లో అద్భుతంగా పాడింది. ‘లగాన్ (1943)’లో ‘హమారీ లాజ్’ పాట, ‘హాస్పిటల్’ సినిమాలో ‘జరా నైనోంసే నైనా’ పాటలో హైపిచ్ నుంచి హఠాత్తుగా లోపిచ్‌కు సులభంగా, ఎలాంటి ప్రయాస లేకుండా దిగుతుంది ఆమె స్వరం. ‘తరానా’ కూడా అద్భుతంగా పాడగలదని ‘విద్యావతి’ సినిమాలోని ‘అంబువా కి డాలీ’ పాట నిరూపిస్తుంది. అలాగే, ‘జవాబ్ (1942)’లో ‘తుపాన్ మెయిల్, దునియా యే దునియా’ లాంటి వేగవంతమైన పాటలను కూడా సులభంగా పాడగలదు కానన్ దేవి. అయితే ఆమె పాటలు సినిమాను దాటి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేదు. కానీ 1946 వచ్చేసరికి కానన్ దేవి ప్రభావం, ప్రాధాన్యం తగ్గిపోయాయి.
జోహ్రాబాయి అంబాలేవాలి ‘రతన్ (1944)’ సినిమాలో ‘అఖియ మిలాకే’, ‘రుమ్ ఝుమ్ బర్సే బాదర్‌వా’ పాటలతో అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు పొందింది. 1941 నుండి 1950 నడుమ 1229 పాటలు పాడింది జోహ్రాబాయి. జోహ్రాబాయి కూడ పాట పాడటంలో శిక్షణ పొందలేదు. ఆమె స్వరం వేగవంతమైన పాటల్లో అందంగా ధ్వనించటంతో సంగీత దర్శకులు ఆమెతో వేగవంతమైన పాటలు పాడించేందుకే ఉత్సాహం చూపారు. దాంతో ఆమెకు బాణీని అనుసరించి స్పష్టంగా పాడటం తప్ప తన ప్రతిభను ప్రదర్శించి, పాటకు మెరుపులు అద్దే వీలు చిక్కలేదు. అయినా సరే తనకున్న పరిమిత పరిధిలో అక్కడో పదాన్ని, ఇక్కడో పదాన్ని విభిన్నంగా ఉచ్చరించటం ద్వారా, పాటలో అభినయాన్ని ప్రదర్శించాలని ప్రయత్నించింది జోహ్రాబాయి. ‘జీవన్ (1944)’ సినిమాలో ‘నెనోమే నైనా మత్ డాల్’, ‘చంద్రలేఖ (1948)’లో ‘మేరా హుస్న్ లూట్ లియా’ వంటి పాటలు ఇందుకు చక్కని ఉదాహరణలు. ‘సమఝ్ లో నజర్ కే ఇషారే’ (కశ్మీర్), ‘క్యా బతాయే కిత్ని హస్రత్’ (నాటక్), ‘ఫిర్ ఆహ్ దిల్‌సే నికలీ’ (మేలా) వంటి ‘గజల్స్’ను అద్భుతంగా పాడింది జోహ్రాబాయి. కానీ సంగీత దర్శకులు ఆమెను వేగవంతమైన పాటలకే అధికంగా పరిమితం చెయటంతో, విభిన్నమైన పాటలు పాడగలిగి ఉండి కూడా కొన్ని రకాల పాటలకే పరిమితమయింది జోహ్రాబాయి. ఈమె 1953లో సినిమాలలో పాడడం నుంచి విరమించుకుంది.
సురయ్య ‘తాజ్‌మహల్’ సినిమాతో 1941లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే సురయ్య ప్రధానంగా తన పాటలు తానే పాడుకునేది. దాంతో నేపథ్య గాయనిలు ఎవరితోనూ ఆమెకు పోటీ లేదు. గాయనిగా తనదైన ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. నటిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆరంభంలో ‘స్టేషన్ మాస్టర్’ (1942) సినిమాలో నేపథ్య గాయనిగా పాడింది. ‘శారద’ సినిమాలో ’మెహ్తాబ్’కు ‘పంచీ జా పీఛే రహాహై బచ్ పన్’ అనే పాటను పాడింది. కానీ నటిగా పేరు సాధించిన తర్వాత ఆమె తన పాటలు మాత్రమే పాడుకుంది. అంటే ఎందరు నేపథ్య గాయనిలు వచ్చినా ఆమెకు ఎవరితోనూ పోటీలేదు. ఎవరికీ ఆమే పోటీ కాదు.
రాజ్‌కుమారి సైతం తన పాటలు తానే పాడుకునే నటిగా సినీ రంగంలో అడుగుపెట్టింది. కానీ 1938 నుండి ఆమె నటనకు స్వస్తి చెప్పి నేపథ్య గానం వైపు దృష్టి పెట్టింది. రాజ్‌కుమారికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉంది. ముఖ్యంగా ‘టప్ప’ పాటల గానంలో శిక్షణ పొందింది. దాంతో రాగాలు తీయగలదు, ‘పల్టా’లు పాడగలదు. నాటకాలలో మైకు లేకుండా హైపిచ్‌లో పాడే అలవాటు ఉండడంతో హైపిచ్‌లో పాటలు పాడటంలో ఆమెకు ఎలాంటి సమస్య లేదు. అయితే ఆమె స్వరం పలు రకాల భావాలను పలకగలిగేది కాదు. ముఖ్యంగా పాటలో ‘నాసల్ టోన్’ రావటం ఇబ్బంది కలిగించేది. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె ‘పాటలు పాడటంలో నా పరిధి పరిమితం’ అని చెప్పింది. అయితే 1950 దశకం ఆరంభం నుంచీ ఆమె పాటలు పాడటం తగ్గించింది. 1950 చివరికల్లా ఆమె స్వరం సినిమాల్లో వినిపించటం మానేసింది.

Q129

ధీరె ధీరె ఆరె బాదల్ పాట’ ఏ సినిమాలోది ?

  1. (1) సమాధి
  2. (2) రతన్
  3. (3) కిస్మత్
  4. (4) ముంతాజ్
See answer and solution
Q130

తన సినీ ప్రయాణాన్ని తాజ్‌మహల్‌లో ప్రారంభించింది :

  1. (1) సురయ్య
  2. (2) జోహ్రాబాయి
  3. (3) లతా మంగేష్కర్
  4. (4) కానన్ దేవి
See answer and solution
Q131

‘విద్యావతి’ సినిమా ఎప్పుడు విడుదలైంది ?

  1. (1) 1950
  2. (2) 1944
  3. (3) 1940
  4. (4) 1938
See answer and solution
Q132

‘నైనోమే నైనా మత్‌డాల్’ పాట ఏ సినిమాలోది ?

  1. (1) జీనన్
  2. (2) చంద్రలేఖ
  3. (3) రతన్
  4. (4) తాజ్‌మహల్
See answer and solution
Q133

‘డోలే హృదయ్‌కీ నయ్యా’ పాటను పాడింది :

  1. (1) ఖుర్షీద్
  2. (2) లతా మంగేష్కర్
  3. (3) కానన్ దేవి
  4. (4) జోహ్రాబాయి అంబాలేవాలీ
See answer and solution
Q134

1229 పాటలు పాడిందెవరు :

  1. (1) కానన్ దేవి
  2. (2) ఖుర్షీద్
  3. (3) జోహ్రాబాయి
  4. (4) అమీర్ బాయి
See answer and solution
Q135

‘పల్టాలు’ పాడగల గాయని :

  1. (1) సురయ్య
  2. (2) రాజ్‌కుమారి
  3. (3) జోహ్రాబాయి
  4. (4) ఖుర్షీద్
See answer and solution
Q136

ఈ క్రిందివాటిలొ ఏ టూల్ అసంఖ్యాకంగా ఏకకాలిక, ఏక కాలకం కాని ఆన్‌లైన్ బోధనకు అవకాశం కల్పిస్తుంది ?

  1. (1) పాఠ్యపుస్తకం
  2. (2) రైల్వేటికెట్
  3. (3) టెలివిజన్
  4. (4) పార్‌లెట్
See answer and solution
Q137

ఫార్మేటెన్ అసెస్‌మెంట్‌లో ఏ సాధనం ఆదర్శ ప్రాయం కాదు ?

  1. (1) అసైనమెంట్
  2. (2) పేపర్ పెన్సిల్ పరీక్ష
  3. (3) ప్రాజెక్టు
  4. (4) తరగతి గది ప్రెజెంటేషన్
See answer and solution
Q138

భాష నేర్పేందుకు అనుదిన వస్తువులను వాడటాన్ని ఏమని వ్యవహరించాలి ?

  1. (1) రియాలియా
  2. (2) భాషా క్రీడలు
  3. (3) బోధనా సామగ్రి
  4. (4) వాచకం
See answer and solution
Q139

భాషా విషయంగా విద్యా విధానంలో భారతదేశం త్రిభాషా సూత్రం దేనిని ప్రోత్సాహించేందుకు ప్రయత్నిస్తుంది ?

  1. (1) బహుభాషా విద్య
  2. (2) ఏక భాషా విద్య
  3. (3) ద్విభాషా విద్య – హిందీపై దృష్టి
  4. (4) మాతృభాషా ప్రాతిపదికపై బహుభాషావాదం
See answer and solution
Q140

టాప్‌డౌన్ ప్రాసెసింగ్‌లో ఈ క్రిందివాటిలో ఏది సరైనది కాదు ?

  1. (1) శ్రోతలు వారి నేపథ్య జ్ఞానం పై ఆధారపడతారు
  2. (2) ఉద్దేశిత అర్థం గురించి శ్రోతలు ఊహా చేస్తారు
  3. (3) శ్రోతలు వారి ప్రాపంచిక జ్ఞానం ఉపయోగిస్తారు
  4. (4) శ్రోతలు ప్రతిపదం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది
See answer and solution
Q141

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుతారు ?

  1. (1) జనవరి 1
  2. (2) 14 ఫిబ్రవరి
  3. (3) 21 ఫిబ్రవరి
  4. (4) 13 ఏప్రిల్
See answer and solution
Q142

నీ స్నేహితుడైన సహోద్యోగికి నీవు ఇ-మెయిల్ రాయిదలిస్తే ఏ తరహా మెయిల్ పంపుతావో గుర్తించండి.

  1. (1) అనౌపచారిక
  2. (2) ఔపచారిక
  3. (3) వ్యాపార
  4. (4) కరస్పాండెన్స్
See answer and solution
Q143

బోధన అభ్యసన క్రమం అంతటా అసెస్‌మెంట్ జరుగుతుంది ఎందుకంటే విద్యార్థి అభ్యసన అవగాహనను స్పష్టపరచుకునేందుకు దీనిని ఏమంటారు ?

  1. (1) అభ్యసనం కొరకు అసెస్‌మెంట్
  2. (2) అభ్యసనం యొక్క అసెస్‌మెంట్
  3. (3) అభ్యసనంలో అసెస్‌మెంట్
  4. (4) అభ్యసనంగా అసెస్‌మెంట్
See answer and solution
Q144

ఒక ద్వితీయ భాషా తరగతిలో ఉపాధ్యాయురాలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే ఆడియోను వినిపించింది. ఆ తరువాత కొన్ని ప్రశ్నలతో కుడిన పత్రాన్ని విద్యార్థులకు ఇచ్చి ఇవ్వబడిన ఐచ్చికాలలో సరైన వాటిని టిక్ చేయుమనికోరింది. ఈ పాఠం యొక్క లక్ష్యం అభ్యాసకుడిని ఏం చేస్తుంది.

  1. (1) ఆరోగ్యం మీద పాఠం వినేట్లు చేస్తుంది
  2. (2) అభ్యాసకులను పనిలో ఉంచుతుంది
  3. (3) వినేట్లుగా భావాలను విశ్లేషించేట్లుగా చేస్తుంది
  4. (4) ఆరోగ్యం, సంపదల మీద పాఠంను కంఠతా పట్టేలా చేస్తుంది
See answer and solution
Q145

భాష నేర్చుకోవటంలో దోషాలు అనే విషయంగా ఈ క్రిందివాటిలో ఏది సరైనది కాదు ?

  1. (1) భాష నేర్చుకునే క్రమాన్ని దోషాలు మరుగుపరుస్తాయి
  2. (2) దోషాలు ఎల్లప్పుడు చెడ్డవికావు, నేర్చుకోవటంలో సహాయకాలు
  3. (3) భాష నేర్చుకునే క్రమానికి దోషాలు చాలా కీలకమైనవి
  4. (4) ద్వితీయ భాషా సము పార్జనా క్రమాన్ని అర్థం చేసుకోవడానికి దోషాలు దోహదకారులు
See answer and solution
Q146

భాషా విద్యలో సృజనాత్మకత అంటే :

  1. (1) ఓపెన్ ఎండెడ్ తరగతి గది కార్యకలాపాలు విభిన్న అన్వయాలకు, సమాధానాలు ఆధారమిస్తాయి
  2. (2) ఏదైన విషయం అర్థం చేసుకోవడానికి భిన్న విషయాలకు సంబంధించిన అంశాలు కలపటం
  3. (3) కొత్త బోధనా పద్ధతులను ఉపయోగిస్తూ తరగతి గది కార్యకలాపం
  4. (4) తరగతి గది సామగ్రిని భావ ప్రసారంలో భాషా బోధనకు ఉపయోగించటం
See answer and solution
Q147

అభ్యాసకులను భాషకు గురయ్యేట్లు చేయాలి. వారు చేసే పొరపాట్లు ఆధారాలు నేర్చుకోవటం అనేది జరుగుతుందని చెప్పటానికి అవగాహన ఏ బోధనా విధానాన్ని సూచిస్తుంది .

  1. (1) బిహేవియరిస్టు
  2. (2) కాగ్నిటివిస్టు
  3. (3) హ్యూమనిస్టు
  4. (4) సైకోఎనలిస్టు
See answer and solution
Q148

ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన సరియైనది ?
(a) డిస్‌లెక్సియా అనేది ఒక పఠన వైకల్యం
(b) డిస్‌గ్రాఫియా అనేది లేఖన వైకల్యం
(c) డిస్‌గ్రాఫియా అనేది పఠన వైకల్యం
(d) డిస్‌లెక్సియా అనేది లేఖన వైకల్యం

  1. (1) (a) మాత్రమే ఒప్పు
  2. (2) (b) మరియు (d) మాత్రమే ఒప్పు
  3. (3) (a) మరియు (b) రెండు సరైనవి
  4. (4) (c) మరియు (d) రెండూ సరైనవి
See answer and solution
Q149

రీటా అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఆంగ్లం నేర్పేందుకు దృశ్యసాధనాలు భాషా క్రీడలను వాడుతుంది. ఏ బోధనా సూత్రాన్ని రీటా అను ప్రయుక్త పరుస్తోంది ?

  1. (1) సహజక్రమ సూత్రం
  2. (2) అభ్యాసము, అలవాటుగా మారటమనే సూత్రం
  3. (3) ప్రేరణ, ఆసక్తి సూత్రం
  4. (4) జివితంతో అనుసంధించుకునే సూత్రం
See answer and solution
Q150

జంతువులను ప్రధాన పాత్రలుగా గలిగి ఉండి ఒక నీతిని బోధించే కథను ఏమంటారు ?

  1. (1) ఫాంటసీ
  2. (2) ఫేబిల్
  3. (3) సైన్స్ ఫిక్షన్
  4. (4) ట్రావెలాగ్
See answer and solution