విజయవాడలో ఏ నాటక పోటీలు జరిగాయి :
- (1) చింతామణి నాటక పోటీలు
- (2) చిత్రనళీయ నాటక పోటీలు
- (3) సత్యహరిశ్చంద్ర నాటక పోటీలు
- (4) రసపుత్ర విజయ నాటక పోటీలు
సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 121 నుండి 128 వరకూ గల ప్రశ్నలకు సమాధానములు రాయండి.
ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు వర్గాల మధ్య ఏ రకమైనా పోటీ అయినా అది వ్యక్తిగతం. దాని వలన కలిగే లాభ నష్టాలు వ్యక్తి ఇష్టం. కానీ ఆట..మాట..పాట వంటి విభాగాలలో జరిగే పోటీ వ్యక్తి గతమైనా తద్వారా ప్రదర్శితమయ్యే ప్రతిభ మూలంగా జనించే రసానుభూతి సామాజికులకు ఆనంద దాయకం. ఈ రకమైన పోటీలో ఒకరి కన్నా మరొకరు చూపే నైపుణ్యం మూలంగా ఆ కళ చరితార్థమౌతుంది. పోటీ అనేది అన్ని రంగాలలోనూ సృష్టి ఆరంభం నుండి కన్పిస్తున్నా లలిత కళల్లో ఉత్పన్నమయ్యే పోటీ సామాజికులకు ఆనందం పంచి పెట్టబడుతుంది. క్రీ.పూ. ఐదవ శతాబ్దం నుంచి గ్రీకు దేశంలో డయోనిసెస్ దేవత ఉత్సవాల్లో నాటక కర్తలైన సోఫోక్లిస్, ఎస్కిలస్, యురిపిడిస్ వంటి ప్రముఖులు ఈ పోటీలలో పాల్గొని బహుమతులు పొందినట్లు తెలుస్తుంది. దాదాపు పది నుంచి 15 వేల మంది ప్రేక్షకులు తిలకించే ఈ నాటకాలకు డయోనిసెస్ దేవత గుడి ప్రధాన పూజారితో పాటు, పలువురు ఏథెన్స్ నగర ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేచారు.
తెలుగు నాటకం పుట్టిన కొద్దిరోజులకే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈ పోటీతత్వం రాజ్యం ఏలింది. బందరుకు చెందిన పుస్తక ప్రచురణకర్త, కొనుకొలను వెంకట్రామయ్య 1914లో ధర్మవరం కృష్ణమాచార్యుల చిత్రనళీయం నాటకానికి బందరులో పోటీలను ఏర్పాటు చేశాడు. తెలుగు దేశంలో జరిగిన తొలి నాటక పోటీలుగా ఇవి చరిత్రలో నిలిచిపోయాయి. ఈ పోటీలలో ఆరు నాటక సమాజాలు పాల్గొని చిత్రనళీయం నాటకాన్ని ప్రదర్శించాయి. ఈ పోటీలలో బందరు ఇండియన్ డ్రమెటిక్ కంపెనీకి ఉత్తమ ప్రదర్శన, ఆ సమాజానికే చెందిన వెంపటి వేంకటేశ్వర్లుకు ఉత్తమ నటుడూ, ముప్పిడి జగ్గరాజు పోషించిన దమయంతి పాత్రకు ఉత్తమనటి అవార్డులు లభించాయి. ఈ పోటీలు విజయవంతమైన స్ఫూర్తితో వెంకట్రామయ్య 1915లో ఇచ్చాపురపు యజ్ఞనారాయణ శాస్త్రి రసపుత్ర విజయం నాటక పోటీలను ఏర్పాటు చేశాడు. ఈ పోటీలలో బందరు రాయల్ థియేటర్‌కు ఉత్తమ ప్రదర్శన బహుమతితో పాటు ఈ సమాజ నటులైన ముంజులూరి కృష్ణరావు (దుర్గాదాసుపాత్ర), పింగళి లక్ష్మీకాంతం (రాజసింహుని పాత్ర)లకు ఉత్తమ నటుల బహుమతులు లభించాయి. 1916లో వడ్డాది సుబ్బారాయుడు వేణీ సంహారం నాటక పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో బందరు రాయల్ థియేటర్‌కే ఎక్కువ బహుమతులు లభించాయి. దుర్యోధనుని పాత్ర బహుమతిని బి.టి.నరసింహాచార్యులు, పింగళి వీరయ్యలకు సంయుక్తంగా ప్రకటించారు. కానీ ఈ బహుమతిని అందుకోవడానికి నరసింహాచార్యులు తిరస్కరించడంతో వివాదం రాజుకొని పరిషత్తు రసాభాసగా మిగిలింది. బహుమతి ప్రదానం జరగలేదు.
నాటక పోటీల నిర్వహణాభిలాష ఇతర పట్టణాలకు కూడా పాకింది. 1917లో గుంటూరులో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్యహరిశ్చంద్ర నాటక పోటీలు జరిగాయి. ఈ పోటీలకు హరిశ్చంద్ర పాత్రకు అఖండ కీర్తి ప్రతిష్ఠలార్జించిన హరిప్రసాద రావు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. బందరు నాటక సమాజానికి చెందిన డి.వి. సుబ్బారావు ఉత్తమ నటునిగా బహుమతి పొందాడు. 1917 నుంచి 1921 వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గయోపాఖ్యానం, కనకతార, పాదుకా పట్టాభిషేకం నాటకాల పోటీలను నిర్వహించారు. 1921లో విజయవాడలో జరిగిన చింతామణి నాటక పోటీలలో పలు సమాజాలు పాల్గన్నాయి. పోటీల ఆరంభదశలో ప్రస్తుత విధానానికి భిన్నంగా నిర్వహకులు ఒక నాటకాన్ని ఎంపిక చేసి, దానికే పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శనతోపాటు, ఆ నాటకంలోని ప్రధానమైన పాత్రలకు బహుమతులు ప్రదానం చేశారు.
1919లో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు సర్వేపల్లి రాధాకృష్ణ, జయపూర్ సంస్థాన మహారాజు రాజా విక్రమదేవవర్మ సహకారంతో విశాఖ ప్రాంతంలోని కళాకారులను, కళాసంస్థలను ఒక తాటి మీద నడపాలనే సదుద్దేశంతో విశాఖ పట్టణాంధ్ర నాటక కళాపరిషత్తును స్థాపించారు. ఒకే నాటకానికి పోటీలను నిర్వహించే విధానానికి భిన్నంగా నాటక సమాజాలు తమకు నచ్చిన నాటకాన్ని పోటీలలో ప్రదర్శించ వచ్చుననే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. బహుమతులను వెండి, బంగారు కప్పులు కాకుండా నగదు రూపంలో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గనడానికి రాష్ట్రంలోని ఎన్నో సమాజాలు ఉత్సాహం చూపాయి. కళను పోటీలతో కొలవడం దారుణమని, ఇది కళను అవమానించడమని కొందరు సుదీర్ఘ ప్రకటన చేశారు. ఈ సమయంలో స్వాతంత్ర్య పోరాటం తారాస్థాయికి అందుకొంది. బ్రిటిష్ వారు అణచిచేత చర్యల పేరున దారుణ మారణ కాండ చేశారు. ఇటువంటి వాతావరణంలో పోటీలు జరగక పోయినా, వారు నిర్దేశించిన నిబంధనావళి ఇప్పటికీ అమలులో ఉండడం విశేషం. 1923 జనవరిలో మల్లాది విశ్వనాథ కవిరాజు నాయకత్వంలో గంజాం మండల ఆంధ్ర నాటక కళాపరిషత్తును స్థాపించి పోలాకీ అనే గ్రామంలో నాటక పోటీలను నిర్వహించారు. ఇది నాటక పరిషత్తు ప్రస్థానంలో తొలిదశగా చెప్పవచ్చు.
విజయవాడలో ఏ నాటక పోటీలు జరిగాయి :
CBSE answer: (1)
జవాబు: (1) చింతామణి నాటక పోటీలు
జాగ్రత్త: ప్రతి పోటీని దాని ఊరితో జతచేసి చూడాలి; పేర్లు మాత్రమే గుర్తుంచుకుంటే తికమక వస్తుంది.