By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 1 Telugu Language Question Paper with Answer Key

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపనలో బాలుడిగా పాలుపంచుకున్న ఆదిరాజు వీరభద్రరావు (1892-1973) తెలంగాణ చరిత్రపై అనేక పుస్తకాల్ని వెలువరించాడు. ఈయన 1903 లో నన్నయ రాసిన శకుంతలోపాఖ్యానమును ‘చిత్రశాకున్తలమ్’ పేరిట 300 పుటల్లో నవలీకరించడానికి సిద్ధపడ్డాడు. అయితే కేవలం 100 పేజీలు మాత్రమే నవలీకరించి పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకున్నాడని బొడ్డపాటి వేంకటకుటుంబరావు తన ఆంధ్ర నవలా పరిణామము అనే పుస్తకం (పే. 118) లో పేర్కొన్నాడు.
1906లో హైదరాబాద్‌లో స్థాపించబడి, 1910 నాటికి మద్రాసుకు తరలించబడ్డ ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి’ తరపున తొలి దశలో అనేక నవలలు వెలువడ్డాయి. ఈ మండలి తరపున భోగరాజు నారాయణమూర్తి – విమలాదేవి, వేలాల సుబ్బారావు – రాణిసంయుక్త, కేతవరపు – రాయచూరు యుద్ధము తదితర రచనలు వెలువడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో పనిచేసిన మెడోస్ టేలర్ ఆంగ్లంలో రాసిన ‘చాంద్ బిబి’ నవలను చిలకమర్తి లక్ష్మీనరసింహం ‘హేమలత’ పేరిట అనుసృజన చేసిండు. రాణీ సంయుక్త నవలను కొమర్రాజు వెంకటలక్ష్మణరావు తాను సంపాదకుడిగా ఉన్న విజ్ఞాన చంద్రికా గ్రంథమాల తరపున 14 మార్చి, 1908 నాడు ప్రకటించాడు. అంతకుముందు కొమర్రాజు తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపనతో 1901లోనే పునాది వేసిండు. ఇందులో అప్ఘనుల భారతదేశ దండయాత్ర కథా వస్తువు. పృథ్వీరాజు కాలములో జరిగిన దండయాత్రలో భారతదేశం స్వాతంత్ర్యం కోల్పోయిన తీరును, పృథ్వీరాజు భార్య రాణీ సంయుక్త స్వదేశాభిమానము ఇందులో చిత్రీకరించడమయినది.
1910లో కొమర్రాజు లక్ష్మణరావు రాసిన కథ ‘ఫూల్ జానీబేగమ్’ దీన్ని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పెంచి నవలగా 1914 లో ప్రచురించాడు. ఈ నవల పేరు ‘మిథునానురాగము’.
తెలంగాణ నుంచి మొదటి స్వతంత్ర పత్రిక హితబోధిని (1913-1915) వెలువరించిన బడారు శ్రీనివాసరావు 1910లోనే ‘ఆశాదోషం’ అనే నవలను రాసిండు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ దుర్గానికి సంబంధించిన ఈ చారిత్రక నవల రాత ప్రతి అందుబాటులో ఉంది. శ్రీనివాసరావు ఆశాదోషం నవలతో పాటు కథలు, నాటికలు, కవిత్వం కూడా వెలువరించాడు. ఆయుర్వేద వైద్యుడు, నటుడు కూడా అయిన శ్రీనివాసరావు తాను పుట్టి పెరిగిన ఊరు కోయిల్‌కొండకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని తీసుకొని ఆధునిక నవలగా మలిచిండు. 16 వ శతాబ్దానికి చెందిన చారిత్రక నేపథ్యంలో రాసిన నవలలో ముస్లిము రాజుల దాడిలో కోయిల్‌కొండ దుర్గం నాశనం కావడం, అక్కడి పాలకవంశం అంతరించి పోవడం కథాంశంగా చిత్రీకరించబడింది. సరళ గ్రాంథిక భాషలో రచన సాగింది.
ఈ చాప్టర్‌లో 1911-1930 సంవత్సరాల మధ్యన వెలువడ్డ నవలా సాహిత్యాన్ని విశ్లేషించడమైంది. దాదాపు ఇదే కాలంలో ఆంధ్రప్రాంతంలో చిలకమర్తి, వేంకట పార్వతీశ కవులు, విశ్వనాథ, అడవి బాపిరాజు, ఉన్నవ లక్ష్మీనారాయణ, తల్లాప్రగడ సూర్యనారాయణ, వేలూరి శివరామశాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి తదితరులు తెలుగు నవలను నడిపించారు. తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి, ఒద్దిరాజు సోదరులు, శేషభట్టార్ తదితరులు తెలంగాణలో నవలా రచనకు పూనుకుండ్రు. 1911 లో ఉస్మానలీఖాన్ పాలనతో హైదరాబాద్ రాజ్యంలో ఆధునీకీకరణకు పునాదులు పడ్డాయి. 1930 వరకు అని చెప్పడంలో జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభతో తెలంగాణ రాజకీయాలు, చైతన్యం ఒక నిర్దిష్ట రూపంలో మొదలయ్యాయి. ఈ రెండు కీలక సంఘటనలు, అవి తెలంగాణ సమాజంపై ప్రగాఢమైన ప్రభావం చూపించాయి కాబట్టి ఈ సంవత్సరాల మధ్యకాలంలో వెలువడిన నవలలను ఇక్కడ చర్చించడమైనది. ఈ కాలంలోనే తెలంగాణాలో ఒక వైపు గ్రంథాలయోద్యమం, మరోవైపు పత్రికోద్యమం, ఒక దానికొకటి పూరకంగా, ప్రేరకంగా పనిచేసి మొత్తం మీద హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రజల అభ్యున్నతికి కృషి చేశాయి. వీటికి అనేక మంది వైతాళికులు, సంస్థలు, సంఘాలు, ప్రచురణ సంస్థలు, గ్రంథమాలలు, బుక్‌షాప్స్ కృషి చేశాయి.
1911 లో తెలంగాణలో మీర్‌మహబూబ్ అలీఖాన్ మరణానంతరం ఆయన కొడుకు మీర్ ఉస్మానలీఖాన్ పాలన ప్రారంభమయింది. ఈయన పాలనలో ఉస్మానియా వర్సిటీ, హాస్పిటల్స్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలే గాకుండా నిజాంసాగర్, తుంగభద్ర లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈయన పాలనలో ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలపై ఆంక్షలు విధించడంతో నిరసన వెల్లువెత్తింది. ఈ నిరసనను గ్రంథాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి వ్యక్తం చేశారు. గ్రంథమాలలు వెలుగు చూశాయి. నవలల్ని ప్రచురించాయి. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, ఒద్దిరాజు సోదరులు, మందుముల సోదరులు, షబ్నవీసు వెంకటరామనరసింహారావు లాంటి వాళ్లు ఈ కాలంలోనే రంగం మీదికి వచ్చారు. గ్రంథాలయ, పత్రిక, సాహిత్య, రాజకీయ రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటి నేపథ్యంతో, స్ఫూర్తితో వెలువడిన నవలలను ఇక్కడ చర్చించడం జరిగింది. ఈ విభాగంలో 1911-1930 ల మధ్యన వెలువడ్డ నవలల గురించి చర్చిద్దాం. రాజకీయ చైతన్యంతో రాసిన నవలలు ఈ కాలంలోనే వెలువడ్డాయి. మనమూ చరిత్రకు ఎక్కదగినవారమే! మన జీవితాలు నవలకు అనువైనవే అని భావించి నవలలు రాసిండ్రు. ఈ నవలల్లో ఎక్కువభాగం చారిత్రక స్పృహతో రాసినవే. సురవరం ప్రతాపరెడ్డి, ఒద్దిరాజు సోదరులు, శేషాద్రి రమణకవులు, శేషభట్టర్ వేంకటరామానుజాచార్యులు తదితరులు తమ ప్రతిభను ప్రదర్శించారు. నిజాం రాష్ట్రాంధ్ర కేంద్ర జనసంఘం కార్యకలాపాలు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాయి. లైబ్రరీలు ప్రజల కూడలి ప్రదేశంగా మారాయి. రాజకీయాలు మాట్లాడుకోవడమే గాకుండా సాహిత్య సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇవి దోహదం చేశాయి. వీటి ప్రేరణతో సాహిత్యం వెలువడింది. ఇందులో నవలలు కూడా ఉన్నాయి. సంఘ సంస్కరణోద్యమంతో టేకుమళ్ళ నరసింహం ‘రాధమ్మ’ అనే నవలలో ఒక వేశ్య వ్యథాభరిత జీవితాన్ని కళ్లకు కట్టిండు.

Q91

టేకుమళ్ల నరసింహం రాసిన నవల ఏది ?

  1. (1) విమలాదేవి
  2. (2) హేమలత
  3. (3) ఫూల్ జానీబేగం
  4. (4) రాధమ్మ
See answer and solution
Q92

టేలర్ ఆంగ్లంలో రాసిన నవల :

  1. (1) చిత్ర శాకున్తలమ్
  2. (2) చాంద్ బీబీ
  3. (3) రాయచూరు యుద్ధం
  4. (4) ఫూల్ జానీబేగం
See answer and solution
Q93

ఆశా దోషం నవల ఎవరు రాశారు ?

  1. (1) బడారు శ్రీనివాసరావు
  2. (2) కొమర్రాజు లక్ష్మణరావు
  3. (3) బొడ్డపాటి వేంకట కుటుంబరావు
  4. (4) చిలకమర్తి లక్ష్మీనరసింహం
See answer and solution
Q94

మీర్‌మహబూబ్ అలీఖాన్ మరణించిన సంవత్సరం :

  1. (1) 1901
  2. (2) 1911
  3. (3) 1910
  4. (4) 1930
See answer and solution
Q95

మిథునానురాగం ఎవరి రచన ?

  1. (1) మొక్కపాటి నరసింహశాస్త్రి
  2. (2) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
  3. (3) ఉన్నవ లక్ష్మీనారాయణ
  4. (4) వేలూరి శివరామ శాస్త్రి
See answer and solution
Q96

శకుంతలోపాఖ్యానమును నవలీకరించడానికి ప్రయత్నించిన వారు :

  1. (1) మెడోస్ టేలర్
  2. (2) కీలాల సుబ్బారావు
  3. (3) బడారు శ్రీనివాసరావు
  4. (4) ఆదిరాజు వీరభద్రరావు
See answer and solution
Q97

ఫూల్ జానీబేగం కథా రచయిత :

  1. (1) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  2. (2) కొమర్రాజు లక్ష్మణరావు
  3. (3) భోగరాజు నారాయణ మూర్తి
  4. (4) బడారు శ్రీనివాసరావు
See answer and solution
Q98

విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి మద్రాసుకు తరలించబడింది. ఎప్పుడు ?

  1. (1) 1903
  2. (2) 1901
  3. (3) 1910
  4. (4) 1914
See answer and solution
Q99

ఫూల్ జానీబేగంను నవలగా రాసినవారు :

  1. (1) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
  2. (2) సురవరం ప్రతాపరెడ్డి
  3. (3) బద్దిరాజు సోదరులు
  4. (4) బొడ్డపాటి వేంకట కుటుంబరావు
See answer and solution

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకు గల ప్రశ్నలకు సమాధానములు రాయండి.
‘తన కుసుమంబులన్ ఫలవితానము మూర్కొన నాన మ్రాను నే
రని క్రియఁ గాన నేరదు పరం బగు తత్త్వమునైజభంగి ని
న్ననుపున సంతరాత్మ గను నైష్ఠికతం గను: మింతపట్టుఁ బా
మెనసిన తోలు వాయుక్రియ నీవు దొఱంగుదు పావపుంజమున్.

Q100

పద్యంలో ఏ అలంకారముంది ?

  1. (1) పరికరాలంకారము
  2. (2) సందేహాలంకారము
  3. (3) నిదర్శనాలంకారము
  4. (4) ఉపమాలంకారము
See answer and solution
Q101

పద్యంలోని ఛందస్సు ఏ వృత్తానికి చెందుతుంది ?

  1. (1) చంపకమాల
  2. (2) మత్తేభము
  3. (3) శార్దూలము
  4. (4) ఉత్పలమాల
See answer and solution
Q102

పద్యంలోని యతిస్థానం :

  1. (1) 1 - 11 అక్షరాలు
  2. (2) 1 - 13 అక్షరాలు
  3. (3) 1 - 14 అక్షరాలు
  4. (4) 1 - 10 అక్షరాలు
See answer and solution
Q103

‘పుంజమున్’ పదంలోని గురులఘు క్రమం :

  1. (1) U I U
  2. (2) U I I
  3. (3) I U U
  4. (4) U U U
See answer and solution
Q104

ఇచ్చిన పద్యం ప్రథమ పాదంలోని మొదటి గణం :

  1. (1) సగణము
  2. (2) రగణము
  3. (3) నగణము
  4. (4) భగణము
See answer and solution
Q105

ఫలవితానము అంటే :

  1. (1) ఫలముల సమూహము
  2. (2) ఫలముల విత్తనములు
  3. (3) పాప ఫలములు
  4. (4) ఫలితము
See answer and solution
Q106

ఉద్దేశం (A) : తరగతిగదిలో పిల్లల అభ్యసన అనుభవాలు వారి నిజజీవితానికి, సందర్భాలకు గాఢంగా సంబంధించినవి.
వివరణ (R) : పిల్లల పూర్వ అనుభవాల మీద ఆధారపడి నిర్మించేవే అభ్యసన అనుభవాలు.
ఈ క్రింది వాటిని పరిశీలించి మరింత సముచిత సమాధానం గుర్తించండి.

  1. (1) (A) మరియు (R) రెండూ సరైనవి (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
  2. (2) (A) సరైనది కానీ (R) సరైంది కాదు.
  3. (3) (A) సరైనది కాదు కానీ (R) సరైనది.
  4. (4) (A) మరియు (R) రెండూ సరైనవి (R) అనేది (A) కి సరైన వివరణ.
See answer and solution
Q107

భాషాభ్యసనం విషయంలో ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు ?

  1. (1) భాష నేర్చుకోవటానికి సమయం పడుతుంది.
  2. (2) భాష నేర్చుకోవటం అంటే అర్థం కల్పించుకోవటం.
  3. (3) భాష నేర్చుకునేందుకు వ్యాకరణం నేర్చుకోవటం అవసరం.
  4. (4) అభ్యాసకులందరూ భాషను సులభంగా నేర్చుకోగలుగుతారు. వారికి భాషలో ఉండే తగిన పనిని అప్పగించినట్లయితే.
See answer and solution
Q108

విద్యార్థులు షాపులో ఏదైనా కొనేందుకు ప్రయోజనాత్మక ప్రతిపాదన (ఫంక్షనల్ ఎక్స్‌పోనెంట్)ను ఉపయోగించగలరో లేదో అంచనా వేసేందుకు, విద్యార్థులకు ఈ పని చేయటం తగి ఉన్నది.

  1. (1) వారి ఆహార ప్రాధాన్యాలను రాయటం.
  2. (2) వినియోగదారులు, దుకాణదారుకు మధ్య కథ చదవటం.
  3. (3) దుకాణదారుకు, వినియోగదారుడికి మధ్య సన్నివేశం చిత్రించటం
  4. (4) వినియోగదారులకు, దుకాణదారుకు మధ్య సంభాషణ సంక్షిప్తంగా రాయటం.
See answer and solution
Q109

భాష నేర్చుకోవడానికి సంబంధించి ఒక ఉపాధ్యాయురాలు, కొన్ని కోణాలను కనుగొన్నది. ఉదాహరణకు : శాస్త్రీయ భావనలకు సంబంధించిన వాచకం అర్థం చేసుకుని చదవటం. ఈ కోణంలో ఏయే విద్యార్థులకు ఈ విషయంలో ఇబ్బంది ఉందో గుర్తించింది. వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు వాచకం చదివి అర్థం చేసుకునేందుకు తోడ్పడింది. ఆమె ఆచరణలో పెడుతున్న విషయాన్ని ఏమంటారు ?

  1. (1) ఉన్నత శ్రేణి నైపుణ్యాలు
  2. (2) ఆలోచనా నైపుణ్యాలు
  3. (3) ఫీడ్‌బ్యాక్ బోధన
  4. (4) పరిహార బోధన
See answer and solution
Q110

పఠనానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఉపనైపుణ్యం కాదు :

  1. (1) అర్థాలను నిష్పన్నం చేసుకుని తెలియని పదాలను నిఘంటువులో వెతుక్కోవటం
  2. (2) కావలసిన సమాచారం కొరకు స్కానింగ్ చేయటం
  3. (3) ప్రతిపదం ఉచ్చారణను తెలుసుకోవటం
  4. (4) పదజాలం గుర్తించటం, కీలక పదాలను ఎంచుకోవటం
See answer and solution
Q111

ఉద్దేశం (A) : విద్యార్థి చేసిన కృత్యశకలాల ప్రయోజనంతో కూడిన సముచ్చయమే విద్యార్థి పోర్ట్‌ఫోలియో అంటే.
వివరణ (R) : పోర్ట్‌ఫోలియో అనేది విద్యార్థులు బలాలను బలహీనతలను మూల్యాంకన పరచుకునేందుకు ప్రోత్సాహమిస్తుంది.
క్రింది ఇచ్చిన వాటిలో అత్యంత సముచిత సమాధానాన్ని గుర్తించండి.

  1. (1) (A) మరియు (R) రెండూ సరైనవి కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
  2. (2) (A) సరైనది కానీ (R) సరైంది కాదు.
  3. (3) (A) సరైనది కాదు కానీ (R) సరైనది.
  4. (4) (A) మరియు (R) సరైనవి (R) అనేది (A) కి సరైన వివరణ.
See answer and solution
Q112

విద్యార్థులు పద సంపదను పెంచుకొనే నిమిత్తం ఉపాధ్యాయుడు వారికి సహాయపడేందుకు విద్యార్థులు భాషను సులభంగా తెలుసుకునే సమాచారం గల సామగ్రిని వాడుతున్నాడు. ఈ సామగ్రి ప్రామాణికమైంది. ఈ సామగ్రి ఏది ?

  1. (1) రోల్ కార్డులు
  2. (2) ద్విభాషా నిఘంటువులు
  3. (3) శ్రేణీకరించిన పాఠకులు
  4. (4) పత్రికలు
See answer and solution
Q113

విద్యార్థుల అభ్యసన శైలిని, వారి ప్రాధాన్యాలను తెలుసుకొనేందుకు ఒక భాషా ఉపాధ్యాయురాలు వారికి ఒక ప్రశ్నావళిని రూపొందించి ఇచ్చింది. ఇక్కడ ఉపాధ్యాయురాలు ఏ పాత్ర పోషిస్తున్నది ?

  1. (1) ప్రణాళికాకర్త
  2. (2) నిపుణ సమాచారం అందించేది
  3. (3) నిర్ధారణ చేసే వ్యక్తి
  4. (4) మేనేజరు
See answer and solution
Q114

ఒకటవ తరగతికి బోధించే ఉపాధ్యాయురాలు తన అభ్యాసకులకు గోడమీద తమకు ఇష్టమైన పద్ధతిలో బొమ్మలు గీయడం, రాయడం ఇంకేదైనా గీయడం చేయమని చెప్పింది. ఇక్కడ ఆమె ఏ విషయాన్ని ప్రోత్సహిస్తున్నది.

  1. (1) సంతోషం, హాస్యం
  2. (2) లేఖన నైపుణ్యాభివృద్ధి
  3. (3) వర్ణమాలను రాసే పని మొదలుపెట్టటం
  4. (4) ఉదీయమాన అక్షరాస్యతాభివృద్ధి
See answer and solution
Q115

పుస్తకాలలోని చిత్రాలు, బొమ్మలు, దృష్టాంతాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైంది కాదు ?

  1. (1) విద్యార్థుల ఆసక్తిని నిలుపుతాయి
  2. (2) అటువంటి చిత్రాలు వేయడానికి అవకాశమిస్తాయి
  3. (3) జ్ఞాపక సందర్భాలు, పరిచయం లేని విషయాలలో భాషను వాడటానికి దోహదపడతాయి
  4. (4) విషయాన్ని సమర్థిస్తాయి
See answer and solution
Q116

ఈ క్రింది వాటిలో బాల అభ్యాసకులకు సంబంధించిన ఏ ప్రకటన సరైనది ?

  1. (1) అభ్యాసకులు అమూర్త భావనలను అర్థం చేసుకోవటంలో ఇబ్బంది పడతారు.
  2. (2) అభ్యాసకులు పాక్షికంగా అమూర్త భావనలను అర్థం చేసుకుంటారు.
  3. (3) అభ్యాసకులు అమూర్త భావనల ద్వారా ప్రేరేపింపబడుతారు.
  4. (4) బాల అభ్యాసకులు అమూర్త భావనలను అర్థం చేసుకుంటారు.
See answer and solution
Q117

మీ తరగతి గదిలో పిల్లలు పరస్పరం వ్యవహరించేందుకు. ఉపాధ్యాయుడిగా పిల్లలకు మీరు ఏ విధంగా సహాయకారులుగా ఉంటారు ?
(a) పిల్లలను అధికంగా ప్రశ్నలు అడగమని కోరటం
(b) జమిలిపని, బృంద కార్యక్రమం ఇచ్చి విద్యార్థులను అభిప్రాయాలు అడగటం
(c) వాచకాన్ని బిగ్గరగా చదవమని అడిగి విడివిడిగా ప్రతిస్పందించమని కోరటం తద్వారా విద్యార్థులు ఎవరికి వారు నేర్చుకోవటం జరుగుతుంది.
(d) ఒకరినొకరు సంభాషణలు పలకటం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, ఒకరినొకరు ప్రశ్నలు అడిగేలా చేయటం

  1. (1) (b), (c), (d) లు సరైనవి.
  2. (2) (a), (b), (d) లు సరైనవి.
  3. (3) (a), (c), (d) లు సరైనవి.
  4. (4) (a), (b), (c) లు సరైనవి.
See answer and solution
Q118

భాషాభివృద్ధికి సంబంధించి జ్ఞాన గ్రహ సిద్ధాంతం, భాష అంటే దీనిని సమర్థిస్తుంది :

  1. (1) బహుమతి–శిక్ష ద్వారా నేర్చుకోవచ్చు.
  2. (2) సమాజ సంపర్కంతో నేర్చుకోవచ్చు.
  3. (3) శాబ్దికీకరించటానికి ముందే భావనను పిల్లవాడు అర్థం చేసుకునే దానిపై ఆధారపడి ఉంటుంది
  4. (4) వ్యక్తి కలిగి ఉండే అంతర్గత సామర్థ్యం
See answer and solution
Q119

ఉద్దేశం (A) : భాష సాంస్కృతిక చైతన్యం, అభివ్యక్తినిచ్చే విమర్శనాత్మక కోణాన్ని రూపొందిస్తుంది. పిల్లలలో ఇది ప్రధానమైన సామర్థ్యంగా పరిగణింపబడుతుంది.
వివరణ (R) : సాంస్కృతిక చైతన్యం, అభివ్యక్తీకరణ సామర్థ్యాలు అన్నవి, పిల్లలకు తాము అనే ఒక గుర్తింపును అర్థాన్ని కల్పిస్తాయి. ఇందువల్ల ఇతర సంస్కృతులను గుర్తింపులను వారు ప్రశంసించగలుగుతారు.
ఈ క్రింది వాటిలో మరింత సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

  1. (1) (A) మరియు (R) రెండూ సరైనవే కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
  2. (2) (A) సరైనదే కాని (R) సరైంది కాదు.
  3. (3) (A) సరైనది కాదు కాని (R) సరైనది.
  4. (4) (A) మరియు (R) రెండూ సరైనవే మరియు (R) అనేది (A) కి సరైన వివరణ.
See answer and solution
Q120

పాఠ్యపుస్తకంలో రచయితలు రాసిన కథలు, కవితలు, నాటికలు ఇతర రూపాలలో ఉండే రచనలుంటాయి. వాటిల్లోంచి మనం ఎంపిక చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే :

  1. (1) పాఠ్యపుస్తకాలలో ఉపయోగించేందుకు రాయబడినవి.
  2. (2) ప్రఖ్యాత రచయితలు రాసినవి.
  3. (3) అవి సరళ భాషలో ఉన్నాయి.
  4. (4) ప్రామాణికమైనవి, అవి సహజభాషలో ఉన్నవి.
See answer and solution

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆంధ్రదేశ చరిత్రలో బృహత్ శిలాయుగం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఎందుకంటే క్రీ.పూ. 800ల ప్రాంతంలో ముడి ఇనుప ఖనిజాన్ని కరిగించి, ఇనుప పనిముట్ల తయారీ ప్రారంభమై జీవన విధానంలో పెనుమార్పుకు దారి తీసింది. చనిపోయిన వారిని భూమిలో పాతిపెట్టి, గుంటను పూడ్చి చుట్టూ పెద్ద పెద్ద గుండురాళ్ళను గుండ్రంగా నాటడంవల్ల ఈ యుగాన్ని బృహత్ శిలాయుగమని, అలాగే ఇనుము వాడకంలోకి రావడంవల్ల ఇనుపయుగమని పిలుస్తారు. మరణించిన వారికి సమాధులు కట్టే ఆచారమున్న ఆనాటి ప్రజలు, సమాధుల ముందు చనిపోయినవారి ఆకారాలను రాతిలో చెక్కి పాతి పెట్టారు. వరంగల్ జిల్లా కాటారం, ఖమ్మం జిల్లా గలభ గూడెం వద్ద క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిన శిలువాకారపు శిల్పాలను ఇటీవల కనుక్కోవడం జరిగింది. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలంలోని చిన్న మారూరు వద్ద ఒక సమాధిరాతిపై చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టే ముందు తాళ్ళతో కట్టినట్లున్న బొమ్మను చెక్కిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఇది క్రీ.పూ. 8-5 శతాబ్దాల నాటి బొమ్మ. ఇలా ప్రారంభమైన స్మారక శిల్పం, చారిత్రక తొలి యుగంలో బౌద్ధ గాథా శిల్పాలను చెక్కడానికి దోహదం చేసింది.
శిల్పులు కేవలం రాళ్ళమీదే కాక, మట్టి కొయ్య, లోహం, సున్నం మొదలైన ధాతువులతో అపురూపమైన కళాఖండాల్ని సృష్టించి ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతులను అధ్యయనం చేయడానికి ఆధారాల నందించి ఎంతో సేవ చేశారు. శిల్పులు శాసనాలను చెక్కిన శాసన శిల్పులు, బొమ్మలు చెక్కిన లోహశిల్పులు, కొయ్యతో రథాలు, మొదలైన వాటిని తీర్చిదిద్దిన దారు శిల్పులు, సున్నంతో బొమ్మలు చేసిన సుధా శిల్పులుగా శిలా, తామ్ర శాసనాల్లో పేర్కొనబడ్డారు. అంతేకాదు, శిల్పులు సంఘాలుగా ఏర్పడి, వివిధ హోదాలు పొంది సమాజంలో గౌరవాన్నిదక్కించుకొన్నారు. రాజులు, రాణుల కోరిక ప్రకారం ఆలయాలను నిర్మించి, శిల్పాలను చెక్కినాటి సంస్కృతికి అద్దం పట్టి చూపిన శిల్పులు కూడా తమకంటూ ఒక చరిత్రను, సంస్కృతుల్లో ఒక భాగంగా మిగిలిపోయారు. ప్రతిభను కనబరిచి, ఎన్నో బిరుదులు కూడా పొందిన తెలుగు శిల్పులు తమ కులాన్ని, గోత్రాలనూ, వారు ఆరాధించిన దేవతలనూ చెల్లించిన పన్నులు, పన్నులు ఎక్కువని పించినపుడు తిరగబడిన తీరు, పనులు కొరవడినపుడూ, ఇతరుల ఆహ్వానం మీద దూర ప్రాంతాలకు వలసలు పోయిన వైనాలు శాసనాల్లో ఉన్నాయి.
శాసన లేఖకులు :
సింధు నాగరికతలో దొరికిన ముద్రికలపైగల లిపిని మినహా ఇస్తే క్రీ.పూ. 3వ శతాబ్దంలో అశోకుడు వేయించిన రాతి శాసనాలే మనదేశపు తొలి శాసనాలు. మన రాష్ట్రంలో అమరావతి, ఎర్రగుడి, రాజుల మందగిరివద్ద అశోకుని శాసనాలున్న సంగతి తెలిసిందే, శాసనాలు చెక్కేవాళ్ళను శాసన లిపికారులనీ, రాజశాసనాలను చెక్కిన వారిని రాజ లిపికారులని, రాజలేఖకులని పిలిచేవాళ్ళు. క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన ఒక అమరావతీ బ్రాహ్మ శాసనంలో రాజలేఖకుడైన బాలకుని ప్రస్తావన ఉంది. అలాగే గుంటుపల్లి గుహాలయాల వద్ద గల క్రీ.పూ. 1 వ శతాబ్దికి చెందిన శాసనంలో చుల్లగోమకుడనే మరో శాసన లేఖకుని పేరుంది. అటు తరువాత క్రీస్తు శకం 8-9 శతాబ్దాల దాకా, శాసన శిల్పుల పేర్లు శాసనాల్లో కనిపించకపోవటం గమనించాల్సిన విషయం.
విజయవాడ ఇంద్రకీలాద్రి శాసనాన్ని క్రీ.శ. 9వ శతాబ్దంలో విజయాచార్యుడనే శాసనశిల్పి చెక్కాడు. క్రీ.శ. 1076 నాటి చేబ్రోలు శాసనాన్ని గుండోజు, క్రీ.శ. 1097 నాటి వొల్లాల శాసనాన్ని సూత్రధారి జువ్వపాచార్యుడు అనే శిల్పులు మలిచారు. రాజశాసనాలను భద్రపరిచే వారిని అక్షపటలికులనీ, అక్షశాలినులని పిలిచేవారు. క్రీ.శ. 12వ శతాబ్దికి చెందిన కొర్ని, చిన్న బాదాంరాగిరేకు శాసనాన్ని వంశపరంపర శాసనలేఖకులైన మహాక్ష శాలివల్ల మోజు, అతని కొడుకు మాంకన చెక్కారు. నన్నయ రాసిన నందంపూడి శాసనాన్ని గుండాచార్యుడనే ఆస్థాన శిల్పి చెక్కాడు. “ముదిగొండ చాళుక్యరాజు కుసుమాయుధుని కుక్కునూరు రాగిరేకు శాసనాలను బేతాచారి అనే శాసనశిల్పి మలిచినట్లు క్రీ.శ. 13వ శతాబ్ది శాసనం తెలియజేస్తుంది”. అటు తరువాత బయల్పడిన నారాయణపురం, ముఖలింగం, అమరావతి, పాలకొల్లు, ద్రాక్షారామం, చాళుక్య భీమవరం, తిరుపతి, శ్రీకూర్మం మొదలైన చోట్ల గల శాసనాలు, పైదేవాలయాల్లో పారంపర్య హక్కుగల శాసన శిల్పులు ఉండేవారని తెలియజేస్తున్నాము. వరుసగా నారాయణపురంలో ప్రోలాచారి, ముఖలింగంలో లోకాచారి, అమరావతిలో నలపాచార్య, పాల కొల్లులో సరణోజు, రామాచారి, సర్పవరంలో కూనాచారి, ద్రాక్షా రామంలో డాకరేమి సూరాచారి, పెద్దనాచార్య, బేతనాచార్య, వీవరాజేంద్రచోడాచార్య, చాళుక్య భీమవరంలో నాగోజు, శ్రీశైలాచారి, శ్రీకూర్మంలో శంకరుడనే శాసన శిల్పులు ఉద్యోగులుగా చలామణి అయినారు. చివరగా పేర్కొన్న శ్రీకూర్మంలోని వాంకలపూడి శంకరుడనే శిల్పి చక్కటి కవిత్వాన్ని చెప్పి, పద్యాలు కూడా రాయగల లిపికారుడని అక్కడి శాసనం చెబుతుంది. కేవలం శిలా శిల్పులే కాక, ఇతర ధాతువులపై బొమ్మలు చేయగల శిల్పులు కూడా శాసనాలు చెక్కిన ఆధారాలు ఉన్నాయి. క్రీ.శ. 1504 నాటి చాంగాడు రాగిరేకుల్ని ఆ గ్రామంలోని దారుశిల్పి మల్లనాచార్యుడు క్రీ.శ. 1518 నాటి కోకటం శాసనాన్ని అగసాల (బంగారుపని చేసే) బైరోజు క్రీ.శ. 1545 నాటి వేల్పుచర్ల శాసనాన్ని వడ్ల కాణాచికాండు తిన్నోజు మలిచినట్లు నాటి ఆయా శాసనాలు తెలియజేస్తున్నాయి.
రాతిపై బొమ్మను చెక్కేవాళ్ళను శిలా శిల్పులనీ కొండలు, బండలనుంచి రాతిని వేరుచేసే వాళ్ళను పాషా(సా)ణికులనే వాళ్ళు. అమరావతిలోని క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన ఒక శాసనంలో పాసానికుని ప్రస్తావన ఉంది. ప్రాచీనాంధ్ర శాసనాల్లో శిలా శిల్పులలోని వివిధ వర్గాలను తెలిపే అనేక ఆధారాలున్నాయి. కొంత మంది పాసాని కుల పనులను పర్యవేక్షించే శిల్పుల్ని ఆవేశనులంటారు. బౌద్ధస్థావరమైన జగ్గయ్యపేట శాసనంలో సిద్ధార్థ, నాగచంద్ర అనే ఆవేశనుల గురించి ఉంది. స్ఫటికం, రత్నం, వజ్రం మొదలైన వాటిపై పనిచేసే వారిని మణికారులంటారు. అమరావతి, భట్టిప్రోలులో లభించిన స్ఫటిక బౌద్ధధాతు పేటికలను క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన మణికారులు చేశారు. రాళ్ళను కట్టడాలకు అనువుగా మలిచే వాళ్ళను శిలావద్దకు లనేవాళ్ళు. బొమ్మలను చెక్కేవాళ్ళను శిలాకమ్మికులనీ, వీరి పర్యవేక్షకుల్ని శిలా కమ్మాంతికులనీ, అలాగే కట్టడాల మరమ్మతులు చేసేవారిని నవ కమ్మికులనీ, వీరి పర్యవేక్షకుల్ని మహానవ కమ్మికులనీ, నవకమ్మిక ప్రధానులనీ శాసనాలు పేర్కొంటున్నాయి. అమరావతి బౌద్ధ స్తూప, విహారాల మరమ్మతులను చేపట్టిన బౌద్ధ, రక్షిత అనే నవ కమ్మికుడు, ఆదిత్య ధమ్మ రక్షితులనే మహాసవ కమ్మికలు, చంద అనే ప్రధాన నవకమ్మికుల వివరాలను క్రీ.శ. 1-2 శతాబ్దాల నాటి అమరావతి శాసనాలు వెల్లడిస్తున్నాయి. నాగార్జునకొండలోని బౌద్ధకట్టడాల నిర్మాణ, జీర్ణోద్ధరణ పనులు ఆనంద, చందముఖి, ధమ్మనంది, విధికులనే నవ కమ్మిక, శిలావద్దకుల పర్యవేక్షణలో జరిగాయి.
హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్ట వద్ద క్రీ.శ. 4వ శతాబ్దికి చెందిన ‘తొలచువాన్లు’ అనే శాసనం రాతి శిల్పులను సూచిస్తుంది. ప్రకాశం జిల్లా భైరవకొండ గుహాలయాలను తొలచిన శిల్పుల్లో వేలుగుంట ఆచార్లు కుఱవది ఆచార్లుగా అక్కడున్న క్రీ.శ. 7వ శతాబ్దపు శాసనాలు తెలియజేస్తున్నాయి.
రాతిపై పనిచేసే శిల్పులను కాసెవారనీ, కాశాచార్లనీ శాసనాలు పేర్కొంటున్నాయి. క్రీ.శ. 9వ శతాబ్దపు సంగమేశ్వరం శాసనంలో యాగోజు కాశాచారి, క్రీ.శ. 12వ శతాబ్దపు వలివేరు శాసనంలో కాసె.... మోజుల ప్రస్తావన వుంది. వాస్తు, శిల్ప శాస్త్రాలలో ప్రావీణ్య ముండి చేతిలో సూత్రం (దారం) ధరించే ఆలయ నిర్మాణం పర్యవేక్షకుల్ని సూత్రధారులంటారు. క్రీ.శ. 1097-1202 సం॥ల మధ్యకాలపు వొల్లాలి, మాచర్ల, పానగల్లు, ముక్కామల, జలాల్‌పురం శాసనాల్లో వరుసగా జువ్వపాచార్య, నాగాచార్య, తిప్పోజు, బమ్మోజు, బొమ్మలయ్య, కాసెమల్లోజులనే సూత్రధారుల గురించి చెప్పబడింది. ఈ సూత్రధారులు తమ అదుపు ఆజ్ఞలకు లోబడి పనిచేసే తక్షకి, వర్ధకుల పనులను పర్యవేక్షిస్తూ, స్థపతుల ఆదేశాలను అమలు చేస్తుండేవాళ్ళు.

Q121

నందంపూడి శాసనశిల్పి పేరు :

  1. (1) గుండాచార్యుడు
  2. (2) జువ్వపాచార్యుడు
  3. (3) మాంకన
  4. (4) బేతాచారి
See answer and solution
Q122

ఏ శాసనంలో చుల్ల గోనుకుడు పేరు కనిపిస్తుంది ?

  1. (1) క్రీ.పూ. 3వ శతాబ్దికి చెందిన శాసనం
  2. (2) క్రీ.శ. 9వ శతాబ్దికి చెందిన శాసనం
  3. (3) క్రీ.శ. 1097 కి చెందిన శాసనం
  4. (4) క్రీ.పూ. 1వ శతాబ్దికి చెందిన శాసనం
See answer and solution
Q123

కీసరగుట్ట శాసనం ఏ శతాబ్దిది ?

  1. (1) క్రీ.శ. 1504
  2. (2) క్రీ.శ. 1518
  3. (3) క్రీ.శ. 1545
  4. (4) క్రీ.శ. 4వ శతాబ్ది
See answer and solution
Q124

వొల్లాల శాసన సూత్రధారి :

  1. (1) జువ్వపాచార్యుడు
  2. (2) బేతాచారి
  3. (3) గుండోజు
  4. (4) బాలకుడు
See answer and solution
Q125

పాసానికులంటే ఎవరు ?

  1. (1) సున్నంతో బొమ్మలు చేసేవారు
  2. (2) కొయ్యతో రథాలు చెక్కినవారు
  3. (3) శిలలతో శిల్పాలు చెక్కినవారు
  4. (4) బండలనుంచి రాతిని వేరు చేసేవారు
See answer and solution
Q126

ఇంద్రకీలాద్రి శాసనాన్ని చెక్కిన శిల్పి :

  1. (1) జువ్వపాచార్యుడు
  2. (2) విజయాచార్యుడు
  3. (3) బేతాచారి
  4. (4) గుండోజు
See answer and solution
Q127

సుధా శిల్పులు అంటే ఎవరు ?

  1. (1) బొమ్మలు చెక్కిన లోహ శిల్పులు
  2. (2) కొయ్యతో చెక్కిన దారు శిల్పులు
  3. (3) సున్నంతో బొమ్మలు చేసినవారు
  4. (4) శాసన శిల్పులు
See answer and solution
Q128

ఈ క్రింది వారిలో కవిత్వం, పద్యాలు రాయగల లిపికారుడు :

  1. (1) నాగాచార్య
  2. (2) వాంకలపూడి శంకరుడు
  3. (3) నాగచంద్ర
  4. (4) మల్లనాచార్యుడు
See answer and solution

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
హైదరాబాద్‌లో కుందుర్తి ఆంజనేయులు గారు (1922-1982) వచన కవిత్వంపై అభిమానంతో ఫ్రీవర్స్ ఫ్రంట్ అని ఒక సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ వారు 1967 నుంచి ఇప్పటి వరకు – పద్దెనిమిది మంది వచన కవిత్వ పుస్తకాలకు బహుమతులిచ్చారు. వేగుంట మోహన్ ప్రసాద్, నగ్నముని, చెరబండరాజు, శివారెడ్డి, రేవతీదేవి వంటి కవులకు పూర్వం బహుమతులు లభించాయి.
ఫ్రీవర్స్ ఫ్రంట్ వారు ఈ సారి 1988 సంవత్సరపు అవార్డు కొండేపూడి నిర్మల రచించిన ‘సందిగ్ధ సంధ్య’ అనే కవితా సంపుటికి ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఈమె ఆధికారికంగా మంచి కవిత్వం రాసి మన్ననలు పొందింది. ఆమె కవితల్ని ఈ శీర్షికలో అప్పుడప్పుడు పరామర్శించాను. ఈ శీర్షికలో పరామర్శించబడ్డ కవులు తరువాత ఇంకా మంచి కవిత్వం రాసి, తగిన గుర్తింపు పొంది, అవార్డులు కూడా అందుకోటం చేరాతలకు సంతోష కారణమే. ఈ అవార్డు ప్రదానం కుందుర్తి జయంతి (జననం : 1922 డిసెంబర్ 16) సందర్భంగా జరుగుతుంది. ఈ సారి ఈ ప్రదానం డిసెంబరు 17న జరిగింది.
సత్యమూర్తి (కుందుర్తి గారబ్బాయి) కుందుర్తి చనిపోయిన (1982 అక్టోబరు 25) తరువాత ప్రతి సంవత్సరమూ అచ్చుకాకుండా మిగిలిపోయిన ఆయన రచనలు అచ్చేయించి అవార్డు ప్రదానంతో పాటు ఆవిష్కరింపజేస్తుంటారు. హంస ఎగిరిపోయింది, తీరా నేను కాస్తా ఎగిరిపోయాక, మేఘామాల, ఇది నా జెండా అనే కావ్యాలు కుందుర్తిగారు పోయిన తరువాతే వచ్చాయి. కుందుర్తి గారి అసంపూర్ణ ఆత్మకథ ‘బతుకుమాట’ పేరుతో ఈ సారి వచ్చింది.
అసలు ఆత్మకథలన్నీ అసంపూర్ణంగానే ఉంటాయి. అందుకు ప్రధానంగా మూడు కారణాలు. ఒకటి జీవితానికి ముగింపు ఎప్పుడొస్తుందో తెలీదు. రెండు, జీవిత చరిత్రలు సాధారణంగా నడి వయస్సు దాటిన తరువాతనే రాస్తుంటారు కాబట్టి గ్రంథస్థ విషయాల ప్రాధాన్యం, వాస్తవికత, వారి జ్ఞాపకాల పరిమితికి లోబడి ఉంటుంది. మూడు, ఎంతటి నిజాయితీ పరుడికైనా మరొకరితో పంచుకోలేని అనుభవాలు ఉండొచ్చు. ఆ Private Corner ఎప్పటికీ బయటికి రాకపోవచ్చు.
కుందుర్తి గారికి ఆత్మకథ రాయాలన్న కోరిక అసలు లేదు. కవి శివారెడ్డి ‘గురువు గారూ, మీ అనుభవాలు రాయగూడదూ’ అని ఒకటి రెండు సార్లు అడిగి ప్రేరేపించాడు. (ఈ ‘గురువు గారూ’ అనే ప్రయోగం మీద కొంత ఆసక్తికరమైన చర్చ చేశారు ఈ పుస్తకంలో).
అంతే కాదు, కుందుర్తిగారు మధ్యమధ్యలో పాఠకులతో వాదనకు దిగుతారు. అది ఆయన ఎక్కడ అలవర్చుకున్నారో గాని దానివల్ల మొదటి పేజీల్లో ఏదో హాస్యరచన చేస్తున్నట్టు రాశారు. అసలు సమస్య ఏమిటంటే మిత్రులు రాయమంటున్నారు. తనకి రాయాలని లేదు. బలవంతపు బ్రాహ్మణార్థంగా రాశారు. చివర ఇచ్చిన డైరీల నోట్సుతో తారీకులు కనిపిస్తాయి గాని, ఇంకెక్కడా తారీకులియ్యలేదు. ఒక్కచోట తప్ప సంవత్సరాలు కూడా ఇయ్యలేదు. 1939లో బెజవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో (ఇక్కడే ఆయనకు విశ్వనాథ సత్యనారాయణగారి శిష్యరికం అబ్బింది) చదువుకుంటున్నప్పుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు గార్ల పరిచయం ప్లస్ కమ్యూనిస్టు సాహిత్య పరిచయం ఏర్పడిందనీ, ఆ తరువాత కూడా కొంత కాలం జాతీయవాదిగానే ఉండేవాణ్ణి అనీ రాశారు. కుందుర్తి జీవితాన్నీ కవితా జీవితాన్నీ పరిశీలించిన వారికి కుందుర్తి ఎప్పుడూ జాతీయ వాదిగానే ఉన్నట్టు కనిపిస్తాడు. అంతర్జాతీయత ఆయన ఒంటికి అంత పట్టినట్టు లేదు. అందుకే సుప్రసన్న తన దృక్పథానికి అనుకూలంగా కుందుర్తిని వ్యాఖ్యానించగలిగాడు. 1962లో చైనాను శపిస్తూ కోరస్ రచనలు చేసిన కవుల జాబితాలో కుందుర్తి గారు కూడా ఉన్నారు.
కుందుర్తి ఆత్మకథ విస్తృతి చాలా చిన్నదైనా కొన్ని విలువైన విషయాలున్నై. ముఖ్యంగా అభ్యుదయోద్యమంలో కృషి చేసిన కొందరి గురించి ఈ పుస్తకంలో దొరుకుతుంది. పోలూరి ఆంజనేయ ప్రసాద్, దేశిరాజు కృష్ణశర్మ అంటే ఎవరా అని చాలా రోజులు మధన పడేవాణ్ణీ. ఇప్పుడు వాళ్ల గురించి కొంత తెలుసుకోవచ్చు. అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, సి.వి. కృష్ణారావు గార్ల వంటి అభ్యుదయ కవులతో కుందుర్తిగారి సాన్నిహిత్యం, వారు కలిసి కృషి చేసిన తీరు ఈ పుస్తకంలో దొరుకుతుంది.
నర్సరావుపేటలో కుందుర్తి ఆంజనేయులు గారూ, ఆయన మిత్రులూ కలిసి నవ్యకళా పరిషత్ అని ఒకటి ఏర్పరచటానికీ, దానికి కావల్సిన డబ్బు సమకూర్చటానికీ, మీటింగ్ పెట్టి వక్తలను పిలిపించటానికీ ఎన్నెన్ని అవస్థలుపడ్డారో చాలా వివరంగా వర్ణించారు. నిజానికి ఇదొక్కటే మనకు వివరంగా కనిపించేది. అసలు ఈ ఒక్కదాన్ని గురించి తెలుసుకోటానికైనా ఈ పుస్తకం కొని చదవదగింది. దాని ప్రముఖ్యం ఏమిటో కుందుర్తి గారి మాటల్లోనే చూడండి.
‘ఆ విధంగా నర్సరావుపేటలో నవ్యకళా పరిషత్ వేదికమీద శ్రీశ్రీ ప్రారంభించిన సాహిత్య విప్లవంలో రెండో దశ ప్రారంభమైంది. సాహిత్య రంగంలో అభ్యుదయ కవితా విప్లవం సర్వవ్యాప్తం కావడానికి అవసరమైన తొలి బీజాలు పడ్డాయి’ (పేజీ 89) ఇంత ముఖ్యమైన సంఘటనకు తారీకు కాదు గదా సంవత్సరం కూడా దొరకదు. ఆ సభ గురించి కోలవెన్నురామకోటేశ్వరరావుగారు త్రివేణిలో సంపాదకీయం కూడా రాశారట! దాని వివరాలూ తెలీదు. తరువాత 1944లో అచ్చయిన నయాగరా అనే కవితా సంపుటిలో చేరిన కొన్ని పద్యాలు ఈ వేదికమీద చదివినట్టు కుందుర్తి గారు రాశారు. అవి కుందుర్తి ‘జయిస్తుంది’, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి ‘ప్రజాశక్తి’ అనేవి. ఇవి 1941 అక్టోబరులో రాసినట్లు ‘నయాగరా’లో కనిపిస్తుంది. దాన్ని బట్టి ఈ కళాపరిషత్ సభ 1941 అక్టోబరుకు కొన్ని నెలల ముందు జరిగినట్టు ఊహించవచ్చు. ఎంత ముందో చెప్పలేమనుకోండి. త్రివేణి పత్రిక సంపుటాలు తిరగేస్తే ఈ సభ వివరాలు దొరుకుతాయనుకుంటాను. అభ్యుదయ సాహిత్య ప్రారంభ వికాసాలను పరిశోధించదల్చుకున్న వారు ఈ పనిచేస్తారని ఆశిస్తాను.

Q129

ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఎప్పటి నుండి ఇస్తున్నారు ?

  1. (1) 1967
  2. (2) 1982
  3. (3) 1988
  4. (4) 1922
See answer and solution
Q130

కుందుర్తిని ఆత్మకథ రాయమని ప్రేరేపించింది :

  1. (1) శివారెడ్డి
  2. (2) కొండేపూడి నిర్మల
  3. (3) రేవతీ దేవి
  4. (4) సత్యమూర్తి
See answer and solution
Q131

ఈ క్రింది వాటిలో కుందుర్తి ఆత్మకథ :

  1. (1) బతుకు మాట
  2. (2) మేఘమాల
  3. (3) ఇది నా జెండా
  4. (4) సందిగ్ధ సంధ్య
See answer and solution
Q132

1988 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు విజేత :

  1. (1) రేవతిదేవి
  2. (2) నగ్నముని
  3. (3) శివారెడ్డి
  4. (4) కొండపూడి నిర్మల
See answer and solution
Q133

నయాగరా కవితా సంపుటి వెలువడిన సంవత్సరం :

  1. (1) 1967
  2. (2) 1944
  3. (3) 1982
  4. (4) 1988
See answer and solution
Q134

కుందుర్తిని తన దృక్పథానికి అనుకూలంగా వ్యాఖ్యానించింది :

  1. (1) విశ్వనాథ
  2. (2) బెల్లంకొండ రామదాసు
  3. (3) ఏల్చూరి సుబ్రహ్మణ్యం
  4. (4) సుప్రసన్న
See answer and solution
Q135

సందిగ్ధ సంధ్య ఎవరి రచన ?

  1. (1) నగ్నముని
  2. (2) చెరబండరాజు
  3. (3) కొండేపూడి నిర్మల
  4. (4) వేగుంట మోహన్ ప్రసాద్
See answer and solution
Q136

పిల్లలు జతగా కూడి పని చేసేందుకు కావలసిన ఒక వీడియో బోధించాల్సిన అంశానికి సంబంధించి యోగ్యమైనదిగా ఉపాధ్యాయురాలు భావించింది. ఆ వీడియో ప్రకారమే ప్రణాళిక చేసుకుంది.
ఈ జతగా కూడి పని చేసే కార్యకలాపం విద్యార్థులకు సంబంధించి ఏ లక్ష్యానికి ఉపకరిస్తుంది ?

  1. (1) ఇద్దరూ కలిసి వేగం పని చేసేందుకు ఉపకరిస్తుంది.
  2. (2) ఉపాధ్యాయురాలితో పనిలేకుండా స్వతంత్రంగా పని చేస్తారు.
  3. (3) భాషా చైతన్యం వృద్ధి పరుస్తుంది.
  4. (4) తమ పనిని అంచనా వేసుకుంటారు.
See answer and solution
Q137

భాషా అభ్యసనం కొరకు కొన్ని కథలు, మరికొన్ని ఇతర కథనాలు అనుబంధ వాచకంగా నిర్దేశించబడ్డాయి. ఈ అనుబంధ వాచకం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి ?

  1. (1) తీక్షణ పఠనాన్ని ప్రోత్సహించటం
  2. (2) నైతిక విషయాలు నేర్చుకునేందుకు ప్రోత్సహించటం
  3. (3) విస్తృత పఠనాన్ని ప్రోత్సహించటం
  4. (4) బహుళ భాషావాదం ప్రోత్సహించటం
See answer and solution
Q138

ఉద్దేశం (A) : బోధన అభ్యసన క్రమంలో పరిహార బోధన ఒక అంతర్భాగం.
వివరణ (R) : పరిహార బోధన తిరిగి బోధించడానికి భాషా అంశాలు సరిగా నేర్చుకోనప్పుడు తిరిగి అదే పద్ధతిలో కాకుండా ఇంకొక పద్ధతిలో చెప్పడానికి.
ఇచ్చిన ఐచ్చికాలలో మరింత సముచితమైన సమాధానం ఎంపిక చేయండి.

  1. (1) (A) మరియు (R) రెండూ సరైనవి కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
  2. (2) (A) సరైనది కానీ (R) సరైనది కాదు.
  3. (3) (A) సరైనది కాదు కానీ (R) సరైనది.
  4. (4) (A) మరియు (R) రెండూ సరైనవి (R) అనేది (A) కు తగిన వివరణ.
See answer and solution
Q139

ఒక విద్యార్థి చదివిన కథను ఆ విద్యార్థి మాటల్లోనే తిరిగి చెప్పించటం అనేది దీనిని అంచనా వేయటంలో సహాయపడుతుంది.

  1. (1) ధారాళత
  2. (2) అర్థం అవగత పరచుకోవటం
  3. (3) జ్ఞాపకం
  4. (4) కచ్చితత్వం
See answer and solution
Q140

ఈ క్రింది వాటిలో భాషా బోధనకు సంబంధించి సరైన అంచనా కాదు ?

  1. (1) అభ్యాసకుల ప్రథమ భాష, భాష నేర్చుకోవటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.
  2. (2) భాషా బోధనకు భావ ప్రసార కార్యక్రమాల పట్ల దృష్టి ఉండాలి.
  3. (3) భాషా బోధనలో మాట్లాడటం కంటే రాయటానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  4. (4) వాస్తవ పరిస్థితులలో ఉపయోగించేందుకు యత్నించటం ద్వారా అభ్యాసకులు భాషా సముపార్జన చేస్తారు.
See answer and solution
Q141

భాషా ఉపాధ్యాయుడికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక బాధ్యత ?

  1. (1) బోధనా విషయం ఎంపిక చేసుకోవటం
  2. (2) చిన్న తరగతులుగా విద్యార్థులను బృందాలుగా చేయటం
  3. (3) అభ్యాసకులకు బోధన చేయటం
  4. (4) అభ్యాసకుల భావప్రసార అవసరాలు గుర్తించటం
See answer and solution
Q142

పిల్లలు ప్రాథమిక అభ్యాస దశలో సౌకర్యవంతంగా ఉంటారు ఉత్తమంగా నేర్చుకుంటారు.

  1. (1) అధికార భాషలో
  2. (2) తమ ఇంటిభాషలో
  3. (3) ఆంగ్లమాధ్యమంలో
  4. (4) బోధనా మాధ్యమంలో
See answer and solution
Q143

పిల్లలకు కథ చెప్పటంలో ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు ?
కథలు వినటం పిల్లలకు సహాయకారిగా ఉంటుంది –

  1. (1) వాక్య నిర్మాణం అభ్యసిస్తారు
  2. (2) సమస్యా పరిష్కార నైపుణ్యాలు పెంపొందించుకుంటారు
  3. (3) జీవితంలో ఆచరించడానికి కావలసిన కొత్త నైతిక విలువలు నేర్చుకుంటారు
  4. (4) కొత్త పదాలు నేర్చుకుంటారు పదసంపదను విస్తృత పరచుకుంటారు
See answer and solution
Q144

ఒక భాషా కార్యకలాపంలో ఉపాధ్యాయురాలు భిన్న సామర్థాలు గల విద్యార్థి బృందాలను కలగలిపింది. ఈ చిన్న సామర్థాల బృందం దేనికి ఉద్దేశించబడింది ?

  1. (1) స్వేచ్ఛగా వ్యక్తీకరించటానికి, విద్యార్థులు ఆధిక్యత చూపటానికి స్థలం కల్పించడం
  2. (2) ఒకరికొకరు తోడ్పాటునిచ్చుకునేందుకు విద్యార్థులను ప్రోత్సహించటం
  3. (3) అందరి విద్యార్థులపై టీచర్ దృష్టిపెట్టలేరు కనుక వారి పని భారాన్ని పంచుకోవటం
  4. (4) వెనకబడిన విద్యార్థులను గుర్తించటం
See answer and solution
Q145

విద్యార్థులను వీటికి పరిచయం చేయాలి. నిమగ్నులయ్యేట్లు చూడాలి :

  1. (1) చిన్న వయసునుండే రెండు లిఖిత భాషలు
  2. (2) చిన్న వయసునుండే బహుళ మౌఖిక భాషలు
  3. (3) చిన్న వయసునుండే బహుళ లిఖిత భాషలు
  4. (4) చిన్న వయసునుండే రెండు మౌఖిక భాషలు
See answer and solution
Q146

ఉద్దేశం (A) : అక్షరాస్యతా పూర్వదశలో బొమ్మలు గీయటం అనేది లేఖనానికి ప్రారంభంగా పరిగణన ఉంది.
వివరణ (R) : బొమ్మలు ప్రతీకలు అవి అర్థాన్ని మోస్తాయి.
క్రింద ఇచ్చిన ఐచ్చికాలలో అత్యంత సముచిత సమాధానం గుర్తించండి.

  1. (1) (A) మరియు (R) రెండూ సరైనవి కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
  2. (2) (A) సరైనది కానీ (R) సరైనది కాదు.
  3. (3) (A) సరైనది కాదు కానీ (R) సరైనది.
  4. (4) (A) మరియు (R) రెండూ సరైనవి (R) అనేది (A) కి సరైన వివరణ.
See answer and solution
Q147

‘మినిమల్ పెయిర్’ డ్రిల్ అనేది దేనిని వృద్ధి పరచటంలో ప్రభావశీల వ్యూహంగా ఉపయోగిస్తుంది.

  1. (1) పదజాలం
  2. (2) ఉచ్చారణ
  3. (3) చదివి అర్థం చేసుకోవటం
  4. (4) వ్యాకరణం
See answer and solution
Q148

ఈ క్రింది వాటిలో ఏది భాషా సముపార్జనకు సంబంధించిన ప్రవర్తనావాద సిద్ధాంతంతో సంబంధం లెని విషయం __________.

  1. (1) ఖాళీ పాత్ర
  2. (2) యత్న మరియు దోష
  3. (3) సామాజిక సంపర్కం
  4. (4) సక్రియాత్మక నియంత్రణ
See answer and solution
Q149

5వ తరగతి ఉపాధ్యాయురాలు తరగతి గదిలో విద్యార్థులకు కథ రాయమనే పని అప్పగించింది. విద్యార్థులు కథ రాస్తూ ఉండగా వారి మధ్యనే తిరుగుతూ పొరపాట్లు చేసే వారికి లేదా కొత్త పదాలు అడిగే వారికి సహాయ పడుతూ ఉన్నది. ఇక్కడ ఉపాధ్యాయురాలు ఏ పాత్రను పోషిస్తున్నది ?

  1. (1) ప్రణాళికాకర్త
  2. (2) దోహదకారి
  3. (3) పరీక్ష చేసే వ్యక్తి
  4. (4) మేనేజర్
See answer and solution
Q150

ఉద్దేశం (A) : పఠనం అంటే పదాన్ని సరిగ్గా ఉచ్చరించటం మాత్రమే కాదు అంతకు మించినది.
వివరణ (R) : పఠనం అంటే డీకోడింగ్.
క్రింద ఇచ్చిన ఐచ్చికాలలో అత్యంత సముచిత సమాధానం గుర్తించండి.

  1. (1) (A) మరియు (R) రెండూ సరైనవి కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
  2. (2) (A) సరైనది కానీ (R) సరైనది కాదు.
  3. (3) (A) సరైనది కాదు కానీ (R) సరైనది.
  4. (4) (A) మరియు (R) రెండూ సరైనవి (R) అనేది (A) కి సరైన వివరణ.
See answer and solution