By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 1 Telugu, Question 109

Topic: Remedial teaching

Q109

భాష నేర్చుకోవడానికి సంబంధించి ఒక ఉపాధ్యాయురాలు, కొన్ని కోణాలను కనుగొన్నది. ఉదాహరణకు : శాస్త్రీయ భావనలకు సంబంధించిన వాచకం అర్థం చేసుకుని చదవటం. ఈ కోణంలో ఏయే విద్యార్థులకు ఈ విషయంలో ఇబ్బంది ఉందో గుర్తించింది. వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు వాచకం చదివి అర్థం చేసుకునేందుకు తోడ్పడింది. ఆమె ఆచరణలో పెడుతున్న విషయాన్ని ఏమంటారు ?

  1. (1) ఉన్నత శ్రేణి నైపుణ్యాలు
  2. (2) ఆలోచనా నైపుణ్యాలు
  3. (3) ఫీడ్‌బ్యాక్ బోధన
  4. (4) పరిహార బోధనCorrect answer

Solution.

CBSE answer: (4)

జవాబు: (4) పరిహార బోధన

  1. ఉపాధ్యాయురాలు మొదట శాస్త్రీయ వాచకాన్ని అర్థం చేసుకోలేకపోతున్న విద్యార్థులను గుర్తించింది.
  2. తర్వాత వారికే ప్రత్యేక తరగతులు పెట్టి ఆ లోపాన్ని పూరించడానికి సహాయం చేసింది.
  3. లోపాన్ని గుర్తించి, ప్రత్యేకంగా సరిదిద్దే ఈ ప్రక్రియనే పరిహార బోధన అంటారు.

జాగ్రత్త: ఉన్నత శ్రేణి, ఆలోచనా నైపుణ్యాలు విద్యార్థుల సామర్థ్యాలు, బోధనా పద్ధతి పేర్లు కావు; ఇక్కడ జరిగింది కేవలం ఫీడ్‌బ్యాక్ కాదు.